వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వం సత్తేనాశ్: జీఎస్టీ రిటర్న్స్‌లో కానరాని పోలిక.. పరిష్కారమేమిటి?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గతేడాది జూలై ఒకటో తేదీ నుంచి కేంద్రం ఆర్బాటంగా అమలులోకి తెచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కింద నమోదైన వ్యాపారులు, అమ్మకాలపై దాఖలు చేస్తున్న రిటర్నుల్లో తేడాలు పెద్దఎత్తున ఉంటున్నాయి. తొలుత దాఖలు చేసిన రిటర్నుల్లో 16 శాతం మాత్రమే తుది రిటర్నులకు సరిపోలాయి.
పన్ను ఎగవేతలేమైనా జరుగుతున్నాయా అనే భావనతో, 2017 జులై-డిసెంబర్ మధ్యకాలంలో దాఖలైన జీఎస్‌టీ రిటర్నులను రెవెన్యూ విభాగం పరిశీలించింది. అప్పుడు తొలి రిటర్న్స్‌కు, చివరి రిటర్న్స్‌కు మధ్య పోలికే ఉండటం లేదని తేలింది.

రూ.34,400 కోట్లు తక్కువగా జీఎస్టీ చెల్లింపు

రూ.34,400 కోట్లు తక్కువగా జీఎస్టీ చెల్లింపు

ఆర్థికశాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం మొత్తం 51.96 లక్షల మంది వ్యాపారుల జీఎస్టీ రిటర్నులను పరిశీలించింది. తుది రిటర్నులు (జీఎస్టీఆర్‌-3బీ) సమర్పించినపుడు, 34 శాతం మంది వ్యాపారులు రూ.34,400 కోట్ల మేర తక్కువ పన్ను చెల్లించారు. ఈ వ్యాపార సంస్థలన్నీ కలిపి చెల్లించిన పన్ను మొత్తం రూ.8.16 లక్షల కోట్లు.

చివరి రిటర్న్స్ తో చెల్లించిన పన్ను రూ.8.16 లక్షల కోట్లే

చివరి రిటర్న్స్ తో చెల్లించిన పన్ను రూ.8.16 లక్షల కోట్లే

వివిధ సంస్థల యాజమాన్యాలు సమర్పించిన జీఎస్టీఆర్‌-1 పరిశీలించినపుడు, వీరు చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.8.50 లక్షల కోట్లని ఆర్థికశాఖలోని రెవెన్యూ విభాగం అధికారులు గుర్తించారు. కేవలం 16.36 శాతం సంస్థలు తొలుత దాఖలు చేసిన రిటర్నులు, తుది రిటర్నులు సరిపోలాయి. ఇవన్నీ కలిపి చెల్లించిన పన్ను మొత్తం రూ.22,014 కోట్లు మాత్రమే.

49 శాతం మంది వ్యాపారులు అదనపు చెల్లింపు

49 శాతం మంది వ్యాపారులు అదనపు చెల్లింపు

పన్ను అదనంగా చెల్లించిన వారూ ఉన్నారని రెవెన్యూ విభాగం గుర్తించింది. 49.36% మంది వ్యాపారులు అదనంగా రూ.91,072 కోట్లు పన్ను రూపేణ చెల్లించినట్లు తేలింది. జీఎస్టీ కింద వీరంతా కలిపి రూ.6.50 లక్షల కోట్లు చెల్లించారు. జీఎస్టీఆర్‌-1 పరిశీలిస్తే, వీరు చెల్లించాల్సిన మొత్తం రూ.5.59 లక్షల కోట్లు మాత్రమే.

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో ఈవై భాగస్వామి అంగీకారం

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో ఈవై భాగస్వామి అంగీకారం

వ్యాపారులు సొంతంగా దాఖలు చేసిన జీఎస్టీఆర్‌ -1లో తెలిపిన పన్ను వివరాలకు, జీఎస్టీఆర్‌-3బి దాఖలు చేసిన సమయంలో చెల్లించిన వాస్తవ మొత్తాలకు తేడాను నిశితంగా విశ్లేషించాలని జీఎస్‌టీ మండలి కూడా నిర్ణయించింది. ఈవై భాగస్వామి అభిషేక్‌ జైన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎగుమతిదార్ల ఇబ్బందులపై వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు

ఎగుమతిదార్ల ఇబ్బందులపై వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు

జీఎస్టీ రిఫండ్‌కు ఎక్కువకాలం పట్టడం వల్ల, నిర్వహణ నిధులకు ఇబ్బంది పడుతున్నామని ఎగుమతి దారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందుకోసం ఎగుమతిదార్లకు, ఈ- వాలెట్‌ వ్యవస్థ సాంత్వన కలిగించనుందని వాణిజ్య శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు. ఈ వ్యవస్థ కింద ఎగుమతిదార్ల గత చెల్లింపులను అనుసరించి, వాపసుగా వస్తుందని భావించిన నగదును వారి ఖాతాల్లో నమోదు చేస్తారు. దిగుమతులపై పన్ను చెల్లింపులకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయమై వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖల కార్యదర్శులు పని చేస్తున్నారని మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు.

