వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రలో తొలిసారి: డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.12

|
Google Oneindia TeluguNews

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవన కాల కనిష్టానికి చేరుకుంది. డాలర్‌కు అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతుండటంతో రూపాయి గురువారం మరింత క్షీణించింది. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో మరింత పతనమై రూపాయి చరిత్రలో తొలిసారిగా 72మార్క్‌ను దాటింది.

గురువారం ట్రేడింగ్ ఆరంభంలో రూపాయి కాస్త కోలుకున్నట్లే కనిపించింది. తొలి గంటల్లో 9పైసలు పుంజుకుని 71.66వద్ద ట్రేడ్ అయ్యింది. అయితే, బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో అనిశ్చితులు, చమురు ధరలు పెరగడంతో మళ్లీ రూపాయి పతనం మళ్లీ ప్రారంభమైంది.

Rupee reaches new low of 72.12, plunges 37 paise against US dollar

ప్రతిష్టాత్మక 72 మార్క్‌ను దాటి 37పైసలు పెరిగి 72.12 వద్ద జీవనకాల కనిష్ట స్థాయికి పతనమైంది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.05 వద్ద కొనసాగుతోంది.

English summary
The Indian rupee Thursday crashed below the 72-level for the first time ever on persistent global headwinds and concerns on macroeconomic front.
Read in English: Rupee hits new low of 72.12
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X