చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దైవదూత నిర్మలా .. కరోనాకు ముందు ఆర్ధిక వ్యవస్థ మాటేంటి ..'యాక్ట్ ఆఫ్ గాడ్' వ్యాఖ్యలపై చిదంబరం ఫైర్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం విరుచుకుపడ్డారు .కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థపై చేసిన 'యాక్ట్ ఆఫ్ గాడ్' వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. దేవుని దూతగా ఆర్ధిక శాఖామంత్రి సమాధానం ఇవ్వాలన్నారు.

 కరోనా దేవునిచే చేయబడిన చట్టం .. అందుకే ఆర్ధిక వ్యవస్థ పతనం .. నిర్మల వ్యాఖ్యలు

కరోనా దేవునిచే చేయబడిన చట్టం .. అందుకే ఆర్ధిక వ్యవస్థ పతనం .. నిర్మల వ్యాఖ్యలు

కరోనావచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ,కరోనావైరస్ మహమ్మారి 'దేవునిచే చెయ్యబడిన ఒక చట్టం గా మారటం వల్ల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఆర్ధిక తిరోగమనాన్ని చూస్తుందని సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై చిదంబరం మాట్లాడుతూ, "మహమ్మారి 'దేవుని చట్టం' అయితే, దైవ దూత నిర్మలా సీతారామన్ అంటూ ఆయన అభివర్ణించారు .

కరోనాకు ముందు ఆర్ధిక పరిస్థితి మాటేంటి ? ప్రశ్నించిన చిదంబరం

కరోనాకు ముందు ఆర్ధిక పరిస్థితి మాటేంటి ? ప్రశ్నించిన చిదంబరం

కరోనాకు ముందు ఆర్ధక వ్యవస్థ పతనం అవుతూ వచ్చిందని , 2017-18, 2018-19 మరియు 2019-20 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ యొక్క దుర్వినియోగాన్ని ఎలా చూడాలో చెప్పాలని ఆయన నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు . మహమ్మారి రాక ముందు దేశ ఆర్దిక వ్యవస్థ పరిస్థితి ఎందుకు క్షీణించిందని దానికి కారణం ఏమిటో దేవుని దూతగా ఆర్ధిక మంత్రి నిర్మల దయచేసి సమాధానం చెప్పాలి అని మాజీ ఆర్థిక మంత్రి ఆమెను ప్రశ్నించారు .

 జీఎస్టీ బకాయిలు చెల్లించటానికి రుణాలా? రాష్ట్రాలపై ఆర్ధిక భారమా

జీఎస్టీ బకాయిలు చెల్లించటానికి రుణాలా? రాష్ట్రాలపై ఆర్ధిక భారమా

జీఎస్టీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నందున ఆదాయ నష్టాలను భర్తీ చెయ్యటం కోసం ఎక్కువ రుణాలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరినందుకు చిదంబరం కేంద్రంపై పై వ్యాఖ్యలు చేశారు .జీఎస్టీ పరిహార అంతరాన్ని తగ్గించడానికి మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన రెండు ఎంపికలు ఆమోదయోగ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు. "మొదటి ఎంపిక కింద రాష్ట్రాలు తమ భవిష్యత్ రాబడిని పరిహార సెస్ కింద తాకట్టు పెట్టడం ద్వారా రుణాలు తీసుకోమని కోరటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక భారం పూర్తిగా రాష్ట్రాలపై పడుతుంది అని చిదంబరం అన్నారు.

 కేంద్రం చేస్తుంది స్థూల ద్రోహం అంటూ మండిపడిన చిదంబరం

కేంద్రం చేస్తుంది స్థూల ద్రోహం అంటూ మండిపడిన చిదంబరం

కేంద్రం ఇచ్చిన రెండో ఆప్షన్ కింద, ఆర్బిఐ విండో నుండి రుణాలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరటం కూడా కరెక్ట్ కాదని ఆయన అన్నారు . ఇది కూడా ఎక్కువ రుణాలు వేరే పేరుతో తీసుకోమని చెప్పటం మాత్రమేనని మళ్ళీ, మొత్తం ఆర్థిక భారం రాష్ట్రాలపై పడుతుంది అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు . ఏ ఆర్థిక బాధ్యతనైనా కేంద్ర ప్రభుత్వం స్వయంగా నిర్వర్తించాలని , అలా కాకుండా రాష్ట్రాల మీద ఆర్ధిక భారం పెట్టటం సమంజసం కాదని చిదంబరం పేర్కొన్నారు. ఇది "స్థూల ద్రోహం" అని, అలాగే "చట్టాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించడం" అని చిదంబరం ఆరోపించారు.

English summary
If the pandemic is an ‘Act of God', how do we describe the mismanagement of the economy during 2017-18, 2018-19 and 2019-20, asked former finance minister P Chidambaram to present finance minister nirmala seetharaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X