వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొండిబకాయిల ఎఫెక్ట్: క్యూ4లో ఎస్బీఐకి రూ. 7,718కోట్ల నష్టం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మొండి బకాయిలు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నిరర్థక ఆస్తులు పేరుకుపోతుండటంతో జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు అంచనాలకు మించి భారీ నష్టాలను నమోదు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ.7,718కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.

ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం మాత్రం రూ.68,436.06కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.57,720.07కోట్లుగా ఉంది. ఇక ఈ త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్లు రూ.28,096కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఇవి రూ.11,740కోట్లుగా ఉన్నాయి.

 SBI sees record 7,718cr loss in Q4

బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 10.91శాతానికి పెరిగాయి. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఇవి 10.35శాతం ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 9.1శాతంగా ఉన్నాయి.

సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు 5.73శాతానికి పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 5.61శాతంగా ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 5.19శాతంగా ఉన్నాయి.

అంతకు ముందు డిసెంబరు త్రైమాసికంలో రూ. 2,416.37కోట్ల నికర నష్టాన్ని చవిచూడగా.. మార్చి త్రైమాసికంలో నష్టం మరింత పెరిగింది. కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 2,814.82కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.

English summary
State Bank of India (SBI) reported its largest ever quarterly loss of Rs 7,718 crore for January-March 2018 on Tuesday — more than double the Rs 3,442-crore loss reported for Q4FY17. The jump in losses follows a Rs 24,080-crore provision towards bad loans after the RBI scrapped all loan restructuring schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X