• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐసీఐసీఐలో కార్పోరేట్ గవర్నెన్స్ ఉల్లంఘన జరిగిందా?: సెబీ నజర్

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత విలువైన బ్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్నది ఐసీఐసీఐ బ్యాంక్. ఈ బ్యాంకులో కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాలు, లొసుగులు ఉన్నాయా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీడియోకాన్‌కు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందాకొచ్చర్ సాయం చేశారని వస్తున్న ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి (సెబీ) దృష్టి సారించింది.

ఈ రుణ మంజూరులో కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాలు జరిగాయా? అన్న అంశంపైనే సెబీ విచారించనున్నది. నిబంధనలు పాటించకుండా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూపునకు కొచ్చర్ రుణమిచ్చారని, దీంతో ఆమె కుటుంబ సభ్యులే ఎక్కువగా లబ్ధి పొందారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సెబీ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఐసీఐసీఐని అదనపు వివరాలివ్వాలని కోరిన సెబీ

ఐసీఐసీఐని అదనపు వివరాలివ్వాలని కోరిన సెబీ

2012 నుంచి బ్యాంకు లావాదేవీలపై అదనపు సమాచారం సమర్పించాలని కోరతామని సెబీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అవసరమైన చోట్ల అదనపు వివరణలను కోరనున్నట్లు తెలిపారు.

కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ ఇచ్చిన రుణాలు, ఇతర ఆర్థిక పరిస్థితులపై కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సెబీ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దేశంలో నాలుగో అత్యంత విలువైన బ్యాంకుగా ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1.8 లక్షల కోట్లు.

 నియంత్రణ సంస్థలకు సంత్రుప్తికర సమాధానాలిచ్చామన్న ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ఎంకే శర్మ

నియంత్రణ సంస్థలకు సంత్రుప్తికర సమాధానాలిచ్చామన్న ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ఎంకే శర్మ

కారణాలేమైనా చందాకొచ్చర్‌కు బాసటగా నిలిచింది ఐసీఐసీఐ డైరెక్టర్ల బోర్డు. వీడియో కాన్‌కు బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేసిన వైనంపై, 2016 బ్యాంకు లావాదేవీలపై నియంత్రణ సంస్థల సందేహాలను సంత్రుప్తికరంగానే తీర్చామని తెలిపింది. ‘మేం ఎల్లవేళ్లలా సంత్రుప్తికరమైన సమాదానాలు, వివరణలే సమర్పించాం' అని ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ ఎంకే శర్మ తెలిపారు. దీనిపై 2016లోనే ఆర్బీఐకి వివరణ ఇచ్చామని తెలిపారు.

 ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేంద్రం విచారణకు ఆదేశించాలి

ఐసీఐసీఐ బ్యాంకు రుణంపై కేంద్రం విచారణకు ఆదేశించాలి

వీడియోకాన్ గ్రూపునకు ఇచ్చిన రుణాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ అధికంగా లాభపడ్డారని ఇండియన్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ట్రస్టీ అరవింద్ గుప్తా ఆరోపించారు. కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు అధికంగా లాభపడ్డారనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని గుప్తా డిమాండ్ చేశారు.

అర్ధరాత్రి వరకు బ్యాంకింగ్ డిజిటల్ సేవలు

అర్ధరాత్రి వరకు బ్యాంకింగ్ డిజిటల్ సేవలు

పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కోసం బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(మార్చి 31న) బ్యాంకులు రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులతో పాటు అన్ని ఆర్‌బీఐ శాఖల కార్యాలయాలు కూడా రేపు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని పేర్కొంది. శనివారం అర్ధరాత్రి వరకు డిజిటల్‌ లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపింది. శనివారంతో 2017-18 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు శనివారం ఆఖరి తేదీ కావడంతో బ్యాంకుల సమయాన్ని పెంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా పేర్కొంది. ఇక ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ వంటి ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలు కూడా శనివారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా ఏప్రిల్‌ 2న బ్యాంకులు సెలవు పాటిస్తాయని తెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: With ICICI Bank embroiled in a controversy over alleged conflict of interest involving its CEO Chanda Kochhar, the Securities and Exchange Board of India (Sebi) has begun looking into the matter for any possible disclosure and corporate governance-related lapses. Besides, Videocon Industries Ltd and its promoters have come under the regulator’s scanner as the matter relates to alleged “quid pro quo” involving loans to the company by a group of lenders, including ICICI Bank and some public sector banks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more