ఎనిమిది నెలలుగా రీఫండ్ ఆలస్యమని ఎగుమతిదారుల ఆందోళన

ఎనిమిది నెలలుగా రీఫండ్ ఆలస్యమని ఎగుమతిదారుల ఆందోళన

ఈ- వాలెట్‌ అమల్లోకి వస్తే, ఎగుమతిదార్లు వాస్తవంగా పన్ను చెల్లించాల్సిన, రిఫండ్‌ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని మంత్రి సురేశ్ ప్రభు వివరించారు. రిఫండ్‌లు ఎనిమిది నెలలుగా ఆలస్యం అవుతున్నాయని ఈ మొత్తం రూ.20,000 కోట్లకు చేరిందన్నది ఎగుమతిదార్ల ఆందోళన. జీఎస్టీ వ్యవస్థ ప్రారంభానికి ముందు, వారు చెల్లించాల్సిన సుంకాల నుంచి మినహాయింపులను తొలగించేవారు. జీఎస్టీ వచ్చాక ఎగుమతిదార్లు ముందు పన్ను చెల్లించి, తరవాత రిఫండ్‌ కోరాల్సి వస్తోంది.

ఆర్టీఐ పిటిషన్‌కు ఇలా ఆర్బీఐ రియాక్షన్

ఆర్టీఐ పిటిషన్‌కు ఇలా ఆర్బీఐ రియాక్షన్

రద్దు చేసిన రూ.500, రూ.1000నోట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్రిక్స్‌ రూపంలో తయారు చేసేందుకు పంపిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) అధికారులు తెలిపారు. రద్దయిన పాత నోట్లను ఏం చేశారనేది తెలియజేయాలని పీటీఐ ప్రతినిధి సహ చట్టం(ఆర్టీఐ) ద్వారా ఆర్‌బీఐని కోరారు. అందుకు స్పందించిన ఆర్‌బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘రద్దయిన పాత రూ.500, వెయ్యి నోట్లను లెక్కింపు జరుగుతోంది. ఆ నోట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి.. బ్రిక్స్‌ రూపంలో తయారు చేసేందుకు ఆర్‌బీఐలోని పలు కార్యాలయాల్లో యంత్రాలను ఏర్పాటు చేశాం' అని ఆర్‌బీఐ వెల్లడించింది. బ్రిక్స్‌ రూపంలోకి వాటిని అమర్చిన తర్వాత టెండర్ల పద్ధతిలో ఆ నోట్ల బ్రిక్స్‌ను బయటకు పంపిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

2016 నాటికి రద్దయిన నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు

2016 నాటికి రద్దయిన నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు

పాత నోట్లను రీసైకిల్‌ చేసే ఆలోచన లేనట్లు ఆర్బీఐ తెలిపింది. రద్దయిన నోట్లను లెక్కించేందుకు 59 సోఫెస్టికేటెడ్‌ కరెన్సీ వెరిఫికేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌(సీవీపీఎస్‌) యంత్రాలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. 2016, నవంబర్‌ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెంట్రల్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) నివేదిక ప్రకారం 2017 జూన్‌ 30 నాటికి రూ.15.28 ట్రిలియన్‌ రద్దయిన నోట్లు వెనక్కి వచ్చాయి. నోట్ల రద్దు ప్రకటించే సమయానికి 1,716.5 కోట్ల విలువైన రూ.500నోట్లు, 685.8కోట్ల విలువైన రూ.1000 నోట్లు చలామణీలో ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.15.44లక్షల కోట్లు.

English summary
The GST Council in its meeting on March 10 decided to continue with relief for exporters, defer reverse charge mechanism as well as defer applicability of TDS and TCS provisions. These measures will reduce hardships to exporters who are already reeling under delay in processing of their refund applications; and also buy time for unregistered dealers before reverse charge mechanism comes into play.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X