• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lady leader: కులం తక్కువని లేడీ లీడర్ కు అవమానం, బీజేపీ ఎంట్రీతో కులపిచ్చి కొడుకులు ఫినిష్ !

|

చెన్నై/ కడలూరు/ మదురై: దళిత కులానికి చెందిన పంచాయితీ అధ్యక్షురాలు రాజేశ్వరిని కులం పేరుతో అవమానించి పంచాయితీ సమావేశంలో నేల మీద కుర్చోపెట్టి మిగిలిన నాయకులు అందరూ కుర్చీల్లో కుర్చుకున్నారు. దళిత మహిళా నాయకురాలు రాజేశ్వరిని తీవ్రస్థాయిలో అవమానించిన కులపిచ్చి కొడుకులు దెబ్బకు తప్పించుకుని పరారైనారు. సాటి మహిళ అనికూడా కనికరం లేకుండా రాజేశ్వరిని అవమానించిన పంచాయితీ కార్యదర్శి సింధుజాను పోలీసులు అరెస్టు చెయ్యడంతో ఉపాధ్యక్షుడు పరారైనాడు. తనకు పార్టీలో తీవ్రఅవమానం జరిగిందని ఆవేదన ఆ పంచాయితీ అధ్యక్షురాలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

పంచాయితీ అధ్యక్షురాలు

పంచాయితీ అధ్యక్షురాలు

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిందంబరం సమీపంలోని మేల్‌ భువనగిరి యూనియన్‌ పరిధిలో తెర్కుదిట్టై పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ అధ్యక్షురాలుగా దళిత సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరి గెలిచారు. ప్రజల మద్దతుతో, డీఎంకే పార్టీ అండతో గెలిచిన రాజేశ్వరి పేరుకు మాత్రమే పంచాయితీ అధ్యక్షురాలిగా ఉందికాని ఏ రోజూ సాటి రాజకీయ నాయకులు ఆమెను గౌరవించిన పాపానపోలేదు.

పంచాయితీ సమావేశం

పంచాయితీ సమావేశం

జులై 17వ తేదీన కరోనా కాలంలోనే తెర్కుదిట్టై పంచాయితీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంచాయితీ అధ్యక్షురాలు రాజేశ్వరి, ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్, పంచాయితీ కార్యదర్శి సింధుజాతో పాటు పంచాయితీ సభ్యులు అందరూ హాజరైనారు. పంచాయితీ కార్యాలయంలోనే ఈ సమావేశం అధికారుల సమక్షంలో జరిగింది.

అధ్యక్షరాలు నేల మీద, లీడర్స్ కుల్చీల మీద

అధ్యక్షరాలు నేల మీద, లీడర్స్ కుల్చీల మీద


పంచాయితీ ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్, పంచాయితీ కార్యదర్శి సింధుజాలతో పాటు కార్యవర్గ సభ్యులు, అక్కడి ప్రభుత్వ అధికారులు అందరూ కుర్చీల్లో కుర్చుకున్నారు. వీరికి కొంచెం దూరంలో నేల మీద పంచాయితీ అధ్యక్షురాలు రాజేశ్వరిని కుర్చోబెట్టారు. కులం తక్కువ కావడంతో వారికి దూరంగా నేల మీద కుర్చోబెట్టడంతో రాజేశ్వరి దీనంగా కుర్చుని పంచాయితీ సమావేశం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటూ ఆ అవమానాన్ని భరించింది.

ఫోటోలో వైరల్

ఫోటోలో వైరల్


ఆరోజు రాజేశ్వరికి ఎంత అవమానం జరిగిందో అనే విషయాన్ని ఓ వ్యక్తి మొబైల్ లో వీడియో, ఫోటోలు తీశాడు. అయితే ఆ రోజు ఆ ఫోటోలు, వీడియోలు బయటకురాలేదు. పంచాయితీ సమావేశం జరిగిన ప్రతిసారి ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్, పంచాయితీ కార్యదర్శి సింధుజాలు పంచాయితీ అధ్యక్షురాలు రాజేశ్వరిని ఇలాగే అవమానించడం జరుగుతోంది. సుమారు రెండు నెలల తరువాత గత శుక్రవారం రాజేశ్వరికి జరిగిన అవమానం గురించి వివరిస్తూ ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి.

సింధుజా అరెస్టు, కులపిచ్చి కొడుకులు పరార్

సింధుజా అరెస్టు, కులపిచ్చి కొడుకులు పరార్

పంచాయితీ అధ్యక్షురాలు రాజేశ్వరి దళిత కులానికి చెందినదని, అందుకే ఇంతటి అవమానం జరిగిందని విమర్శలు తలెత్తడంతో తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భువనగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాబిన్సన్ రంగంలోకి దిగి రాజేశ్వరి, ఆమె భర్త శరవణన్ లను విచారణ చేశారు. తాను పేరుకు మాత్రమే పంచాయితీ అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యాయని, ప్రతిరోజూ అవమానాలు భరిస్తూనే ఉన్నానని రాజేశ్వరి విచారణం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు పంచాయితీ కార్యదర్శి సింధుజాను అరెస్టు చేశారు.

టార్చర్ పెట్టారు సార్

టార్చర్ పెట్టారు సార్

పంచాయితీ అధ్యక్షురాలు రాజేశ్వరికి జరిగిన అవమానం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతా ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్ చేశారని సింధుజా చెప్పింది. అయితే పోలీసులు మాత్రం సింధుజా మాటలు లెక్కచెయ్యకుండా ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. పరారైన మోహన్ రాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బీజేపీలో చేరిన రాజేశ్వరి

బీజేపీలో చేరిన రాజేశ్వరి

దళిత మహిళ రాజేశ్వరి తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీ నుంచి పంచాయితీ అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యారు. రాజేశ్వరికి జరిగిన అవమానంపై బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు ఎల్. మురుగన్ మండిపడ్డారు. ప్రజాప్రతిధి అయిన రాజేశ్వరిని కులం తక్కువ చేసి మాట్లాడటం, ఆమెను నేల మీద కుర్చోబెట్టడం సిగ్గుచేటు అంటూ మురుగన్ విమర్శించారు. తాను ప్రజాప్రతినిధిగా గెలిచాను అనే మాటే కాని ఒక్కరోజు కూడా తనకు కాని, తన కుర్చీకి కాని గౌరవం ఇవ్వలేదని రాజేశ్వరి విచారం వ్యక్తం చేసింది. డీఎంకే పార్టీకి గుడ్ బై చెప్పిన రాజేశ్వరి బీజేపీలో చేరారు. తనకు బీజేపీలో సరైన గౌరవం దక్కుతుందని రాజేశ్వరి ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

English summary
Caste abuse: Chidambaram Woman Panchayat president Rajeswari joins in BJP in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X