• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెన్నైలో మరో కీచక టీచర్-ముద్దులు,కౌగిలింతలు,లైంగిక దాడులు-కామంతో క్లాస్‌రూమ్‌లోనే అరాచకాలు

|

ఇటీవల చెన్నైలోని పద్మ శేషాద్రి బాలా భవన్ పాఠశాలలో కీచక టీచర్ లైంగిక వేధింపుల ఘటన మరవకముందే... చెన్నైలోని మరో స్కూల్లోనూ ఇదే తరహా ఘటన వెలుగుచూసింది. కామర్స్ టీచర్‌ గత కొన్నేళ్లుగా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థినుల నుంచి పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘానికి 500 మెసేజ్‌లు వచ్చాయి. ఫిర్యాదు చేసినవారిలో ప్రస్తుతం ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు మాజీ విద్యార్థినులు కూడా ఉన్నారు. దీన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో సదరు టీచర్‌పై వేటు పడింది.

తండ్రి లాంటి వాడినని.. ఆ వంకతో...

తండ్రి లాంటి వాడినని.. ఆ వంకతో...

పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం యాజమాన్యానికి రాసిన మెయిల్‌లో పేర్కొన్న ప్రకారం... క్లాస్ రూమ్‌లో అతను దారుణంగా ప్రవర్తించేవాడు. తండ్రి లాంటి వాడినని తనకు తానే విద్యార్థులకు చెప్పేవాడు. ఆ వంకతో విద్యార్థినులను తన ఒడిలో కూర్చోబెట్టుకోవడం,ఫ్రెండ్లీగా వారిని మద్దు పెట్టుకోవడం చేస్తుండేవాడు. ఎప్పుడైనా విద్యార్థినులు అతన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడు. క్లాస్ రూమ్‌లో అందరి ముందు అవమానపరిచేవాడు. అబ్బాయిలను కూడా దారుణంగా కొట్టేవాడు. చెప్పరాని భాషలో అందరి ముందే అసభ్య పదజాలంతో దూషించేవాడు.

అరగంట ముందే క్లాసుకు రావాలని...

అరగంట ముందే క్లాసుకు రావాలని...


విద్యార్థినుల సెల్‌ఫోన్లకు అసభ్యకర సందేశాలు పంపించేవాడు. ఒకవేళ వాటికి రిప్లై ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించేవాడు. ఒకానొక సందర్భంలో ఒక విద్యార్థినిని క్లాస్ షెడ్యూల్ కంటే అరగంట ముందే రావాలని ఎస్ఎంఎస్ పంపించాడు. తనను మాత్రమే అరగంట ముందు క్లాసుకు రమ్మన్నాడని తెలియక ఆ విద్యార్థిని చెప్పిన సమయానికి ఉదయం 7గంటల కల్లా క్లాసుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై ఆమె యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమెనే బెదిరించాడు. చివరకు ఆమె 11వ తరగతిలో డిటైన్డ్ అయింది.

అదే అదనుగా వేధింపులు...

అదే అదనుగా వేధింపులు...


సాధారణంగా చదువులో వెనుకబడ్డ విద్యార్థుల కోసం స్కూల్లోనే రాత్రి 8 గంటల వరకు కోచింగ్ క్లాసులు నిర్వహించేవారు. ఆ సమయంలో స్కూల్ సిబ్బంది గానీ ఇతర అధికారులు గానీ ఎవరూ ఉండేవారు కాదు. అదే అదనుగా అతను విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడేవాడు. వారిని ముద్దు పెట్టుకోవడం,కౌగిలించుకోవడం,ఒడిలో కూర్చోబెట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడేవాడు. నిజానికి చదువులో వెనుకబడ్డవారి కోసమే ఆ క్లాసులు నిర్వహించేవారు. కానీ సదరు కీచక టీచర్ మాత్రం... అకడమిక్ పెర్ఫామెన్స్‌తో సంబంధం లేకుండా తనకు నచ్చిన విద్యార్థినిని కోచింగ్ క్లాసులకు రావాలని బలవంతపెట్టేవాడు.

  Corona Devi Idol: Tamil Nadu లో కరోనా దేవత... అమ్మా తల్లీ రక్షించు| Bizarre | VIRAL
  ప్రైవేట్ టీచింగ్ పేరుతో ఇంటికి పిలిచి...

  ప్రైవేట్ టీచింగ్ పేరుతో ఇంటికి పిలిచి...


  అంతేకాదు,ప్రైవేట్ టీచింగ్ పేరుతో కొంతమంది విద్యార్థినులను అతను తన ఇంటికి కూడా పిలిచేవాడు. ఆ సమయంలో వారి పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.కొన్నిసార్లు స్కూల్ అయిపోయాక... విద్యార్థినులను బైక్‌పై ఎక్కించుకుని దేవాలయాలకు తీసుకెళ్లేవాడు. ఒకేసారి ముగ్గురు విద్యార్థినులను బైక్‌పై ఎక్కించుకునేవాడు. ఒకవేళ అతనితో వెళ్లేందుకు నిరాకరిస్తే అందరి ముందే బండ బూతులు తిట్టేవాడు. విద్యార్థినుల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన ఆ టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని... భవిష్యత్తులో మరే ఇన్‌స్టిట్యూట‌్‌లోనూ అతను పనిచేయకుండా చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.విద్యార్థినుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు స్కూల్ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పేర్కొంది.

  English summary
  Days after a schoolteacher in Chennai was suspended and arrested following multiple allegations of sexual harassment levelled by his students, students of another school in Chennai have come forward and accused a commerce teacher of having sexually harassed and intimidated them for years.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X