వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఐఎల్ తర్వాత! 8లక్షల కోట్ల విలువైన భారతీయ కంపెనీగా టీసీఎస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో రికార్డు నమోదు చేసింది. మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) తర్వాత రూ.8లక్షల కోట్లు మార్క్ దాటిన రెండో సంస్థగా అవతరించింది.

మంగళవారం నాటి మార్కెట్‌లో టీసీఎస్ షేర్లు 2శాతానికి పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 8,01,550 కోట్లను తాకిందని టీసీఎస్ తెలిపింది.

TCS 2nd Indian firm to cross ₹ 8 trillion market cap after RIL

కాగా, ఈ మార్క్‌ను దాటిని తొలి కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు సాధించగా.. ఇప్పుడు టీసీఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఆగస్టు 23న రిలయన్స్ ఇండస్త్రీస్ మార్కెట్ విలువ రూ.8లక్షల కోట్లు దాటింది.

అయితే, 100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిన తొలి భారతీయ కంపెనీ టీసీఎస్ కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టీసీఎస్ ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత జూన్‌లో కంపెనీ మార్కెట్ విలువ రూ.7లక్షల కోట్లు దాటింది. తాజాగా, 8లక్షల కోట్లు దాటింది. కాగా, ఇన్ఫోసిస్ 3.05శాతం, మైడ్ ట్రీ 2.45శాతం, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి కంపెనీలు 1.85శాతం లాభపడ్డాయి.

English summary
Tata Consultancy Services Ltd’s (TCS) market cap surged past the ₹ 8 trillion mark for the first time today, making it only the second Indian company after Reliance Industries Ltd (RIL) to achieve the milestone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X