వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టర్కీపై అమెరికా ఆంక్షలు: పడిపోయిన రూపాయి మారకం, పతనమైన మార్కెట్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం భారీ నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు చివరకు కూడా భారీ నష్టాలనే మిగిల్చాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఈరోజు భారీగా పతనమవడం మార్కెట్లపై బాగా ప్రభావం చూపింది.

ఐటీ, ఫార్మా రంగ షేర్లు లాభాలను నమోదు చేసినప్పటికీ బ్యాంకింగ్‌, ఇంధన, లోహ, ఆటో తదితర రంగాల షేర్లు నష్టాలను మూటగట్టుకోవడంతో సూచీలు డీలా పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టర్కీపై ఆంక్షలు విధించడంతో ఆ దేశా కరెన్సీ టర్కీష్‌ లిరా విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనపడ్డాయి.

Rupee plunges over 100 paise to all-time low vs USD on Turkish lira’s record weakness

కాగా, బీఎస్‌ఈ సెన్సెన్స్‌ 268 పాయింట్ల నష్టంతో 37,600 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 11,356 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు చివరకు సెన్సెక్స్‌ 224.33 పాయింట్ల నష్టంతో 37645 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.70 పాయింట్లు నష్టపోయి 11355.75 పాయింట్లకు చేరింది.

భారీగా పతనమైన రూపాయి

సోమవారం రూపాయి విలువ భారీగా పతనమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే జీవనకాల కనిష్ఠానికి చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.69.62 పైసలకు దిగజారిపోయింది. ఏకంగా 78 పైసలు పతనమైంది.

English summary
Indian stock markets (Sensex and Nifty) ended in negative territory on Monday following the rout in the global financial market due to record weakness in Turkish lira with Indian rupee falling more than 100 paise to a fresh all-time low against US dollar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X