వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్ మార్కెట్లపై ‘హోదా’సునామీ: రూ.1.86 లక్షల కోట్లు హాంఫట్!!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు స్టాక్ మార్కెట్లను చుట్టుముట్టాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతోపాటు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అనూహ్యంగా టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మార్కెట్లు కలవరానికి గురయ్యాయి.

వీటికితోడు అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో ఆందోళనలు తీవ్రతరం కావడం ఈ పతనాన్ని మరింత పెంచింది. శుక్రవారం ప్రారంభం నుంచి సూచీలు కుదేలవుతూ వచ్చాయి. ఎన్‌డీఏ సర్కార్‌కు మరిన్ని పార్టీలు గుడ్‌బై పలుకడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలందడంతో మదుపరులలో ఆందోళన తీవ్రమైంది.

ఫలితంగా వాటాదారులు అమ్మకాలకు పాల్పడటంతో సూచీ నెల కనిష్ట స్థాయికి జారుకున్నది. అంతర్జాతీయ సంకేతాలకు తోడు చమురు, లోహ, ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో వారంతం ట్రేడింగ్ ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమయ్యాయి. 137 పాయింట్ల నష్టంతో 33,548 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఒక దశలో 550 పాయింట్లకు పైగా పతనం చెందిన సూచీ 33,120 స్థాయికి దిగజారింది.

మెటల్, పీఎస్‌యూ, బ్యాంకింగ్ షేర్లు భారీగా పతనం

మెటల్, పీఎస్‌యూ, బ్యాంకింగ్ షేర్లు భారీగా పతనం

చివరకు కాస్త కోలుకున్నా భారీ నష్టాలనుంచి తప్పించుకోలేకపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 509.54 పాయింట్లు (1.51 శాతం) కోల్పోయి 33,176 వద్ద స్థిర పడింది. ఫిబ్రవరి ఆరో తేదీ తర్వాత ఒకేరోజు ఇంతటి స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. అటు నిఫ్టీ 10,200 దిగువకు జారుకున్నది. 50 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సూచీ చివరకు 165 నష్టపోయి 10,195.15 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 131.14 పాయింట్లు, నిఫ్టీ 31.70 పాయింట్లు పతనం చెందినట్లు అయింది. వ్యాపార రంగంలో యుద్ధమేఘాలు, రాజకీయ రంగంలో నెలకొన్న ఆందోళనలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రంగాల వారీగా చూస్తే మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, పీఎస్‌యూ, ఇంధనం, బ్యాంకింగ్ రంగాల షేర్లు 2.30 శాతం వరకు నష్టపోయాయి.

 అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు.. మిడ్ క్యాప్ 1.07% పతనం

అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు.. మిడ్ క్యాప్ 1.07% పతనం

టాటా మోటార్స్ అత్యధికంగా 3.67 శాతం నష్టపోగా, ఏషియన్ పెయింట్స్ 3.08 శాతం పతనం చెందింది. వీటితోపాటు అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, కొటక్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్‌ రెండు శాతానికి పైగా తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. అలాగే ఐటీసీ, టాటా స్టీల్, మారుతి, టీసీఎస్, రిలయన్స్, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, కోల్ ఇండియాలు నష్టపోయాయి. కానీ మహీంద్రా, విప్రో, యెస్ బ్యాంక్, హెచ్‌యూఎల్‌ లాభపడ్డాయి.
రూ.1.86 లక్షల కోట్లు నష్టపోయిన మదుపరి స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో మదుపరులు రూ.1.86 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. రాజకీయంగా నెలకొన్న ఆందోళన నేపథ్యంలో మదుపరులు భారీగా అమ్మకాలకు పాల్పడంతో బీఎస్‌ఈలో లిస్టయిన సంస్థల సంపద రూ.1,86,415.38 కోట్లు తగ్గి రూ.1,43,17,308 కోట్లకు పడిపోయింది. బీఎస్‌ఈ మిడ్-క్యాప్ ఇండెక్స్ 1.07 శాతం తగ్గగా, స్మాల్-క్యాప్ ఇండెక్స్ కూడా ఒక శాతానికి పైగా పతనం చెందింది. బీఎస్‌ఈ సూచీల్లో 32 స్టాకులు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి.

