వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డ్ హై: సరికొత్త రికార్డులు నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు

|
Google Oneindia TeluguNews

ముంబై: స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డుస్థాయిలో లాభాలు నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. బ్యాంక్ షేర్లు లాభ పడటంతో దేశీయ మార్కెట్లకు కలిసొచ్చినట్లయింది. దీంతో సూచీలు కూడా మళ్లీ జీవనకాల గరిష్టాలకు చేరాయి.

బాంబే స్టాక్ ఎక్ఛేంజీ(బీఎస్ఈ) సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభపడగా, నిఫ్టీ తొలిసారిగా 11,450 మార్క్‌ను తాకింది. నిఫ్టీ బ్యాంక్ కూడా మార్కెట్ చరిత్రలో తొలిసారి 28వేల మార్క్‌ను దాటింది.

Six factors Sensex, Nifty rose to record highs today

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బుధవారం ఉదయం సూచీలు ఫ్లాట్ ప్రారంభమయ్యాయి. మదుపర్లు అప్రమత్తత పాటించడంతో తొలి గంటల్లో ఒడుదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఒత్తిడిని అధిగమించిన సూచీలు రికార్డుల వైపు పరుగులు తీశాయి.

ముఖ్యంగా చివరి గంటల్లో కొనుగోళ్లు మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి. దీంతో బుదవారం నాటి ట్రేడింగ్‌ను సరికొత్త రికార్డులతో ముగించాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 37,887 వద్ద సరికొత్త జీవనకాల గరిష్టాయిలో స్థిరపడింది. నిఫ్టీ కూడా 60పాయింట్ల లాభంతో 11,450 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 186 పాయింట్లు ఎగబాకి 28,062 వద్ద స్థిరపడింది. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68,66గా కొనసాగుతోంది.

English summary
The market closed at record highs on Wednesday, powered by a surge in banking and consumer durables stocks. While the Sensex closed 221 points (0.59 per cent) higher at 37,887, the Nifty gained 60 points to close at the 11,450 level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X