వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరింత క్షీణించిన రూపాయి: డాలర్‌తో మారకం రూ.73.77
ముంబై: రూపాయి మారకం విలువ రోజు రోజుకు క్షీణిస్తోంది. తాజాగా గురువారంనాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 43పైసలు నష్టపోయి 73.77 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 850పాయింట్లు, నిఫ్టీ 260
ముడిచమురు ధరలు పెరగడంతో విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తాయని, కరెంటు ఖాతా లోటు పెరగొచ్చని ఆందోళనలు వెళ్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఆయిల్ రిఫైనరీలు తదితర దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం కూడా రూపాయి బలహీనతకు కారణమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కాస్త కోలుకున్నా కనిష్టస్థాయిలోనే కొనసాగుతోంది. గురువారం ఉదయం 9.45గంటల ప్రాంతంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 33పైసల నష్టంతో 73.67గా కొనసాగుతోంది. మరో వైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలతో కొనసాగాయి.