• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రజనీకాంత్ పార్టీకి కరోనా షాక్ .. సెల్ఫ్ క్వారంటైన్ అయిన తలైవా .. రీజన్ ఇదే

|

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా షాక్ ఇచ్చింది . ఒక పక్క అన్ణాత్తే సినిమాని తొందరగా పూర్తి చేయాలని, మరోపక్క త్వరలో రాజకీయ పార్టీని ప్రకటించాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న రజనీకాంత్ కు కరోనా షాకిచ్చింది. అన్నట్టే చిత్రం కోసం షూటింగ్ నిర్వహిస్తున్న సిబ్బందిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రావడంతో చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

రజనీకాంత్ ఓకే అంటే సీఎంగా బరిలో దిగుతానన్న కమల్ హాసన్: తలైవా పార్టీ పొంగల్ కేరజనీకాంత్ ఓకే అంటే సీఎంగా బరిలో దిగుతానన్న కమల్ హాసన్: తలైవా పార్టీ పొంగల్ కే

రజనీకాంత్ కు కరోనా దెబ్బ

రజనీకాంత్ కు కరోనా దెబ్బ


డిసెంబర్ 31 న పార్టీని అనౌన్స్ చేసి, త్వరితగతిన ఈ సినిమాను పూర్తి చేసి సంక్రాంతి నాటికి పార్టీ ని అధికారికంగా ప్రకటించాలని రజినీకాంత్ భావించారు. కానీ ఊహించని విధంగా కరోనా దెబ్బ కొట్టడం తో ప్రస్తుతం రజనీకాంత్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో హైదరాబాద్‌లో డిసెంబర్ 14 న అన్ణాత్తే షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సిరుతై శివ దర్శకత్వం వహించిన అన్ణాత్తే గ్రామీణ వినోదాత్మక చిత్రం. ఈ చిత్రంలో నయనతార మరియు కీర్తి సురేష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

అన్ణాత్తే చిత్ర యూనిట్ లో 8 మందికి కోవిడ్ పాజిటివ్

అన్ణాత్తే చిత్ర యూనిట్ లో 8 మందికి కోవిడ్ పాజిటివ్

ఈ చిత్ర యూనిట్ లో పనిచేస్తున్న ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకటం తో రజనీకాంత్ మరియు మిగిలిన అన్ణాత్తే తారాగణం మరియు సిబ్బంది సుమారు రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంటారు. రజనీకాంత్, నయనతార కూడా చిత్ర సిబ్బందికి కరోనా సోకిన నేపధ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఇవ్వనున్నారు

. రజనీకాంత్ ప్రచారకర్త రియాజ్ అహ్మద్ ఈ వార్తను ధృవీకరించారు. "ఎనిమిది మంది సిబ్బంది కోవిడ్ -19 పాజిటివ్‌ను పరీక్షించారని, రజనీకాంత్ తిరిగి చెన్నైకి వస్తారా లేదా హైదరాబాద్‌లో సెల్ఫ్ క్వారంటైన్ అవుతారా అనేది ఇంకా తెలియ రాలేదు అన్నారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నాము" అని ఆయన అన్నారు.

సినిమానే కాదు పార్టీ ప్రకటన కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్

సినిమానే కాదు పార్టీ ప్రకటన కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్

జనవరిలో అన్ణాత్తే సినిమాను పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ కావాలని భావించిన రజనీకాంత్ కు ఇది ఊహించని పరిణామం. రోజుకు 14 గంటలు షూటింగ్ లో పాల్గొని సాధ్యమైనంత త్వరగా సినిమాని పూర్తి చేయాలని రజనీకాంత్ సినిమా కోసం పని చేశాడట. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచు నట్లుగా చిత్ర యూనిట్ మహమ్మారి బారిన పడడంతో సినిమా మరి కొంత కాలం జాప్యం అయ్యే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో రజనీకాంత్ రాజకీయ పార్టీ కూడా అనుకున్న సమయానికి ప్రకటించడం జరగదనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కరోనా దెబ్బకు తలైవా రజనీ కాంత్ సెల్ఫ్ క్వారంటైన్

కరోనా దెబ్బకు తలైవా రజనీ కాంత్ సెల్ఫ్ క్వారంటైన్


రజనీకాంత్, నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు, మీనాతో సహా మొత్తం సిబ్బంది హైదరాబాద్‌లో ఈ ప్రస్తుత సినిమా షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు కరోనా బారిన పడిన సిబ్బంది కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో అన్నాట్టే షూటింగ్ ఆగిపోయింది. సుమారు తొమ్మిది నెలల తరువాత, వారం క్రితం షూట్ తిరిగి ప్రారంభమైంది. మళ్లీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇదిలా ఉంటే రజనీకాంత్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ అవ్వటంతో రాజకీయ పార్టీ ప్రకటనకు మరి కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది.

English summary
Corona gave a shock to superstar Rajinikanth. On the one hand, Corona shocked Rajinikanth, who was working on a war footing, to complete the film quickly and on the other hand to announce a political party soon. The shooting of the film annatthe came to a halt when eight of the crew who were shooting for the film got a corona positive. With Rajinikanth also becoming a self-quarantine, there seems to be a further delay in the announcement of a political party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X