వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఎఫెక్ట్:వచ్చే ఆరు నెలల్లో టెలికం రంగంలో 90వేల ఉద్యోగాలకు ఎసరు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికం రంగంలో జియో ప్రవేశంతో తీవ్ర టెలికం ఆపరేటర్లు లాభాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో టెలికం పరిశ్రమలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో సుమారు 90 వేల ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

టెలికం రంగంలో జియో రంగ ప్రవేశం సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్‌తో జియో రంగ ప్రవేశం చేసింది. దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ రేట్లను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇతర టెలికం కంపెనీల నుండి తమ వైపుకు కష్టమర్లను తిప్పుకోవడంలో జియో సక్సెస్ అయింది. అనతి కాలంలో పెద్ద మొత్తంలో జియో కష్టమర్లను పెంచుకొంటూ వస్తోంది. అయితే ఇదే తరుణంలో ఎప్పటికప్పుడు టారిఫ ప్లాన్లను మార్చకొంటూ ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తోంది.

జియో అవలంభిస్తున్న విధానాలతో ఇతర కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లను మార్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఎప్పటికప్పుడు వ్యూహలను మార్చుతూ ప్రత్యర్థుల కంటే ముందుండేందుకు జియో ప్రయత్నాలను చేస్తోంది. ఈ కారణంగానే టెలికం పరిశ్రమ భారీగా రెవిన్యూను కోల్పోయిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 టెలికం పరిశ్రమలో 90 వేల ఉద్యోగాలకు ఎసరు

టెలికం పరిశ్రమలో 90 వేల ఉద్యోగాలకు ఎసరు

రిలయన్స్‌ జియో ప్రవేశం అనంతరం టెలికాం కంపెనీలు తీవ్ర అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తమ రెవెన్యూలను కాపాడుకోలేక సతమతమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో కూడా భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని తాజా రిపోర్టు వెల్లడించింది. దాదాపు 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 టెలికం రంగంలో ఉద్యోగులకు కష్టకాలమే

టెలికం రంగంలో ఉద్యోగులకు కష్టకాలమే

టెలికం రంగంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం నెలకొందని నివేదికలు వెల్లడించడంతో ఉద్యోగులకు రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. పోటీ వాతావరణం పెరుగడంతో పాటు, మార్జిన్లు తగ్గడంతో, కంపెనీలకు లాభాలు పడిపోయాయని, దీంతో భారీగా ఉద్యోగాల కోత చేపట్టనున్నాయని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

వచ్చే ఆర్నెళ్ళు కష్టమే

వచ్చే ఆర్నెళ్ళు కష్టమే

టెలికం రంగంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఇటీవల కాలంలో 65 టెలికం కంపెనీలు, సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్ సర్వీస్ ప్రొవైడర్ల విషయమై ఓ సంస్థ ఇటీవలనే సర్వే నిర్వహించింది.సీనియర్‌, మధ్యస్థాయి ఉద్యోగులపై ఈ సర్వే చేపట్టింది. గతేడాది 40వేల మంది టెలికాం రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని ఈ సర్వేలో తేలింది.ఈ పరిస్థితి రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు కొనసాగుతుందని సర్వే అభిప్రాయపడింది. దీంతో 80వేల నుంచి 90వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని పేర్కొంది.

 వేతనాల పెంపు తక్కువే

వేతనాల పెంపు తక్కువే

వచ్చే రెండు నుంచి మూడు క్వార్టర్ల వరకు అట్రిక్షన్‌ రేటు ఎక్కువగానే ఉంటుందని ఈ సర్వే సంస్థ అభిప్రాయపడింది.లోన్‌ సర్వీసింగ్‌లో ఎక్కువ వ్యయాలు, మార్కెట్‌ షేరులో తీవ్ర పోటీ, విలీనాలతో అనిశ్చితకర పరిస్థితులు వంటివి ఉద్యోగాల కోతపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఇతర రంగాలతో పోలిస్తే, ఈ రంగంలో వేతనాల పెంపు అంతంతమాత్రంగానే ఉందని కూడా రిపోర్టు పేర్కొంది. ఈ రంగంలో ఉద్యోగాలతో అనిశ్చిత పరిస్థితులతో ఉద్యోగులు వేరే రంగాలపై మొగ్గుచూపుతున్నారని తెలిపింది.

English summary
Faced with uncertainty, the once-sunshine telecom sector will continue to witness decline in headcounts for the next six-nine months taking the total number of job losses to 80,000-90,000, says a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X