వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్‌మార్కెట్‌లో రికార్డుల హోరు: ట్రిపుల్‌ సెంచరీ, రూపాయి మారకం విలువ ఇలా...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్‌లో రికార్డుల జోరుకొనసాగుతోంది. బుధవారం 35 వేలకు ఎగువన స్థిరంగా ముగిసిన సెన్సెక్స్‌ గురువారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ ట్రిపుల్‌ సెంచరీ లాభాలను సాధించింది.

అటు నిఫ్టీ 10,850 వద్ద మరో గరిష్టాన్ని అధిగమించింది. అంతేకాదు 11 వేల వైపు శరవేగంగా పయనిస్తోంది. బ్యాంకింగ్‌ సెక్టార్‌ మరోసారి పుంజుకుంది. బ్యాంక్‌ నిఫ్టీ సరికొత్త రికార్డ్‌ స్థాయిని దాటి ట్రేడ్‌ అవుతోంది. భారీ లాభాలతో మార్కెట్లకు జోష్‌ నిస్తోంది.

Sensex On A Roll After Crossing 35,000, Nifty Near 10,900: 10 Points

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ లాభపడుతుండగా... ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, ఐడీసీ, హిందాల్కో, అంబుజా, విప్రో, అల్ట్రాటెక్‌, హెచ్‌పీసీఎల్‌, వేదాంతా నష్టపోతున్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం ఇలా...

డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం స్వల్ప లాభాలతో మొదలైనప్పటికీ, కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి మళ్లింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 5 పైసల లాభంతో 63.83 దగ్గర ప్రారంభమయ్యింది.

దేశీయ స్టాక్‌ సూచీలు నూతన జీవితకాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో ట్రేడింగ్‌ ప్రారంభసమయానికి డాలర్‌ ఇన్‌ఫ్లో పెరిగి రూపాయి విలువ బలపడింది. అయితే.. ఆవెంటనే బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో 11 పైసల వరకు నష్టపోయింది.

10 గంటల సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 63.94 వద్ద ట్రేడవుతోంది.
బుధవారం నాటి ఫారెక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 16 పైసలు బలపడి 63.88 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.

English summary
Stock markets are on a roll. A day after Sensex conquered 35,000, the benchmark index posted fresh highs amid higher global markets and optimism about earnings of India Inc. Asian stocks struck record highs today, with a rally by Wall Street supporting bullish investor sentiment. The Sensex surged nearly 400 points to a record high of 35,489 while the Nifty rose to 10,887, also a new high. The rupee also moved higher to 63.80 against the dollar, compared to Wednesday's close of 63.88. The NSE Nifty index was trading 79 points up at 10,867, while the BSE Sensex was 359 points up at 35,441 around 10:30 am(IST). Equity markets continued riding bulls, with key equity benchmarks Sensex and Nifty50 hitting fresh record highs of 35,478 and 10,888, respectively, in Thursday's trade. In the Nifty index, UPL, YES Bank, HDFC Bank, Housing Development Finance Corporation and IndusInd Bank were trading among the top gainers. However, Bharti Infratel, Hindalco Industries, GAIL (India), Vedanta and Indian Oil Corporation were among the top losers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X