• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Cinema sketch: రైల్వే ట్రాక్ లో రౌడీషీటర్ తల, అడవిలో కాళ్లు, చేతులు, మొండెం, బెయిల్, ఆంటీ !

|

చెన్నై/ మదురై: ముడ్డికిందకు 30 ఏళ్ల రాలేదు కానీ అతను పెద్ద రౌడీషీటర్. తన పేరు చెబితే అందరూ హడలిపోవాలని, వంగివంగి సలామ్ లు చెయ్యాలని అతను పాటుపడ్డాడు. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలోని రౌడీషీటర్ల జాబితాలో పేరు సంపాధించుకున్న ఆ యువకుడు హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు, దౌర్జన్యాలు, సెటిల్ మెంట్లు ఇలా సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడు. హత్య కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన రౌడీషీటర్ కు ఆంటీని, మద్యం ఎర వేసిన ప్రత్యర్థులు అతని తల, మొండెం, చేతులు, కాళ్లు ఇలా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కొక్కచోట విసిరేసి అతి దారుణంగా చంపేశారు.

Criminal wife: భర్తకు బెడ్ రూమ్ స్కెచ్, హత్యకు రూ. లక్షలు డీల్, కెమెరామెన్ గణేష్ తో గాయిత్రి, ష్!

ముడ్డి కిందకు 30 ఏళ్లకే పాటు

ముడ్డి కిందకు 30 ఏళ్లకే పాటు

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీ శివార్లలోని అత్తప్పక్కం సమీపంలోని గుమ్మిడిపూండి ప్రాంతంలో మాధవన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మాధవన్ కు ముడ్డి కిందకు 30 ఏళ్ల రాకముందే అతను పెద్ద రౌడీషీటర్ గా అవతారం ఎత్తాడు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు, సెటిల్ మెంట్ లు ఇలా సంఘ వ్యతిరేక కార్యకలాపాలతో మాధవన్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక సంబంధాలు ఉన్నాయి.

జైలు... బెయిల్ మామూలే

జైలు... బెయిల్ మామూలే

అనేక కేసులు ఉన్న మాధవన్ మీద ఇప్పటికే అరంబాక్కం, గుమ్మిడిపూండి, సిప్ కాట్ తదితర పోలీస్ స్టేషన్లలోని రౌడీషీటర్ల జాబితాలో అతని పేరు నమోదైయ్యింది. హత్యల కేసుల్లో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లడం, తరువాత బెయిల్ మీద బయటకు రావడం మాధవన్ కు అత్తారింటికి వచ్చి వెళ్లినట్లు మామూలైపోయింది.

 బెయిల్ మీద వచ్చి ఏం చేశాడంటే ?

బెయిల్ మీద వచ్చి ఏం చేశాడంటే ?

18 నెలల క్రితం రైల్వేస్టేషన్ సమీపంలో ముగ్గురు దారుణ హత్యకు గురైనారు. ఈ కేసుల్లో మాధవన్ తో పాటు అనేక మంది జైలుకు వెళ్లారు. మాధవన్ బెయిల్ మీద బయటకు వచ్చి అతని మీద హత్య కేసులు పెట్టిన వారిని కరమూని ప్రాంతంలో పట్టుకుని మళ్లీ వారి మీద హత్యాయత్నం చెయ్యడంతో మళ్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 పవర్ ఫుట్ ఆంటీ. మద్యం వల !

పవర్ ఫుట్ ఆంటీ. మద్యం వల !

కొన్ని రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చిన మాధవన్ మాత్రం అతని పద్దతి మార్చుకోలేదు. ఇదే సమయంలో మాధవన్ వీక్ నెస్ మీద దెబ్బ కొట్టాలని ప్రత్యర్థులు ప్రయత్నించారు. అంతే మాధవన్ కు బలంగా, కండలు ఉన్న వివాహిత మహిళను వలవేశారు అసలే ఆంటీల పిచ్చితో రగిలిపోతున్న మాధవన్ ఆమెతో జల్సా చేస్తున్నాడని సమాచారం. ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న మాధవన్ ఆమెతో కలిసి మద్యంకూడా సేవిస్తున్నాడని తెలిసింది.

రైల్వే ట్రాక్ పై రౌడీషీటర్ తల

రైల్వే ట్రాక్ పై రౌడీషీటర్ తల

గుమ్మిడిపూండీ రైల్వేస్టేషన్ సమీపంలో మాధవన్ తల మాత్రం పడిఉండటాన్ని గమనించిన స్థానికులు షాక్ కు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గురైయ్యింది, రైల్వే ట్రాక్ మీద ఉన్న తల మాధవన్ దే అని పోలీసులు నిర్దారించారు. అయితే మాధవన్ మొండెం మాత్రం రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో కనపడక పోవడంతో పోలీసులు గాలించారు.

శరీరం, కాళ్లు, చేతులు ముక్కలు ముక్కలు

శరీరం, కాళ్లు, చేతులు ముక్కలు ముక్కలు

గుమ్మడిపూండీ సమీపంలోని అటవి ప్రాంతంలో చివరికి మాధవన్ శరీరం గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు. రౌడీషీటర్ మాధవన్ మొండెం, కాళ్లు, చేతులు ముక్కలు ముక్కలు చేసిన చేసిన ప్రత్యర్థులు అతన్ని అతి కిరాతకంగా హత్య చేశారని గుర్తించారు. మొండెం, కాళ్లు, చేతులు పడి ఉన్న ప్రాంతంలో పదుల సంఖ్యలో మద్యం సీసాలు పడిఉండటంతో ప్రత్యర్థులే మాధవన్ ను పక్కాప్లాన్ తో హత్య చేశారని పోలీసులు అంటున్నారు. మాధవన్ హత్యకు గురైన రోజు రాత్రి ఇంటి సమీపంలో ఒక్కడే బైక్ లో వెళ్లినట్టు అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు అంటున్నారు. అయితే రౌడీషీటర్ మాధవన్ ను ఎవరు హత్య చేశారు ? అని పక్కా సమాచారం లేదని, కేసు విచారణలో ఉందని గుమ్మడిపూండీ పోలీసులు తెలిపారు.

English summary
Cinema sketch: 30 year old rowdy sheeter murder near Chennai in Tamil Nadu due to prejudice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X