 ఫెడ్ రిజర్వ్ భేటీ.. పెట్టుబడుల తగ్గుదలతోనే పసిడి ధర పతనం

ఫెడ్ రిజర్వ్ భేటీ.. పెట్టుబడుల తగ్గుదలతోనే పసిడి ధర పతనం

పసిడి ధర మరోసారి పతనమైంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.200 తగ్గి రూ.31,250 చేరింది. దీంతో బంగారం ధర నెలరోజుల కనిష్ఠానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా బలహీన పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ కొరవడటం బంగారం ధర పతానికి కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి. మరోపక్క వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి రూ.150 తగ్గి, రూ.39,250కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి ఆశించినంత డిమాండ్‌ లేకపోవడం ఇందుకు కారణమైంది. అంతర్జాతీయ బలహీన పరిణామాలు, వచ్చేవారం జరగనున్న ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం, బంగారంలో పెట్టుబడులు తగ్గడం ఇవన్నీ పసిడి ధర పతనానికి కారణమయ్యాయి. అంతర్జాతీయంగా 0.64శాతం తగ్గిన బంగారం ధర ఔన్సు 1,315.70 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సు 0.85శాతం తగ్గి 16.37డాలర్లుగా ట్రేడ్‌ అయింది.

టీసీఎస్‌లో టాటాసన్స్ వాటా విక్రయంపై మార్కెట్‌ వర్గాల్లో ఆందోళన

టీసీఎస్‌లో టాటాసన్స్ వాటా విక్రయంపై మార్కెట్‌ వర్గాల్లో ఆందోళన

టాటా సంస్థల రుణభారం అంతకంతకు పెరుగుతున్న వేళ.. బంగారు బాతుగా ఉన్న టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌లో (టీసీఎస్‌) వాటాను టాటా గ్రూపు విక్రయించడంపై మార్కెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీసీఎస్‌లో దాదాపు రూ. 9,000 కోట్ల రూపాయల విలువైన 1.5 శాతం వాటాను బల్క్‌ డీల్‌ కింద గ్రూపు విక్రయించింది. విక్రేతలకు దాదాపు 5.9 శాతం వరకు డిస్కౌంట్‌ ఇచ్చి మరీ వాటాల విక్రయం జరపడం గమనార్హం. గుదిబండలా మారిన అప్పులను తీర్చడం కోసం, ఆటో, స్టీల్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం రూ.8,127 కోట్ల సమీకరణే లక్ష్యంగా సంస్థ ఈ విక్రయాన్ని చేపట్టింది. టాటా గ్రూపు నుంచి గత దశాబ్దకాలంలో ఇంత భారీ బల్క్‌డీల్‌ జరగడం ఇదే తొలిసారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ వాటా విక్రయం బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్న సామెతగా ఉందని విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటాను అమ్మి కొత్త అవకాశాలకోసం ఎదురు చూసే వ్యూహం బెడిసికొడుతుందనే నిపుణులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాటా సన్స్‌ మొత్తం డివిడెండ్‌ ఆదాయంలో టీసీఎస్‌ వాటాయే 92శాతం..కార్యకలాపాల మొత్తం ఆదాయంలో ఈ సంస్థ వాటా 86 శాతానికి సమానం. కాగా..మరోవైపు ప్రమోటర్‌ ద్వారా వాటాల విక్రయం ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీసింది. ఇలాంటి అమ్మకాలలో ఇది ఆఖరిది కాకపోవచ్చన్న ఆందోళన మార్కెట్‌ వర్గాల్లో నెలకొంది.

 జనవరిలో వాణిజ్య లోటు 16.3 బిలియన్ డాలర్లు

జనవరిలో వాణిజ్య లోటు 16.3 బిలియన్ డాలర్లు

గత జనవరిలో భయపెట్టిన భారత వాణిజ్యలోటు కొద్దిగా చల్లబడింది. ఫిబ్రవరి నెలలో వాణిజ్య లోటు 12బిలియన్ డాలర్లుగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురువారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఎగుమతులు 4.5 శాతం దిగుమతులు 10.4 శాతం పెరిగాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 4.5 శాతం పెరుగుదలతో 25.8 బిలియన్ల డాలర్ల ఎగుమతులను సాధించామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా తెలిపారు. ఫిబ్రవరి వాణిజ్య లోటు గత మాసంలోని 16.3 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 12 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అలాగే జనవరి 24.3 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే ఫిబ్రవరి ఎగుమతులు 25.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు 37.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, రసాయనాలు, వెండి, ముత్యాల దిగుమతి పెరగడంతో వాణిజ్య లోటు జనవరిలో 56 నెలల గరిష్ఠానికి (16.3 బిలియన్‌ డాలర్లు) ఎగబాకింది.

English summary
Stock markets on Friday plunged by 1.51 per cent to post their third weekly loss after Telugu Desam Party (TDP), a Modi government ally, exited the ruling coalition. The BSE Sensex fell 510 points — its biggest single-day fall since February 6 — to close at 33,176 amid global trade worries and political concerns after the TDP moved a no-confidence notice against the NDA government. The sentiment suffered a setback following fresh development on the political front, accelerating the selling pace by participants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X