Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!
చెన్నై/ మదురై: పోలీస్ ఇన్స్ పెక్టర్ అనితా, అనితా పేరు ఇప్పుడు ఓ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసు అధికారి ఉద్యోగం చూస్తున్న అనితాకు ఎవరైనా చిక్కితే అంతే సంగతి, మేడమ్ అనిత ముట్టుకుంటే కనీసం లక్ష రూపాయలు చెల్లించుకోవాల్సిందే. అయితే మేడమ్ అనితా టైమ్ బాగాలేక నల్లతంబి, మారి చేతిలో చిక్కుకుంది. మేడమ్ టచ్ చేసిన కేసుకు సంబంధించి అడ్వాన్స్ గా రూ. 30 వేలు తీసుకుంది. చాలా కాలం నుంచి కిలాడీ ఇన్స్ పెక్టర్ మీద కన్ను వేసిన ఏసీబీ అధికారులు గాలం వేయడంతో మేడమ్ అడ్డంగా చిక్కిపోయింది. ఇలాంటి పోలీసు అధికారులు బయట ఉంటే ప్రమాదం అని అమ్మగారిని సెంట్రల్ జైలుకు పంపించారు.
Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

నల్లతంబి ఫ్యామిలీ స్ట్రీట్ ఫైట్
తమిళనాడులోని మదురైలోని తిరుమంగలం సమీపంలోని పొన్నంబలం గ్రామంలో నల్లతంబి కుటుంబ సభ్యులు, అదే గ్రామంలో నివాసం ఉంటున్న కొందరు 2017లో గొడవ పడి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలకు సంబంధించి నల్లతంబి కుమారుడు మారి, నల్లతంబి అల్లుడు కమల్ పాండియన్ మీద కేసులు నమోదైనాయి.

మేడమ్ ఆ రోజు అక్కడ వాళ్లులేరు
సెక్కానురాణి పోలీస్ స్టేషన్ లో నల్లతంబి కుటుంబ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది. నల్లతండి కొడుకు మారి, అల్లుడు కమల్ పాండియన్ మీద కేసు నమోదైయ్యింది. తరువాత సెక్కానురాణి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అనితాతో నల్లతంబి మాట్లాడారు. గొడవ జరిగిన సమయంలో తన కొడుకు మారి, అల్లుడు కమల్ పాండియన్ అక్కడ లేరని, ఎఫ్ఐఆర్ లో వారి పేర్లు తొలగించాలని నల్లతంబి లేడీ ఇన్స్ పెక్టర్ అనితాకు మనవి చేశాడు.

మేడమ్ ముట్టుకుంటే లక్ష రూపాయలు
మారి, కమల్ పాండియన్ పేర్లు ఎఫ్ఐఆర్ లో తొలగించాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని ఇన్స్ పెక్టర్ అనితా డిమాండ్ చేసింది. తాను లక్ష రూపాయలు ఇచ్చుకోలేనని నల్లతంబి చెప్పడంతో వాయిదాల పద్దతిలో ఇచ్చినా తనకు ఏమీ అభ్యంతరం లేదని, నేను కేసు డీల్ చేస్తే రూ. లక్ష ఇవ్వాల్సిందే అని మేడమ్ అనితా తేల్చి చెప్పింది.

ఏసీబీ అధికారుల స్కెచ్
ఇన్స్ పెక్టర్ అనితా తీరుతో విసిగిపోయిన నల్లతంబి అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే లేడీ ఇన్స్ పెక్టర్ అనితా మీద చాలా మంది ఇలాంటి ఫిర్యాదులు చెయ్యడంతో ఏసీబీ అధికారులు స్కెచ్ వేశారు. ఏసీబీ అధికారులు రూ. 30 వేలకు రసాయనాలు, అవినీతి తిమింగళాలను పట్టుకోవడానికి ఉపయోగించే పౌండర్ ను డబ్బు నోట్ల మీద చల్లి నల్లతంబి చేతికి ఇచ్చారు. ఈ డబ్బులు తీసుకెళ్లి ఇన్స్ పెక్టర్ అనితాకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.

మేడమ్ మతిపోయి మైండ్ బ్లాక్ అయ్యింది
నల్లతంబి రూ. 30 వేలు తీసుకెళ్లి మేడమ్ అడ్వాన్స్ గా ఈ డబ్బులు తీసుకోవాలని శుక్రవారం లేడీ ఇన్స్ పెక్టర్ అనితాకు ఇచ్చాడు. రూ. 30 వేలు లంచం తీసుకున్న అనితా మిగిలిన రూ. 70 వేలు త్వరగా ఇవ్వాలని చెప్పింది. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు అనితాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని లంచం తీసుకున్న రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్నారు.

సెంట్రల్ జైల్లో మేడమ్
లేడీ ఇన్స్ పెక్టర్ అనితాను మదురై జిల్లా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వడివేలు ముందు హాజరుపరిచారు. లేడీ ఇన్స్ పెక్టర్ ను డిసెంబర్ 11వ తేదీ వరకు రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి వడివేలు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకాలం చేతిలో లాఠీ పెట్టుకుని హంగామా చేసిన లేడీ ఇన్స్ పెక్టర్ అనితాను మదురై సెంట్రల్ జైలుకు పంపించారు.