Chithra: నటికి కన్యత్వ పరీక్షలు చెయ్యాలని మొగుడు ప్లాన్, వాడికేమో సూపర్ ఫిగర్స్ తో లింక్, ఇది జరిగింది !
చెన్నై/బెంగళూరు: తమిళ బుల్లితెర నటి చిత్రా ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిత్రాను ఆమె భర్త హేమంత్ చిత్రహింసలకు గురి చేశాడని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీరంగ ప్రముఖులు హడలిపోయారు. చిత్రాకు కన్యత్వ పరీక్షలు చేయించడానికి ఆమె భర్త హేమంత్ విశ్వప్రయత్నాలు చేశాడని రోహిత్ అనే స్నేహితుడు చెప్పడం కలకలం రేపింది. చిత్రాతో కలిసి నటించిన ఓ యువకుడిని హేమంత్ చితకబాదేశాడని, అతనితో పాటు చిత్రాకు టార్చర్ చేశాడని ఓ ఇంటర్వూలో రోహిత్ బాంబు పేల్చాడు. చిత్రా భర్త హేమంత్ కు మాత్రం అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని వెలుగు చూసింది.

చిత్రా శరీరంలో గాయాలు
గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన చెన్నైలోని నాసరపేటలోని ఓ స్టార్ హోటల్ లో చిత్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిత్రా ఆత్మహత్య చేసుకున్న సమయంలో వ్యాపారవేత్త అయిన ఆమె భర్త హేమంత్ అదే హోటల్ లో ఉన్నాడు. చిత్రా ముఖం, దవడ, ఛాతికి గాయాలు కావడంతో పోలీసులు ఆమె భర్త హేమంత్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే పోస్టుమార్టుం రిపోర్టులో చిత్రా ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూసింది.

చిత్రా ప్లాన్ వేరే ఉంది
కొన్ని నెలల క్రితం హేమంత్ బలవంతంగా చిత్రాను రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2021 ఫిబ్రవరిలో చెన్నైలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బంధువులు, స్నేహితులను ఆహ్వానించి మళ్లీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని చిత్రా ప్లాన్ వేసింది. అయితే చిత్రా ఆశలు చిగురించలేదు. చిత్రా ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు షాక్ అయ్యారు.

బాంబు పేల్చిన హేమంత్ ఫ్రెండ్
చిత్రా భర్త హేమంత్ స్నేహితుడు, నటి చిత్రాకు సన్నిహితుడైన రోహిత్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి. చిత్రా చావుకు కారణం ఆమె భర్త అయిన తన స్నేహితుడు హేమంత్ కారణం అని పరోక్షంగా రోహిత్ బాంబు పేల్చడం కలకలం రేపింది. హేమంత్ ఎంత నీచానికి పాల్పడ్డాడు అనే విషయాన్ని రోహిత్ పూస గుచ్చినట్లు వివరించాడు.

సాటి నటుడిని చితకబాదేశాడు
చిత్రాను పెళ్లి చేసుకోక ముందే ఆమె మీద హేమంత్ కు అనేక అనుమానాలు ఉన్నాయని రోహిత్ ఆరోపించాడు. తమిళనాడులో ఓ ఊపుఊపేసిన పాండియన్ స్టోర్స్ టీవీ సీరియల్ లో చిత్రా నటించి చాలా ఫేమస్ అయ్యింది. పాండియన్ స్టోర్స్ సీరియల్ లో చిత్రాతో కలిసి నటించిన కుమార్ అనే నటుడిని హేమంత్ చిత్ర హింసలకు గురి చేశాడని, చిత్రాకు దూరంగా ఉండాలని, ఆమెతో కలిసి నువ్వు నటించకూడదని అతనిపై హేమంత్ దాడి చేసి చితకబాదేశాడని రోహిత్ సంచలన ఆరోపణలు చేశాడు.

నా భార్యకు కన్యత్వ పరీక్షలు చెయ్యండి
చిత్రా క్యారెక్టర్ మీద తనకు అనేక అనుమనాలు ఉన్నాయని, ఆమెకు కన్యత్వ పరీక్షలు చెయ్యాలని తాను అనేక మంది వైద్యులకు చెప్పానని హేమంత్ స్వయంగా తనతో చెప్పాడని అతని స్నేహితుడు రోహిత్ ఆరోపించాడు. వీళ్లు నివాసం ఉండే అపార్ట్ మెంట్ లో ఓ డాక్టర్ ఉన్నారని, ఆ డాక్టర్ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో క్లీనిక్ నిర్వహిస్తున్నారని, చిత్రాకు అక్కడే కన్యత్వ పరీక్షలు చెయ్యాలని డాక్టర్ మీద హేమంత్ ఒత్తిడి చేశాడని అతని స్నేహితుడు రోహిత్ బాంబు పేల్చాడు.

కుమిలిపోయిన నటి చిత్రా
నీకు కన్యత్వ పరీక్ష చెయ్యాలని నీ భర్త హేమంత్ మాకు చెబుతున్నాడని ఆ డాక్టర్ చిత్రాకు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న చిత్రా మా దగ్గరకు వచ్చి చాలా కుమిలిపోయిందని రోహిత్ అన్నారు. తన భర్తకు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆ విషయాలు తెలిసినా తాను అతన్ని పెళ్లి చేసుకున్నానని మా దగ్గరకు వచ్చి చిత్రా ఏడ్చిందని రోహిత్ అన్నారు.

నా ఫ్రెండ్ అని చెప్పడానికే సిగ్గుగా ఉంది
హేమంత్ ఇంత చేసినా తాను క్షమించానని, అయినా తనకు కన్యత్వ పరీక్షలు చేయించాలని డాక్టర్లు అందరికి చెప్పి తన పరువు తీస్తున్నాడని చిత్రా మా దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిందని రోహిత్ ఆరోపించారు. హేమంత్ మాత్రం తాను ఎంతో మంది మహిళలతో ఎంజాయ్ చేశాడని, ఎవ్వరితో నెల రెండు నెలల కంటే తాను ఎక్కువగా వారితో సంబంధాలు పెట్టుకోలేని స్వయంగా హేమంత్ మా దగ్గర ఎన్నోసార్లు చెప్పాడని రోహిత్ బాంబు పేల్చాడు. హేమంత్ తన స్నేహితుడు అని చెప్పడానికి తనకే సిగ్గుగా ఉందని రోహింత్ విచారం వ్యక్తం చేశాడు. రోహిత్ ఇచ్చిన సమాచారంతో చిత్రా కేసు దర్యాప్తు చేస్తున్నా పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.