Aunty: ఆంటీ అని వెళ్లాడు, సిగ్నల్ ఇచ్చి 10 తరగతి అబ్బాయితో లేచిపోయిన అంగన్ వాడి ఆంటీ, షాక్!
చెన్నై/ తిరువూర్: ఒకే వీదిలో చుట్టుపక్కల రెండు ఫ్యామిలీలు నివాసం ఉంటున్నాయి. దంపతులకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. సమీపంలో నివాసం ఉంటున్న మహిళకు 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి వస్తున్నారు. అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న మహిళ సమీపంలో నివాసం ఉంటున్న దంపతుల కుమారుడితో చనువుగా ఉంటున్నది. ఈ విషయం చాలా కాలం సీక్రేట్ గా సాగిపోయింది. ఎప్పుడు చూసినా ఆంటీ ఆంటీ అంటూ ఆ అబ్బాయి అంగన్ వాడి మేడమ్ ఇంటిలోనే ఎక్కువగా ఉండేవాడు.
పరిస్థితి చెయ్యి దాటుతుందని గ్రహించిన కుటుంబ సభ్యులు కొడుకును ఆ ఏరియా నుంచ ఖాళీ చేయించి అతన్ని అత్త ఇంటికి పంపించేశారు. అత్త ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న అబ్బాయి కొన్ని రోజుల క్రితం స్కూల్ కు వెళ్లి మాయం అయిపోయాడు. అదే రోజు అంగన్ వాడి ఆంటీ కూడా మాయం అయిపోయింది. అబ్బాయి, ఆంటీ మాయం అయ్యి రోజులు గడిచిపోతున్నా వారి ఆచూకి తెలీకపోవడం కలకలం రేపింది.
ఆంటీనే 10వ తరగతి చదువుతున్న అబ్బాయిని లేపుకుపోయిందని వెలుగు చూడటంతో ఆమె మీద కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. రెండు రోజులు మొబైల్ ఫోన్ ఆన్ చేసి పెట్టిన అంగన్ వాడి ఆంటీ ఇప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
Puneeth
Rajkumar:
పునీత్
ను
చూసి
విలపించిన
చిరంజీవి,
నా
జీవితంలో
మరిచిపోలేని
వ్యక్తి!

ఒకే ఏరియాలో నివాసం
తమిళనాడులోని తిరువూర్ జిల్లాలోని కడవాసల్ తాలుకాలోని ఎరవంచేరి ప్రాంతంలో బాలరసు, రసతి దంపతులు నివాసం ఉంటున్నారు. బాలరసు, రసతికి 10వ తరగతి చదువుతున్న ఓ కొడుకు, 13 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉన్నారు. కొడుకు, కూతురితో కలిసి బాలరసు, రసతి దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

అంగన్ వాడి ఆంటీ
బాలరసు, రసతి దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలోనే రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. రంజితకు 13 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. 35 సంవత్సరాల వయసు ఉన్న రంజిత అదే ప్రాంతంలోని అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెలుతున్న రంజిత మద్యాహ్నం ఇంటికి చేరుకుంటున్నది. రంజితకు భర్త ఉన్నాడు.

అంగన వాడి లేడీ ఇంటి చుట్టూ తిరుగుతున్న అబ్బాయి
బాలరసు, రసతి దంపతుల కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. బాలరసు, రసతి దంపతులు, రంజిత ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి వస్తున్నారు. అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న రంజిత సమీపంలో నివాసం ఉంటున్న బాలరసు, రసతి దంపతుల కుమారుడితో చనువుగా ఉంటున్నది. ఇదే సమయంలో అంగన్ వాడి ఆంటీ రంజిత ఇంటి చుట్టూ ఆ అబ్బాయి తిరగడం మొదలు పెట్టాడు.

ఎంజాయ్ చేశారు... అబ్బాయిని ఏరియా ఖాళీ చేయించారు
కామంతో కళ్లు మూసుకుపోయిన అంగన వాడి రంజిత కొడుకు వయసు ఉన్న మైనర్ అబ్బాయితో ఆమె కోరికలు తీర్చుకుంటున్నదని సమాచారం. ఈ విషయం చాలా కాలం సీక్రేట్ గా సాగిపోయింది. ఎప్పుడు చూసినా ఆంటీ ఆంటీ అంటూ ఆ అబ్బాయి అంగన్ వాడి ఆంటీ రంజిత ఇంటిలోనే ఎక్కువగా ఉండేవాడు. పరిస్థితి చెయ్యి దాటుతుందని గ్రహించిన అబ్బాయి కుటుంబ సభ్యులు కొడుకును ఆ ఏరియా నుంచ ఖాళీ చేయించి అతన్ని అగ్రహారలోని అతని అత్త ఇంటికి పంపించేశారు.

స్కూల్ కు వెళ్లి మాయం
అగ్రహారలోని అత్త ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న అబ్బాయి ఈనెల 26వ తేదీ స్కూల్ కు వెళ్లాడు. రాత్రి అయినా ఆ అబ్బాయికి ఇంటికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు అబ్బాయి కోసం బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. అదే రోజు అంగన్ వాడి ఆంటీ కూడా మాయం అయిపోయిందని తెలుసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

మ్యాటర్ లీక్ చేసిన ఆటో డ్రైవర్
అబ్బాయి కుటుంబ సభ్యులు ఎరవంచేరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. 26వ తేదీన స్కూల్ సమీపంలో రంజిత ఆ అబ్బాయిని ఆటోలో ఎక్కించుకుని బస్ స్టాండ్ వరకు వెళ్లిందని, తరువాత బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఆటో దిగి వెళ్లిపోయారని ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పాడు.

కిలాడీ లేడీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్
అంగన్ వాడి ఆంటీ రంజిత, అబ్బాయి మాయం అయ్యి ఐదు రోజులు గడిచిపోతున్నా వారి ఆచూకి తెలీకపోవడం కలకలం రేపింది. అంగన్ వాడి ఆంటీ రంజితానే 10వ తరగతి చదువుతున్న అబ్బాయిని లేపుకుపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అంగన్ వాడి ఆంటీ మీద అబ్బాయిని కిడ్నాప్ చేసిందనే కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. రెండు రోజులు మొబైల్ ఫోన్ ఆన్ చేసి పెట్టిన అంగన్ వాడి ఆంటీ ఇప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.