ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని లవర్ తో వెళ్లిన రాహుల్, రేప్ చేసి ఫ్రెండ్ కు షేర్ చేశాడు, ప్రాణం !
చెన్నై/ తిరుపత్తూర్: ప్రేమిస్తున్నానని కాలేజ్ అమ్మాయి వెంటపడిన యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఆ యువతి కాలేజ్ లో అధ్యాపకులతో మాట్లాడటానికి కాలేజ్ కు వెళ్లింది. అంతే ఆమెను నమ్మించి ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని తీసుకెళ్లిన ప్రియుడు అత్యాచారం చేశాడు. ఏ ప్రియుడు చెయ్యని దారుణమైనపని ఆ కాలాంతకుడు చేశాడు. ప్రియురాలి మీద ప్రియుడు అత్యాచారం చెయ్యడమేకాకుండ అతని స్నేహితుడితో కూడా ఆత్యాచారం చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. తన ప్రియుడు మోసం చేశాడని ఆవేదనతో ఉరి వేసుకున్న యువతి 10 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. పరారైన ప్రియుడు, ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!
ఇంటర్ అమ్మాయి... డిగ్రీ అబ్బాయి
తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా నట్రంపల్లిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి అత్తూరుప్పం ప్రాంతంలోని జంగలపురం ప్రభుత్వ కాలేజ్ లో ఇంటర్ (ఫ్లస్ టూ) ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నది. యువతి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న సెహగర్ అనే వ్యక్తి కుమారుడు రాహుల్ గాంధీ (20) అనే యువకుడు వేరే కాలేజ్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఐలవ్ యూ బంగారం
ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాహుల్ గాంధీకి, యువతికి పరిచయం ఉంది. అప్పుడప్పుడు కాలేజ్ పరిసర ప్రాంతాల్లో యువతి, రాహుల్ గాంధీ మాట్లాడుకునే వాళ్లు. ఇంటి నుంచి యువతి కాలేజ్ కు వెళ్లినా, కాలేజ్ నుంచి ఇంటికి బయలుదేరినా రాహుల్ గాంధీ ఆమె వెంటపడ్డాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, ఐలవ్ యూ బంగారం, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ రాహుల్ గాంధీ ఆ యువతికి మాయమాటలు చెప్పాడు.
పెళ్లి అయితే ఓకే
కొంతకాలం రాహుల్ గాంధీ వెంటపడటంతో యువతి అతని ప్రేమలో పడింది. ఊరి నుంచి కాలేజ్ కు వెలుతున్న రాహుల్ గాంధీ ప్రియురాలితో తిరగడం మొదలుపెట్టాడు. బయట తిరుగుతున్న రాహుల్ గాంధీతో యువతి చనువుగా ఉండేదని తెలిసింది. ఆ చనువే ఆ అమ్మాయి ప్రాణం మీదకు తెలుస్తుందని ఊహించలేకపోయింది.
రేప్ చేసింది కాక ఫ్రెండ్ కు షేర్ !
10 రోజుల క్రితం కాలేజ్ లో అధ్యాపకులతో మాట్లాడాలని ఆ యువతి కాలేజ్ కు వెళ్లింది. కాలేజ్ కి వెళ్లిన అమ్మాయి రాత్రి అయినా ఇంటికి తిరిగిరాకపోడంతో ఆమె తల్లి ఆందోళన చెందింది. కాలేజ్ కు వెళ్లిన ప్రియురాలిని నమ్మించిన రాహుల్ గాంధీ తన స్నేహితుడు జీవా ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. ఫ్రెండ్ ఇంటికి ప్రియురాలిని తీసుకెళ్లిన రాహుల్ గాంధీ ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రియురాలిపై అత్యాచారం చేసిన రాహుల్ గాంధీ అతని స్నేహితుడు జీవాకు అమ్మాయిని దానం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రియురాలి మీద జీవా లైంగిక దాడి చేశాడని తెలిసింది.
ప్రియుడు మోసం చేశాడని !
రాత్రి పొద్దుపోయిన తరువాత నేరుగా ఇంటికి వెళ్లిన యువతి జరిగిన విషయం మొత్తం ఆమె తల్లికి చెప్పి బోరున విలపించింది. పెళ్లి చేసుకుంటానని తన ప్రియుడు తనను మోసం చేశాడని, ఫ్రెండ్ తో కలిసి తన జీవితం నాశనం చేశాడని ఆవేదనతో ఆమె ఇంటిలోనే ఉరి వేసుకుంది. విషయం గుర్తించిన యువతి తల్లి స్థానికుల సహాయంతో ఆమెను తిరుపత్తూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని ధర్మపురిలోని మరో ఆసుపత్రికి తరలించారు.
Recommended Video
10 రోజులు పోరాటం చేసి చివరికి !
10 రోజుల నుంచి ధర్మపురిలోని ఆసుపత్రిలో ఉన్న యువతి చికిత్స విఫలమై మరణించింది. యువతి తల్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియురాలు ఉరి వేసుకుందని తెలిసిన వెంటనే ఆమె ప్రియుడు రాహుల్ గాంధీ, అతని స్నేహితుడు జీవా పరారైనారని, ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.