వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత క్షీణించిన డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.48

|
Google Oneindia TeluguNews

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కొనసాగుతూనే ఉంది. గురువారం మరో 24 పైసలు పతనమవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ ఓ దశలో రూ.74.48తో జీవనకాల కనిష్ఠానికి చేరింది.

అమెరికా కరెన్సీకి దిగుమతిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌, ద్రవ్యలోటు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోతోందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ దెబ్బతో గురువారంనాటి స్టాక్‌మార్కెట్లు కూడా కుదేలైపోతున్నాయి.

 Rupee Sinks To New Low Of 74.48 Against US Dollar

కాగా, బుధవారం రూపాయి రికార్డు కనిష్ఠం నుంచి కోలుకుంది. చివరకు 19 పైసలు బలపడి 74.20 వద్ద ముగిసింది. కాగా గురువారం ఫారెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభంలోనే రూపాయి మారకం విలువ పతనమై రూ.74.37 వద్ద మొదలైంది.

ఆ తర్వాత మరింతగా క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠమైన రూ.74.45పైసలకు చేరింది. నిన్న విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1096కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా పెరగడం మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
The rupee extended its losses to hit an all-time low of 74.48 against the US dollar on Thursday, reported news agency Reuters. It opened weak at 74.37 and slipped further to quote a lifetime low of 74.48, down 0.4 per cent against the US dollar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X