వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియోకాన్ లోన్ కేసు: చందా కొచ్చర్‌కు సెబీ నోటీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందాకొచ్చర్‌కు మార్కెట్‌ రెగ్యులేటరీ సెక్యురిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) నోటీసులు జారీచేసింది. రూ. 3,250 కోట్ల వీడియోకాన్‌ రుణ కేసులో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలపై సెబీ ఈ నోటీసులు పంపంది. ఈ విషయాన్ని బ్యాంకు శుక్రవారం తెలిపింది.

గురువారమే ఐసీఐసీఐ బ్యాంకు ఈ నోటీసులు అందుకుందని, వీడియోకాన్‌ గ్రూప్‌ అండ్‌ న్యూపర్‌ రెన్యువబుల్స్‌ మధ్య డీలింగ్స్‌ విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుడటంతో పాటు, ఈ రుణ కేసులో సంబంధం ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించాలని ఆమెను సెబీ కోరింది.

Videocon loan case: Sebi serves notice to ICICI Bank chief Chanda Kochhar

చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు లబ్ది చేకూరేలా క్విడ్‌ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీచేసిట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసు విషయంలో సరియైన వివరణను స్టాక్‌ మార్కెట్లకు బ్యాంకు ఇవ్వలేదని మార్కెట్‌ రెగ్యులేటరీ భావిస్తోంది.

ఎస్‌సీఆర్‌ రూల్స్‌ 2005, రూల్‌ 4(1) కింద సెబీ ఈ నోటీసును జారీచేసినట్టు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. సెబీకి తాము సరియైన వివరణ ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

వీడియోకాన్‌ సంస్థ 2012లో రూ.3,250 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణంగా పొందింది. ఆ సంస్థ ఆధినేత వేణుగోపాల్ ధూత్.. దీపక్ కొచ్చర్‌ సంస్థ న్యూపవర్‌లో పెట్టిన రూ.64 కోట్లు పెట్టుబడికి, బ్యాంకు రుణానికి సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరుపుతోంది.

English summary
Market regulatory Sebi has served a notice on ICICI Bank CEO and MD Chanda Kochhar on dealings of the bank with Videocon Group and Nupower, an entity in which her husband Deepak Kochhar has economic interests, the private sector lender said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X