• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sexual torcher: ఎయిర్ పోర్టు రోడ్డులో సినిమా చూపించిన నాగవల్లి, కాళ్లుపట్టుకున్న పోలీసులు, ట్రాఫిక్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: ప్రపంచ ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం సన్నిధిలో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళ ఇంత కాలం ప్రశాంతంగా జీవించింది. అయితే కొందరు అల్లరిమూకలు ఆమె మీద కన్ను వేశారు. వస్తావా.... ఇస్తావా అంటూ ఆమెకు ఫోన్ లు చేసి వేధించారు. చివరికి శారీరఖ సుఖం ఇస్తావా అంటూ ఆమె మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు పంపిస్తూ మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు.

చివరికి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ఎయిర్ పోర్టు రోడ్డులోకి వెళ్లిన ఆమె పట్టపగలు పోలీసులకు, స్థానికులకు నాగవల్లి సినిమా చూపించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో శ్రీయ దెబ్బకు ఎలా ట్రాఫిక్ జామ్ అయ్యిందో అక్కడ అలాగే ట్రాఫిక్ జామ్ కావడంతో ఒక్కసారిగా అందరూ బిత్తరపోయారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

ప్రపంచంలోనే ఫేమస్ టెంపుల్ సిటీ

ప్రపంచంలోనే ఫేమస్ టెంపుల్ సిటీ

తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. మదురైకి తమిళనాడులోని ఇతర ప్రాంతాల ప్రజలతో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు, విదేశాల నుంచి ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి వెలుతుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రం మదురైలో స్థానికులు ఎంతో భక్తిశ్రద్దలతో ఆదిపరాశక్తి అమ్మవారికి ప్రతినిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ భయంతో చాలా బుద్దిగా ఉంటారు.

వల్లి మీద కన్ను వేసిన కామాంధులు

వల్లి మీద కన్ను వేసిన కామాంధులు

మదురైలోని అవన్యపురం ప్రాంతంలో వల్లి (35) అనే మహిళ చాలా ప్రశాంతమైన జీవితం గుడుపుతూ వస్తోంది. అయితే స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు అల్లరిమూకలు, కామాంధులు వల్లి ఇంటి నుంచి వీధిలోకి వచ్చి వెళ్లే సమయంలో ఆమెపై జోకులు వెయ్యడం, ఆట పట్టించడం చేశారు. అయితే పోకిరీలు ఏం చేసినా వల్లి ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమెపని ఆమె చేసుకుని ఇంటికి వెళ్లిపోయేదని సమాచారం.

ఆంటీ వస్తావా... అడిగింది ఇస్తావా

ఆంటీ వస్తావా... అడిగింది ఇస్తావా

వల్లి సైలెంట్ గా వచ్చి వెళ్లిపోతున్న సమయంలో కొందరు అల్లరిమూకలు ఆంటీ వస్తావా... మేము అడిగింది ఇస్తావా అంటూ ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఎక్కడ వచ్చిన రామాయణం అంటూ వల్లి చూసిచూడనట్లు పట్టించుకోకుండా సైలెంట్ గా వెళ్లిపోయింది. రోజురోజుకు అల్లరిమూకల ఆగడాలు ఎక్కువ కావడంతో వల్లి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది.

ఏం కావాలన్నా ఇస్తాం... నువ్వు ఓకేనా ?

ఏం కావాలన్నా ఇస్తాం... నువ్వు ఓకేనా ?

వల్లి మొబైల్ నెంబర్ సంపాధించిన కొందరు కామాంధులు ఆమెకు ఎప్పుడు పడితే అప్పుడు మా కోరిక తీర్చాలని, నీకు ఏమి కావాలన్నా ఇస్తామంటూ మెసేజ్ లు పంపించి ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేశారు. రోడ్డు మీద వెలుతున్న సమయంలో చిల్లర చేష్టలు చేసిన కామాంధులకు ఇటీవల వల్లి వార్నింగ్ ఇచ్చింది. అయితే కామాంధుల ఆగడాలు ఎక్కువ కావడం, లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో వల్లి విసిగిపోయి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి చిల్లర గొడవలు మామూలే, నీ పని నువ్వు చేసుకుని సైలెంట్ గా ఇంటికి వెళ్లిపో అంటూ స్థానిక పోలీసులు వల్లికి ఉచిత సలహా ఇవ్వడంతో ఆమెకు ఎక్కడో మండిపోయింది.

చంద్రముఖి సినిమా చూపించిన ‘నాగవల్లి'

చంద్రముఖి సినిమా చూపించిన ‘నాగవల్లి'

పోలీసులు కేసు నమోదు చెయ్యడానికి నిరాకరించడంతో రగిలిపోయిన వల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మదురై విమానాశ్రయం- విల్లుపురం రోడ్డులోని ఎంఎంసీ కాలనీలోని మెయిన్ రోడ్డులో కుర్చుని పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ధర్నా చేసింది. నడిరోడ్డు మీద వల్లి కుర్చోవడంతో వాహన సంచారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో హీరోయిన్ శ్రీయ దెబ్బతో ఎలా ట్రాఫిక్ జామ్ అయ్యిందో అచ్చం అలాగే వల్లి దెబ్బతో మదురై విమానాశ్రయం రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వల్లి దెబ్బకు మదురై ఎయిర్ పోర్డు రోడ్డులో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

వల్లి కాళ్లు పట్టుకున్న పోలీసులు

వల్లి కాళ్లు పట్టుకున్న పోలీసులు

మేము బిజీగా ఉన్నాము, తరువాత చూద్దాంలే అంటూ వల్లిని పంపించి కేసు నమోదు చెయ్యని పోలీసులకు సినిమా కనిపించింది. మదురై ఎయిర్ పోర్టు రోడ్డులోకి వెళ్లిన పోలీసులు రగిలిపోతున్న నాగవల్లి కాళ్లు పట్టుకుని బతిమలాడినా ఆమె వినలేదు. వల్లి దెబ్బతో వాహన సంచారానికి అంతరాయం కలగడం, వల్లి ఎంత సేపటికి ఆదిపరాశక్తిలాగా శాంతించకపోవడంతో చివరికి పోలీసులు బలవంతంగా ఆమెను పోలీసు జీపులో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వల్లి తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు కామాంధుల కోసం గాలిస్తున్నారు.

English summary
Cinema: Sexual harassment issue Madurai women did dharna in Madurai Airport road in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X