చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Yellow alert: చెన్నై చిత్తడి, హైదరాబాద్ వయా బెంగళూరు, వద్దంటే వినడే, ఈ నగరాలకు ఏమైయ్యింది !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ హైదారాబాద్/ బెంగళూరు: వరుణ దేవుడి దెబ్బకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రజలు హడలిపోతున్నారు. మొన్న హైదరాబాద్, నిన్న బెంగళూరు, నేడు చెన్నై సిటీపై వాన దేవుడు దండయాత్ర చేస్తున్నాడు. హైదరాబాద్, బెంగళూరు ప్రజలు ఇంకా వరుణ దేవుడి దాటికి తేరుకోలేకపోతున్నారు. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు. ఇదే సమయంలో ఈశాన్య రుతు పవనాలు తమిళనాడులో ప్రవేశించడంతో ఆ రాస్ట్రంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ నగరాలకు ఏమైయ్యింది ? ఓ పక్క కరోనా, మరో పక్క వాన అంటూ ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రజలకు వరుణ దేవుడి దెబ్బకు బోబ్బిలిరాజ సినిమాలో వద్దంటే వినడే అనే పాట గుర్తుకు వస్తోంది.

Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !

 ఆంధ్రా- తెలంగాణకు సినిమా

ఆంధ్రా- తెలంగాణకు సినిమా

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు అతలాకుతలం అయ్యాయి. వరుసబెట్టి వరుణ దేవుడు దంచికొట్టడంతో రోడ్లు చెరువులను తలపిస్తూ జలమయం అయ్యాయి. హైదరాబాద్ ప్రజలను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా దేశంలోని అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వరుణ దేవుడు ఓ ఊపుఊపేసి సైలెంట్ అయిపోయాడు.

 బెంగళూరు ప్రజలకు క్రీమ్ బిస్కెట్

బెంగళూరు ప్రజలకు క్రీమ్ బిస్కెట్

హైదరాబాద్ లో తన ప్రతాపం చూపించిన వరుణ దేవుడు వయా బెంగళూరు అంటూ వచ్చేశాడు. బెంగళూరులో నాలుగు రోజుల పాటు పగలు రాత్రి అని తేడా లేకుండా భారీ వర్షాలు కురిశాయి. అసలే బెంగళూరు కావడంతో చిన్నచితకా రోడ్లను కబ్జా చేసేసి కట్టడాలు కట్టేయడంతో డ్రైనేజ్ ల్లోని నీళ్లు రోడ్ల మీదకు రావడంతో, అప్పటికే రోడ్లలో వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలకు సినిమా కనపడింది. వరుణ దేవుడి దెబ్బకు నాలుగు రోజుల పాటు బెంగళూరు ప్రజలు క్రీమ్ బిస్కెట్ రుచి చూశారు.

 చెన్నై వలస వెళ్లిన వరుణ దేవుడు

చెన్నై వలస వెళ్లిన వరుణ దేవుడు

హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చిన వరుణ దేవుడు ఇప్పుడు వయా చెన్నై అంటూ అక్కడికి చేరుకున్నాడు. చెన్నై సిటీలో భారీ వర్షాలు పడుతున్నాయి. గతరాత్రి ఎన్నడూ లేని విధంగా చెన్నై సిటీ తడిచి ముద్ద అయ్యింది. ఈశాన్య రుతు పవనాలు బుధవారం తమిళనాడులోకి ప్రవేశించడంతో ఆ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కేరళ, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల దెబ్బకు తమిళనాడులోని జలాశయాలు నిండిపోయి పొంగిపోర్లుతున్నాయి.

 అండమాన్ దెబ్బతో అలర్ట్

అండమాన్ దెబ్బతో అలర్ట్

అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడటం, ఈశాన్య రుతు పవనాలు రాకతో తమిళనాడులో భారీ వర్షాలు పడుతాయని, ముఖ్యంగా సముద్రతీర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల దెబ్బకు చెన్నై ప్రజలు తడిసి వర్షం నీటిలో చిత్తడి కాకుండా తమిళనాడు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది.

 వరుణ దేవుడు టూర్ షిఫ్ట్

వరుణ దేవుడు టూర్ షిఫ్ట్

తమిళనాడులో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో సముద్రంలోకి చేపలు పట్టడానికి జాలర్లు వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. మొత్తం మీద హైదరాబాద్, బెంగళూరు టూర్ ముగించుకుని వరుణ దేవుడు ఇప్పుడు చెన్నై చేరుకున్నాడు. చెన్నైలో వరుణ దేవుడి దెబ్బకు ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయో ? అంటూ స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

English summary
Yellow alert: Chennai meteorological department says heavy rain will be in the city. yellow alert in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X