• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bumper offer: నటి వనిత మూడో పెళ్లి మటాష్ !, నాలుగో అడుగుకు సిద్దం, త్వరలో తీర్థం ?, మస్త్ మసాల!

|

చెన్నై/ బెంగళూరు/ న్యూఢిల్లీ: గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలను వదిలేసిన బహుబాష నటి వనితా విజయ్ కుమార్ కొన్ని నెలల క్రితం ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. మూడో భర్త పచ్చి తాగుబోతు, చైన్ స్మోకర్ అంటూ వీడియో విడుదల చేసి నానా రచ్చ చేసిన వనిత ఇప్పుడు మూడో పెళ్లికి మంగళం పాడేసింది ? అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఫైర్ బ్రాండ్ వనిత ఇప్పుడు నాలుగో అడుగు వెయ్యడానికి సిద్దం అవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. వనిత నాలుగో అడుగుతో అందరికి వణుకు పడుతుందని, మస్త్ మసాలా డైలాగులు ఉంటాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అవుతున్నాయి.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

మూడో భర్తతో హనీమూన్

మూడో భర్తతో హనీమూన్

గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరి భర్తలను వదిలేసిన బహుబాష నటి వనిత విజయ్ కుమార్ కొన్ని నెలల క్రితం ముచ్చటగా పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. మూడో భర్త పీటర్ పాల్ తో వనిత గోవాకు హనీమూన్ కు వెళ్లి వచ్చింది. గోవా టూర్ తరువాత వనిత, పీటర్ పాల్ మధ్య తేడాలు వచ్చాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తన మూడో భర్త పీటర్ పాల్ విషయంలో వనిత ఓ వీడియో కూడా విడుదల చేసింది.

 మూడో మొగుడు మటాష్ ?

మూడో మొగుడు మటాష్ ?

గోవా టూర్ నుంచి చెన్నై చేరుకున్న తరువాత నటి వనిత ఆమె మూడో భర్త పీటర్ పాల్ గురించి ఓ వీడియో విడుదల చెయ్యడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. పీటర్ పాల్ పచ్చి తాగుబోతు, చైన్ స్మోకర్, ఇప్పటికే రెండు సార్లు గుండెపోటు వచ్చిందని, రూ. 25 లక్షలు ఖర్చు చేశానని నటి వనిత వీడియో విడుదల చెయ్యడంతో వైరల్ అయ్యింది. పీటర్ పాల్ మద్యం మానేస్తానని తనకు మాట ఇచ్చి ఇప్పుడు రోజూ తాగుతున్నాడని నటి వనిత ఆరోపించింది. అమ్ముడు వనిత మూడో పెళ్లికి మంగళం పాడేసింది ? అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

బీజేపీలోకి నటి వనిత ?

బీజేపీలోకి నటి వనిత ?

వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. శనివారం తమిళ మీడియాలో నటి వనిత బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నదని ప్రాచారం చేసింది. నటి వనితా మాటకారి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వనిత ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలను, ముఖ్యంగా మీడియాను ఆకర్షిస్తుందని తమిళ ప్రజలు అనేక సందర్బాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఫుల్ గ్లామర్ స్టార్స్

ఇప్పటికే ఫుల్ గ్లామర్ స్టార్స్

తమిళనాడు బీజేపీ శాఖలో ఇప్పటికే కావలసినంత సినీగ్లామర్ ఉంది. బహుబాష నటి గాయిత్రీ రఘురామ్, బొద్దుగుమ్మ నమిత చాలా కాలం నుంచి బీజేపీలో ఉన్నారు. ఇటీవల అలనాటి లేడీ సూపర్ స్టార్ కుష్బు కూడా బీజేపీలో చేరింది. తమ పార్టీలో చేరిన సినీతారలకు బీజేపీ ఏదో ఒకరంగా రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో పదవులు ఇస్తూ వారిని ఆకట్టుకుంటున్నది.

ఖుష్బు ఓటు బ్యాంక్ !

ఖుష్బు ఓటు బ్యాంక్ !

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాంరాం పాడేసి బీజేపీలో చేరిన బహుబాష నటి కుష్బు వలన బీజేపీకి ఎంతలాభం ఉందో ? అనే విషయం ఆ పార్టీ నాయకులకే తెలియాలి. తమిళనాడులో కుష్బు కంటూ ప్రత్యేకంగా ఓటు బ్యాంకు లేదు. కుష్బుకు అంతో ఇంతో అభిమానులు మాత్రం ఉన్నారు. ఆ విషయం బీజేపీ నాయకులకు తెలుసు. అయితే కుష్బు మాటలు, ఆమె సినీగ్లామర్ తో ప్రజలను ఆకట్టుకుంటుందని, భారీ సంక్యలో ప్రజలను మీటింగ్ లకు రప్పించగలదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక నమిత, గాయిత్రీ రఘురామ్ పరిస్థితి అలాగే ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

 బీజేపీకి ఇదే ప్లస్ పాయింట్

బీజేపీకి ఇదే ప్లస్ పాయింట్

తమిళనాడు బీజేపీ శాఖలో సినీ గ్లామార్ ఎక్కువగానే ఉంది. బీజేపీ తారలు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా అక్కడికి మీడియా వెళ్లి ఆ వార్తలను కవర్ చేస్తోంది. ఇలా మీడియా ప్రచారంతో రానురాను ప్రజల్లో ఆధరణ చిక్కుతుందని, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని కొందరు తమిళనాడు బీజేపీ నాయకులు అంటున్నారు. గతంలో అన్నాడీఎంకే పార్టీ (జయలలిత పార్టీ)కి ఇలాంటి సినీ గ్లామర్ ఉండేది. ఇప్పుడు అదే దారిలో తమిళనాడు బీజేపీ నాయకులు పయనిస్తున్నారు.

  Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
   మేడమ్ అక్కడ ఏం చేస్తారో ?

  మేడమ్ అక్కడ ఏం చేస్తారో ?

  తమిళనాడు బీజేపీ శాఖలో ఇప్పటికే చాలా మంది సినీతారలు ఉన్నారు. నటి వనితకు రాజకీయాలు చాలా కొత్త. ఇంత వరకు ఆమె ఏ పార్టీలో లేరు ?, ఏ పార్టీ తరపునా ప్రచారం చెయ్యలేదు. తమిళనాడు బీజేపీ శాఖలో ఇంత గ్లామర్ తారలు ఉంటే అక్కడికి వెళ్లి వనిత ఏమి చేస్తుందో ? అనే విషయం అర్థం కావడంలేదని కొందరు అంటున్నారు. అయితే ఎవరి గ్లామర్ వారిదే, ఎవరి సత్తా వారిదే అంటూ మరికొందరు అంటున్నారు. అయితే తాను బీజేపీలో చేరుతున్నానని ఇప్పటి వరకు నటి వనిత కాని, ఆమె బీజేపీలో చేరుతున్నారు అంటూ బీజేపీ నాయకులు కాని ఒక్కమాట కూడా బయటకు చెప్పలేదు. మొత్తం మీద నటి వనిత నాలుగో అడుగు వెయ్యడానికి సిద్దం అవుతోందని తమిళ మీడియా అంటోంది.

  English summary
  Bumper offer: Tamil actress Vanitha Vijayakumar may join BJP soon in Tamil Nadu?, say sources
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X