వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొండిబకాయిలు: 4,876వేల కోట్ల నష్టాలను నమోదు చేసిన ఎస్బీఐ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ నష్టాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.4,876కోట్లు నష్టపోయినట్లు ఎస్బీఐ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మొండిబకాయిలు 70శాతం పెరగడంతో భారీ నష్టాలను చవిచూసింది.

గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.2,000కోట్ల నికర లాభం నమోదు చేయగా, ఈసారి మాత్రం భారీగా నష్టపోయింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సంస్థ ఆదాయం పెరిగింది.

SBI reports shock loss of Rs 4,876 crore in Q1

గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.62,911.08కోట్ల ఆదాయం రాగా, ఇప్పుడు రూ.65,492.67కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 9.97శాతం పెరగగా, ఈ ఏడాది జూన్‌ నాటికి 10.69 శాతానికి పెరిగినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది.

గతంలో రూ.1,88,068కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది రూ.2,12,840కోట్లుగా ఉన్నాయి. అయితే నికర నిరర్ధక ఆస్తులు మాత్రం గతంతో పోలిస్తే తగ్గాయి.

గత ఏడాది ఇవి 5.97శాతంగా ఉండగా, ఈసారి 5.29శాతానికి తగ్గాయి. అంటే గత ఏడాది రూ.1,07,560కోట్ల నికర నిరర్ధక ఆస్తులు ఉండగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.99,236కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంకు ప్రొవిజన్లు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. గతంలో రూ.8,929.48కోట్లుగా ఉండగా ఇప్పుడు రూ.19,228కోట్లుగా నమోదయ్యాయని ఎస్‌బీఐ తెలిపింది.

English summary
State Bank of IndiaNSE -4.08 % (SBI) on Friday reported a standalone net loss of Rs 4,875.85 crore for June quarter, which fell way short of Rs 242 crore profit projected by analysts in an ETNow poll. This was third straight quarter of losses for the largest domestic lender in terms of assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X