బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యూ2లో అదరగొట్టిన టీసీఎస్: 23శాతం లాభాలు, 10వేల మందికి ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) అదరగొట్టింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కూడా మంచి లాభాలను నమోదు చేసింది. ఇందికు డాలర్‌ విలువ పెరగటం కూడా కారణమైంది. రెండో క్వార్టర్‌ లాభాల్లో 23 శాతం ఎగిసింది.

భారీగా లాభాలు

భారీగా లాభాలు

ఏడాది ఏడాదికి కంపెనీ లాభాలు రూ.7,901 కోట్లగా రికార్డైనట్టు టీసీఎస్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ, గతేడాది ఇదే క్వార్టర్‌లో రూ.6,646 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. క్వార్టర్‌ రివ్యూలో కంపెనీ రెవెన్యూలు రూ.36,854 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇవి రూ.30,541 కోట్లగా ఉన్నాయి.

11.50శాతం పెరిగిన రెవెన్యూ

11.50శాతం పెరిగిన రెవెన్యూ

ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుపై రూ.4 తాత్కాలిక డివిడెండ్‌ను ప్రకటించింది టీసీఎస్‌. కంపెనీ సభ్యులుగా రిజిస్టర్‌లో నమోదైన షేర్‌ హోల్డర్స్‌కు లేదా షేర్ల లాభదాయక ఓనర్లుగా ఉన్న వారికి ఈ డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ క్వార్టర్‌లో ఆపరేటింగ్‌ మార్జిన్‌ 26.5 శాతానికి పెరిగింది. స్థిర నగదులో రెవెన్యూలు ఏడాది ఏడాదికి 11.50 శాతం పెరిగాయి.

కొత్తగా 10వేల మందికి ఉద్యోగాలు

కొత్తగా 10వేల మందికి ఉద్యోగాలు

ఈ క్వార్టర్‌లో నెట్‌ బేసిస్‌లో కొత్తగా 10,227 మంది ఉద్యోగులను కంపెనీలోకి చేర్చుకున్నట్టు టీసీఎస్‌ ప్రకటించింది. గత 12 క్వార్టర్‌లలో ఇదే అత్యధికమని తెలిసింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య కన్సాలిడేషన్‌ బేసిస్‌లో 4,11,102 కు పెరిగింది. తమ కంపెనీ మహిళా ఉద్యోగులు 35.7 శాతంగా ఉన్నట్టు టీసీఎస్‌ వెల్లడించింది.

నలుగురు 100మిలియన్ డాలర్ల డీల్స్

నలుగురు 100మిలియన్ డాలర్ల డీల్స్

తమ రెండో త్రైమాసికంలో పనితీరుతో సంతోషంగా ఉన్నామని టీసీఎస్‌ సీఈవో రాజేష్‌ గోపీనాథన్‌ తెలిపారు. 100 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో కంపెనీ నలుగురు కొత్త క్లయింట్స్‌ను చేర్చుకుంది. 20 మిలియన్‌ డాలర్ల కేటగిరీలో ఏడుగురిని, 10 మిలియన్‌ ప్లస్‌ డాలర్ల కేటగిరీలో 10 మందిని చేర్చుకున్నట్టు ప్రకటించింది.

English summary
Tata Consultancy Services said second quarter profits grew 22.6% to Rs 7901 crore and revenue by 21% to Rs 36854 crore on the back of increased business banking and retail customers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X