వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టీల్ దిగుమతిపై ట్రంప్ నిర్ణయంతో చైనాకు కోలుకోలేని దెబ్బ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

జెనీవా: ప్రపంచ దేశాల నుంచి ఉక్కు, అల్యూమినియం లోహాల దిగుమతిపై సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవెడో తెలిపారు. ఇతర దేశాల నుంచి స్పందన కోసం వేచి చూస్తున్నామని అన్నారు. వాస్తవంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందన్నారు.

ట్రంప్ విధించిన దిగుమతి సుంకంతో ఏ ఒక్కరికి ప్రయోజనం లేదని రాబర్టో అజెవెడో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.

 ఏ దేశాల ఉత్పత్తులన్నది స్పష్టంగా చెప్పని ట్రంప్

ఏ దేశాల ఉత్పత్తులన్నది స్పష్టంగా చెప్పని ట్రంప్

అమెరికా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తి దారులను రక్షించుకోవాలనే సాకుతో విదేశాల నుంచి ఉక్కు దిగుమతిపై 25 శాతం, అల్యూమినియం దిగుమతిపై 10 శాతం సుంకం విధించాలని నిర్ణయించినట్లు గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఏ దేశాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించలేదు.

 స్టీల్ అతిపెద్ద ఉత్పత్తి దారు చైనాకు మోయలేని భారం

స్టీల్ అతిపెద్ద ఉత్పత్తి దారు చైనాకు మోయలేని భారం

విదేశీ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్ చేసిన ప్రకటనతో అమెరికా మిత్ర పక్షాలు కెనడా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో, ఆస్ట్రేలియాలతోపాటు చైనా నుంచి స్టీల్ దిగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని డబ్ల్యూటీవో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చైనా అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా నిలిచింది.

తమ ఎగుమతులపైనా సుంకాలు విధించాలన్న ట్రంప్

తమ ఎగుమతులపైనా సుంకాలు విధించాలన్న ట్రంప్

స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విషయమై అమెరికాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాబర్ట్ అజెవెడో చెప్పారు. ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై సుంకం పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తమ ఎగుమతులపైనా సుంకం విధించాలని ఇతర దేశాలకు పిలుపు ఇచ్చారు.

భవన, ఉత్పాదక రంగాలపై ప్రతికూల ప్రభావం అని ఐఎంఎఫ్ ఆందోళన

భవన, ఉత్పాదక రంగాలపై ప్రతికూల ప్రభావం అని ఐఎంఎఫ్ ఆందోళన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకానికి పోటీగా ఇతర దేశాలు కూడా అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై సుంకాలు విధించొద్దని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గెర్రీ రైస్ కోరారు. ట్రంప్ నిర్ణయంతో పరిస్థితి తీవ్రం కాగా, విదేశాలు అదే పని చేస్తే అంతర్జాతీయంగా భవన నిర్మాణం, ఉత్పాదక రంగాలపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గెర్రీ రైస్ తెలిపారు.

English summary
Geneva: The chief of the World Trade Organization said Friday that he is concerned by US President Donald Trump's plans to impose tariffs on steel and aluminium, warning a trade war is "in no-one’s interests". "The WTO is clearly concerned at the announcement of US plans for tariffs on steel and aluminium. The potential for escalation is real, as we have seen from the initial responses of others", WTO director-general Roberto Azevedo said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X