వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు, ఐటీ వల్ల కాస్త..

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: శుక్రవారం మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో సూచీలు ఊగిసలాడాయి. చివరకు స్వల్ప నష్టంతో ముగిశాయి.

ఐటీ షేర్ల అండతో చివరి గంటల్లో కోలుకొని నష్టాలు తగ్గించుకున్నాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ ఒక పాయింట్ కోల్పోయింది.

Sensex ends off day’s low points, IT surges

శుక్రవారం ఉదయం 22 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. ఊగిసలాట కనిపించింది. ఓ దశలో 80 పాయింట్లు కోల్పోయినా.. ఐటీ షేర్ల కారణంగా చివరి గంటల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు.

దీంతో నష్టాలు కొంత మేర తగ్గాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, కోల్ ఇండియా షేర్లు రాణించాయి. యస్ బ్యాంకు, ఐసీఐసీఐ, టాటా స్టీల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి.

English summary
Shares have ended the week on a mildly lower note, but were off the day’s lowest point.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X