• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్

|

ఇప్పటిదాకా మనమెన్నో క్రైమ్ కథనాలను వినుంటాం, కానీ ఇది మాత్రం బహుశా ప్రపంచంలోనే అత్యంత అరుదైన కేసు. పిన్నవయస్కుడిపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తడం మన దేశంలో దాదాపు మొదటిసారే కావొచ్చు. మీసాలు కూడా పదును తేలని ఆ ముఖం వెనుక భయానక సెక్సోన్మాది ఉన్నాడని ఎవరూ ఊహించలేరు. అందుకే ఇది సంచలన వార్త అయింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వెలుగుచూసిన ఈ యువ కామాంధుడికి సంబంధించి చెన్నై ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తేబీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే

లవ్లీ గణేశ్.. ఆ పేరుకే పడతారు..

లవ్లీ గణేశ్.. ఆ పేరుకే పడతారు..

సోషల్ మీడియా వేదిగా, మరీ ముఖ్యంగా ఫేస్ బుక్ సాక్షిగా అమ్మాయిలను పరిచయం చేసుకుని.. వాళ్లతో మాటలకు కలిపి.. క్రమంగా దగ్గరై.. ఆపై ప్రేమను వ్యక్త పరిచి.. ఎలాగోలా వారిని పెళ్లి చేసుకుని.. అనుభవించిన తర్వాత సైకోపాత్ చర్యలతో వాళ్లను హింసించడం అతని నైజం. వరుసగా ఇలాంటి నేరాలకు పాల్పడుతోన్న గణేశ్ అలియాస్ లవ్లీ గణేశ్ అనే యువకుడిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఇతడి గురించి వెల్లడైన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. ఇప్పటిదాకా అతని వలలో చిక్కిన అమ్మాయిల సంఖ్య అందరినీ బిత్తరపోయేలా చేసింది.. అతని చేతిలో మోసపోయిన 11వ భార్య ఫిర్యాదు ఇవ్వడంతో గుట్టుమొత్తం బయటపడిందిలా..

22 ఏళ్లకే 11 పెళ్లిళ్లు..

22 ఏళ్లకే 11 పెళ్లిళ్లు..

చెన్నై సిటీకే చెందిన గణేశ్ అలియాస్ లవ్లీ గణేశ్ వయసు ప్రస్తుతం 22 ఏళ్లు. కానీ అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడంలో అతనిది మాస్టర్ స్థాయి. 22 ఏళ్ల వయసుకే ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇతనికి చిక్కిన అమ్మాయిలు అందరికి అందరూ సోషల్ మీడియా ద్వారానే పరిచయం కావడం గమనార్హం. ఫేస్ బుక్ పరిచయాన్ని పెంచుకుంటూ పోయి తన మాయమాటలతో అమ్మాయిలను ప్రేమలోకి దింపుతాడు. అనంతరం వారిని పెళ్లి చేసుకున్నాకగానీ అసలైన శాడిజాన్ని చూపించేవాడు. అతని టార్చర్ తట్టుకోలేక 11వ భార్య ఇంట్లో నుంచి పారిపోయి పోలీసుల్ని ఆశ్రయించింది..

మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తిమోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తి

భార్య ఎదురుగానే బాలికపై రేప్..

భార్య ఎదురుగానే బాలికపై రేప్..

లవ్లీ గణేశ్ కు ఫేస్‌బుక్ ద్వారా 2017లో చెన్నైలోని కొలాథూర్‌కు చెందిన 20 ఏళ్ల అమ్మాయి పరిచయం అయింది. ఒకరు కనెక్ట్ అయ్యారు. ప్రేమలో పడ్డారు. గణేశ్, ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఇద్దరూ మేజర్లే కావడంతో 5 డిసెంబర్ 2020 న గణేశ్ బాలికను ఏకాంత ప్రదేశంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం విల్లివాక్కం ప్రాంతంలోని రాజాజీ నగర్‌లో వీరిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. పెళ్లైన తర్వాతి రోజే ఆ ఇంట్లోకి గణేశ్ ఓ 17 ఏళ్ల బాలికను తీసుకొచ్చి.. పనిమనిషి అని చెప్పాడు. భార్య చూస్తుండగానే బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు..

లెస్బియన్ సెక్స్ వీడియో..

లెస్బియన్ సెక్స్ వీడియో..

పని మనిషిలా ఉంటుందంటూ తీసుకొచ్చిన బాలికతో గణేశ్ అనుచితంగా ప్రవర్తించడాన్ని భార్య ప్రశ్నించింది. ఇలా ఎందుకు చేస్తున్నావని నిలదీసినందుకు ఆమెను గదిలో బంధించి శారీరకంగా హింసించాడు. చేతులను తాడులతో కట్టి, నోటిని బట్టలతో కొట్టి లైంగిక అవయవాలు నొప్పెట్టేలా పైశాచికంగా ప్రవర్తించాడు. అప్పటికే తనకు 10 మంది అమ్మాయిలతో పెళ్లిళ్లు అయ్యాయని భార్యకు చెబుతూ.. ఆ 10 మందితో కలిసున్నప్పటి సెక్స్ వీడియోలను చూపించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి, బలవంతంగా మద్యం తాగించాడు. భార్య మద్యం మద్దులో ఉండగా.. ఆమెను.. 17ఏళ్ల బాలికతో లెస్బియన్ సెక్స్ చేయాల్సిందిగా బెదిరించి, ఆ వీడియోలను స్నేహితులకు పంపాడు. ఇంకా..

భార్య న్యూడ్ వీడియోలతో బేరాలు..

భార్య న్యూడ్ వీడియోలతో బేరాలు..

తన భార్యతోపాటు బాలిక నగ్న వీడియోలను స్నేహితులకు పంపిన గణేశ్.. వాళ్లతో బలవంతపు వ్యభిచారానికి ప్రయత్నించాడు. తన స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బలవంతం చేశాడు. దారుణంగా హింసించాడు. గణేశ్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య చాకచక్యంగా ఇంటి యజమానులను సాయం కోసం అర్ధించింది. వారి సాయంతో అక్కణ్నుంచి తప్పించుకున్న భార్య.. నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే రియాక్టైన పోలీసులు.. గణేశ్ ను అదుపులోకి తీసుకుని, 17ఏళ్ల బాలికను కాపాడి, రెస్క్యూ హోంకు తరలించారు. గణేశ్ ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నాడని, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

English summary
The all-women police have arrested a youth for allegedly raping a minor girl and torturing his wife physically in Villivakkam. The offender, identified as Ganesh alias Lovely Ganesh, 21, of Bharathi Nagar, befriended a 20-year-old girl from Kolathur on social media. he allegedly cheated 11 women in the pretext of marriage. Ganesh brought a 17-year-old girl into the house as domestic aid. He sexually assaulted the girl in the presence of his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X