• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీరవ్‌ను ఏమనొద్దు: ఫోనూ చేయొద్దు.. ‘ఫైర్‌స్టార్’ దివాలాపై అమెరికా కోర్టు

By Swetha Basvababu
|

న్యూయార్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను నిండా ముంచేసిన విలాసవంతమైన వజ్రాల వ్యాపారికి అమెరికా దివాలా కోర్టు అండగా నిలిచింది. పీఎన్బీలో రూ.12, 600 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీని ప్రస్తుతానికి రుణదాతలెవరూ ఆయన జోలికి వెళ్లడానికి వీల్లేదని న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ పరిధిలోని దివాళా కోర్టు స్పష్టం చేసింది. నీరవ్‌ మోదీ సారథ్యంలోని ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ ఇటీవల దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను అమెరికా కోర్టు శుక్రవారం విచారించింది.
నీరవ్‌ మోదీకి రుణాలు ఇచ్చిన దాతలు ప్రస్తుతానికి ఆ రుణాలను వసూలు చేయరాదని ఆదేశించింది. కాకపోతే అమెరికాలో నీరవ్ మోదీ ఉన్నాడో లేదో తెలియదని పేర్కొన్నది. అంతేకాక రుణాల వసూలు కోసం అతడిపై ఎటువంటి వత్తిడి తేవద్దని స్పష్టం చేస్తూ తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రెండు పేజీలతో కూడిన నివేదికను విడుదల చేసింది.

 మోదీకి ఫోన్ మాత్రమే కాదు.. ఈ - మెయిల్ కూడా చేయొద్దు

మోదీకి ఫోన్ మాత్రమే కాదు.. ఈ - మెయిల్ కూడా చేయొద్దు

అమెరికా దివాలా కోర్టు నివేదిక ప్రకారం నీరవ్ మోదీకి రుణాలు ఇచ్చిన దాతలు ఇప్పట్లో ఆ సొమ్మును తిరిగి తీసుకోవడం గానీ, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోడవం గానీ కుదరదు. నీరవ్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు రుణదాతలు ఎటువంటి పిటిషన్లు దాఖలు చేయ కూడదు. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసేందుకు నీరవ్ మోదీకి ఫోన్‌గానీ, ఈ-మెయిల్ గానీ చేయడానికి వీల్లేదు.

 26న దివాళా పిటిషన్ దాఖలు చేసిన నీరవ్‌మోదీ సంస్థలు

26న దివాళా పిటిషన్ దాఖలు చేసిన నీరవ్‌మోదీ సంస్థలు

దీనిపై తాము జారీచేసిన ఆదేశాలను ధిక్కరించి నీరవ్ ఆధ్వర్యంలోని ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెరికాలోని న్యూయార్క్ దివాళా కోర్టు హెచ్చరించింది. ఈ ఆదేశాలపై నివేదికను ఆ కోర్టు నీరవ్‌కు రుణాలు ఇచ్చిన వారికి పంపింది. భారీ కుంభకోణంతో పీఎన్బీని నిట్టనిలువునా ముంచేసిన నీరవ్ మోదీ నేతృత్వంలోని ఫైర్‌స్టార్ డైమండ్ సంస్థ గత నెల 26న అమెరికాలోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 నీరవ్ ‘ఫైర్ స్టార్' కంపెనీ కొనుగోలు అమెరికా సంస్థలు ఆసక్తి

నీరవ్ ‘ఫైర్ స్టార్' కంపెనీ కొనుగోలు అమెరికా సంస్థలు ఆసక్తి

అమెరికాలో కంపెనీల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఛాప్టర్ 11 నిబంధనల ప్రకారం ఫైర్‌స్టార్ సంస్థ ఈ దివాలా పిటిషన్ వేసింది. వ్యాపారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రుణదాతలకు అప్పులు తిరిగి చెల్లించే వెసులుబాటు కోసం ఒక ప్రణాళికను ప్రకటిస్తూ ఈ తరహా పిటిషన్లు దాఖలు చేస్తారు. ఇదిలా ఉంటే, అమెరికాలో ఫైర్‌స్టార్ డైమండ్స్ సంస్థను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది.

 క్రిమినల్ కేసులు దాఖలు చేసినందు వల్లే నీరవ్ దివాళా పిటిషన్

క్రిమినల్ కేసులు దాఖలు చేసినందు వల్లే నీరవ్ దివాళా పిటిషన్

దివాలా పిటిషన్‌లో పీఎన్బీని రుణదాతగా చూపని నీరవ్సంస్థలు
ఇదిలావుంటే, నీరవ్‌కు చెందిన మూడు సంస్థలు (ఫైర్‌స్టార్ డైమండ్, ఫాంటసీ, ఏ జెఫ్ఫీ కంపెనీలు) న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసిన దివాలా పిటిషన్‌లో పీఎన్బీని రుణదాతగా చూపలేదు. అయితే నీరవ్ అనధికారికంగా రుణాలు పొందారన్న ఆరోపణలతో పీఎన్బీ క్రిమినల్ కేసులు దాఖలు చేయడం వల్లనే తాము దివాలా పిటిషన్‌ను దాఖలు చేయాల్సి వచ్చిందని ఆయన సంస్థలు ఆ పత్రాల్లో పేర్కొన్నాయి.

నీరవ్ ఆస్తుల స్వాధీనం పీఎన్బీకి ఇలా అవరోధం

నీరవ్ ఆస్తుల స్వాధీనం పీఎన్బీకి ఇలా అవరోధం

నీరవ్ మోదీ సంస్థలు కేవలం హెచ్‌ఎస్‌బీసీ, ఇజ్రాయిల్ డిస్కౌంట్ బ్యాంక్ (ఐడీబీ)లను మాత్రమే తమ రుణదాతలుగా పేర్కొన్నాయి. నీరవ్ ఆధ్వర్యంలోని రెండు సంస్థలకు ఈ రెండు బ్యాంకులు 20 మిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చాయి. వీటిలో రివాల్వింగ్ క్రెడిట్ సదుపాయాన్ని కల్పించిన ఐడీబీఐకి స్వయంగా నీరవ్ మోదీయే గ్యారంటీ ఇచ్చినట్లు దివాలా పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన మూడు సంస్థలపై ఇప్పుడు అమెరికాలో విచారణ జరుగుతున్నందున ఈ కంపెనీల్లో నీరవ్‌ మోదీ ఆస్తులనుస్వాధీనం చేసుకోవడం పీఎన్బీకి అవరోధంగా పరిణమిస్తుంది.

English summary
A day after the Union Cabinet chaired by Prime Minister Narendra Modi cleared a draft law that enables confiscation of the assets of fugitive economic offenders, absconding diamantaire Nirav Modi got a helping hand from America. On Friday, the US bankruptcy court in the Southern District of New York passed an inte­rim order preventing creditors from collecting debt from Modi-owned Firestar Diamond Inc, which had filed for bankruptcy early this week along with its affiliate companies A Jaffe, Inc and Fantasy, Inc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X