చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Party flag: చిన్నమ్మ మీద చిందులు వేసిన కుష్బు, మేడమ్ కు సీన్ లేదు, వాళ్లు మా ఫ్రెండ్స్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధాన అనుచరిలాలిగా, అమ్మ నెచ్చలిగా ఓ వెలుగు వెలిగి అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చిన్నమ్మ వీకే. శశికళ నటరాజన్ సోమవారం తమిళనాడులో అడుగుపెట్టారు. చిన్నమ్మ శశికళకు మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు భారీగా స్వాగతం పలుకుతుంటే మరో వైపు అధికార అన్నాడీఎంకే పార్టీ నాయకులు ఆమెపై మండిడుతున్నారు. పనిలోపనిగా బీజేపీ నాయకురాలు, బహుబాష నటి కుష్బు సైతం చిన్నమ్మ శశికళ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్నది మా ఫ్రెండ్స్, అందుకే నేను ఈ శశికళ విషయంలో జోక్యం చేసుకుంటున్నానని, మేడమ్ కు అంతసీన్ లేదని బీజేపీ మహిళా నేత కుష్బు మండిపడ్డారు.

Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!Illegal affair: సెక్సీ సైన్స్ టీచర్, లెక్కల మాస్టర్, స్కూల్ లో ఆ ప్రయోగాలు, మొగుడికి తెలిసి!

నాలుగేళ్లు దూరం

నాలుగేళ్లు దూరం

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నాలుగు ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ శశికళ ఇటీవల జైలు శిక్ష ముగించుకుని బయటకు వచ్చారు. కరోనా బారినపడిన శశికళ బెంగళూరు చికిత్స చేయించుకుని రిసార్టులో విశ్రాంతి తీసుకుని సోమవారం బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరారు.

ఏడు జిల్లాల్లో బలప్రదర్శన

ఏడు జిల్లాల్లో బలప్రదర్శన


బెంగళూరు నగర శివార్లలోని రిసార్టు నుంచి శశికళ జయలలిత ఉపయోగించిన కారులో తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ జెండాతో హోసూరు మీదుగా చెన్నైకి బయలుదేరారు. తమిళనాడులోని హోసూరులో అడుగుపెట్టిన శశికళకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

చిన్నమ్మకు షాక్

చిన్నమ్మకు షాక్


తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ జెండాను కారు ముందుపెట్టుకుని ప్రయాణించడానికి అనుమతి లేదని తమిళనాడు పోలీసులు చిన్నమ్మ శశికళకు తేల్చి చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు సంవత్సరాల క్రితమే చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించామని, ఆమె మా పార్టీ జెండా పెట్టుకోవడానికి వీళ్లేదని తమిళనాడు మంత్రులు మండిపడుతున్నారు. అన్నాడీఎంకే పార్టీ జెండా వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉండటంతో తమిళనాడు పోలీసులు సైతం శశికళ, ఆమె అనుచరులు ఆ పార్టీ జెండా పెట్టుకుని తిరగకూడదని తేల్చి చెప్పారు.

మేడమ్ కు కుష్బు స్ట్రాంగ్ వార్నింగ్

మేడమ్ కు కుష్బు స్ట్రాంగ్ వార్నింగ్


చిన్నమ్మ శశికళపై బహుబాష నటి, బీజేపీ నాయకురాలు కుష్బు కూడా మండిపడ్డారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ నటరాజ్ ఆ పార్టీ జెండా పెట్టుకున్న కారులో ఎలా తిరుగుతారని కుష్బు ప్రశ్నించారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ బీజేపీకి మిత్రపక్ష పార్టీ అని, అందుకే ఈ విషయంలో తాను స్పంధించాల్సి వచ్చిందని నటి, బీజేపీ మహిళా నాయకురాలు కుష్బు అన్నారు. శశికళ హంగామాపై చాలా మంది నాయకులు మండిపడుతున్నారు.

English summary
Bharatiya Janata Party (BJP) leader Khushbu Sundar on Monday accused expelled AIADMK leader VK Sasikala of misusing the party's flag after she was spotted traveling in a car with the party symbol on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X