Alone Aunty: విదేశాల్లో కూతురు, రాత్రి ఆంటీని నగ్నంగా చేసి గొంతు కోసి, కసితీరా పొడిచి, రేప్ చేసి !
చెన్నై/ కడలూరు/ విరుధాచలం: కూతురికి పెళ్లి చేసిన మహిళ సంతోషంగా ఉంది. విదేశాల్లో ఉంటున్న కూతురు, అల్లుడు ప్రతిరోజు ఆ మహిళకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ మహిళ ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉంటోంది. రాత్రి ఇంట్లోకి వెళ్లిన మహిళ మరుసటి రోజు చూసే సరికి ఆమె గొంతు కోసేసి శరీరం మొత్తం కత్తులతో పొడిచి చంపిన విషయం వెలుగు చూసింది. మహిళ అర్దనగ్నంగా ఉండటం, జాకెట్ మొత్తం చినిగిపోయి ఉండటంతో మహిళపై రేప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసు అధికారులు అంటున్నారు.
Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్

విదేశాల్లో ఆంటీ కూతురు
తమిళనాడులోని కడలూరు జిల్లా విరుధాచలంలోని కరువప్పిలన్ కురిచి సమీపంలోని కురుక్కథన్ ప్రాంతంలో శాంతి (45) అనే మహిళ నివాసం ఉంటున్నది. శాంతి ఏకైక కుమార్తె విష్ణుప్రియ (పేరు మార్చడం జరిగింది). విష్ణుప్రియకు వివాహం జరగడంతో ఆమె విదేశాల్లో భర్తతో కలిసి నివాసం ఉంటున్నది. ప్రతిరోజు విదేశాల నుంచి కుమార్తె విష్ణుప్రియ తల్లి శాంతికి ఫోన్ చేసి మాట్లాడుతోంది.

ఒంటరి మహిళ
శాంతి ఒంటరిగా నివాసం ఉంటూ విరుధాచలంలోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నది. గురువారం రాత్రి శాంతి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన విషయం పక్కింటి వాళ్లు చూశారు. శుక్రవారం ఎంతసేపు అయినా శాంతి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పక్కింటి మహిళ వెళ్లి చూసింది. శాంతి ఇంటి తలుపులు కొంచెం తీసి ఉండటంతో పక్కింటి మహిళ లోపలికి తొంగి చూసి షాక్ కు గురై గట్టిగా కేకలు వేసింది.

అర్దనగ్నంగా...... గొంతు కోసి దారుణ హత్య
స్థానికులు భయంతో శాంతి ఇంట్లోకి వెళ్లి చూశారు. కత్తితో శాంతి గొంతును అర్దభాగం కోసేశారని, ఆమె శరీరం. ఛాతీ, కడుపు తదితర చోట్ల కత్తితో దారుణంగా పోడిచారని గుర్తించిన స్థానికులు విరుధాచలం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్తలానికి చేరుకుని పరిశీలించారు. శాంతి పూర్తి రక్తపు మడుగులో శవమై పడిఉందని గుర్తించిన పోలీసులు చుట్టుపక్కల వాళ్ల నుంచి వివరాలు సేకరించారు.

రేప్ చేసి చంపేశారా ?
శాంతి శరీరం మీద ఉన్న జాకెట్ పూర్తిగా చినిగిపోయి ఉంది. అంతే కాకుండా ఆమె అర్దనగ్నంగా పడి ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులు అంటున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత ఎవరో శాంతి ఇంటిలోకి వెళ్లారని. తరువాత ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగింది ?
కడలూరు జిల్లా ఎస్పీ అభినవ్ సంఘటనా స్తలానికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, పోలీసు జాగిలాలను సంఘటనా స్తలానికి పిలిపించి క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. శాంతితో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్లు ఎవరైనా హత్య చేశారా ? నగదు, నగల కోసం ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని కడలూరు జిల్లా ఎస్పీ అభినవ్ మీడియాకు చెప్పారు.

ఆంటీ ఫోన్ నెంబర్ కీలకం
విదేశాల్లో ఉన్న శాంతి కుమార్తెకు సమాచారం ఇచ్చామని విరుధాచలం పోలీసులు అన్నారు. శాంతి మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. గురువారం శాంతితో ఎవరెవరు మాట్లాడారు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టుం నివేదిక కోసం వేచి చూస్తున్నామని విరుధాచలం పోలీసులు అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శాంతి దారుణ హత్యకు గురి కావడం విరుధాచలంలో కలకలం రేపింది.