• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Coronavirus: కరోనా పుణ్యామా అంటూ విదేశాల్లో ఉద్యోగం ఊడింది, భార్యకు మండింది, పిల్లలను చంపి!

|

తంజావూరు/ చెన్నై: విదేశాల్లో మంచి జీతం సంపాధిస్తున్న సమయంలో అతని భార్య చాలా హ్యాపీగా ఉండేది. భర్త సొంతఊరికి వచ్చిన సమయంలో అతనితో పాటు పిల్లలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేది. అయితే కరోనా పుణ్యమా అంటూ విదేశాల్లో ఉద్యోగం ఊడిపోవడంతో స్వదేశానికి వచ్చిన భర్త కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. కాంట్రాక్టర్ గా అంతంతమాత్రం డబ్బులు సంపాధిస్తున్న భర్తను అతని భార్య చులకనగా మాట్లాడుతూ చీదరించుకోవడం చేసేది. అయితే భర్తతో గొడవపడిన పుణ్యాత్మురాలు ఇద్దరు పిల్లలను చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. భర్తతో గొడవపడి ఇద్దరు పిల్లను చంపేసిన తల్లి మీద పోలీసులు సీరియస్ అయ్యారు.

Honeytrap: నాజూకు అమ్మాయిలు, కావలసినంత కండ, లావు పొడువు ఆంటీలు, మీడియా ముసుగులో డీల్!

 హ్యాపీ జీవితం

హ్యాపీ జీవితం

తమిళనాడులోని తంజావూరు జిల్లా సెవప్పునాగంతోరై ప్రాంతానికి చెందిన సురేష్ కుమార్, సెంతమిళ్ సెల్వి దంపతులు నివాసం ఉంటున్నారు. సురేష్ కుమార్, సెల్వీ దంపతులకు సువేత (12) అనే కుమార్తె, గోకుల్ (4) అనే కుమారుడు ఉన్నారు. పెళ్లి జరిగిన తరువాత సురేష్ కుమార్ భర్య సెల్వీతో పాటు ఇద్దరు పిల్లలను చాలాబాగా చూసుకునేవాడు.

విదేశాల్లో భర్త ఉద్యోగం

విదేశాల్లో భర్త ఉద్యోగం

గత కొన్ని సంవత్సరాల నుంచి సురేష్ కుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. విదేశాల్లో జీతం బాగా సంపాదించే సమయంలో భార్య సెల్వీ అడిగినంత డబ్బులు ఆమె బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేసేవాడు. సంవత్సరానికి ఒక్కసారి సొంతఊరికి వచ్చి వెలుతున్న సురేష్ కుమార్ ను అతని భార్య సెల్వీ పువ్వుల్లో పెట్టి చూసుకునేది. ఇద్దరు పిల్లలను కూడా సెల్వీ చాలాబాగా చూసుకునేది.

కరోనా పుణ్యామా అంటూ ఉద్యోగం ఊడింది

కరోనా పుణ్యామా అంటూ ఉద్యోగం ఊడింది

విదేశాల్లో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో సురేష్ కుమార్ పనిచేస్తున్న కంపెనీ చేతులు ఎత్తేసింది. కరోనా దెబ్బకు కంపెనీ ఢీలాపడిపోవడంతో విదేశాల్లో ఉంటున్న సురేష్ కుమార్ ఉద్యోగం మానేసి తమిళనాడు చేరుకున్నాడు. స్వతహాగా సివిల్ ఇంజనీరు అయిన సురేష్ కుమార్ ముందు ఉన్న పరిచయాలు, బంధువుల సలహామేరకు అతను బిల్డింగ్ కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తి కొన్ని చోట్ల భవనాలు నిర్మిస్తున్నాడు.

చులకనగా మాట్లాడి చీదరించుకున్న భార్య

చులకనగా మాట్లాడి చీదరించుకున్న భార్య

తమిళనాడులో కరోనా వైరస్ తాండవం చెయ్యడం, లాక్ డౌన్ దెబ్బతో బిల్డింగ్ కాంట్రాక్టు పనులు అంతంత మాత్రం జరుగుతున్న సమమంలో సురేష్ కుమార్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో డబ్బులు సంపాధించలేదని భర్త సురేష్ కుమార్ ను చూసిన ప్రతిసారి కుటుంబ సభ్యులు, బంధువుల ముందు అతని భార్య సెల్వీ చులకనగా మాట్లాడటం, చీదరించుకోవడం చేసేది. ఇదే విషయంలో సురేస్ కుమార్, సెల్వీ దంపతుల మధ్య గత రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

 నీ చావు నువ్వు చావు, మా చావు మేము చస్తాం

నీ చావు నువ్వు చావు, మా చావు మేము చస్తాం

గత వారం రోజుల నుంచి సురేష్, సెల్వీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి భర్త సురేష్ కుమార్ తో గొడవపడిన సెల్వీ ఇద్దరు బిడ్డలను పిలుచుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తన భార్య సెల్వీ పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిఉంటుందని సురేష్ కుమార్ బావించాడు. అయితే సెల్వీ నేరుగా భారీ వర్షాల దెబ్బకు ఉదృతంగా ప్రవహిస్తున్న కళ్లనై నది దగ్గరకు వెళ్లింది. భారీగా పొంగిపోర్లుతున్న కళ్లనై నదిలో కుమార్తె సువేత, కొడుకు గోకుల్ ను తోసేసింది. నదిలో పడిపోయిన ఇద్దరు పిల్లలు కేకలు వెయ్యడంతో స్థానికులు విషయం గుర్తించారు. అదే సమయంలో సెల్వీ కూడా నదిలో దూకేసింది.

  Rs.5,000 to Plasma Donors కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5 వేలు : ఏపీ సర్కార్
  నీకేం పోయేకాలం వచ్చింది !

  నీకేం పోయేకాలం వచ్చింది !

  స్థానికులు కష్టపడి సెల్వీని ప్రాణాలతో రక్షించారు. అయితే ఇద్దరు పిల్లలు అప్పటికే నీటిలో కొట్టుకుని వెళ్లిపోయారు. గజఈతగాళ్లు రంగంలోకి దిగి 12 గంటలపాటు నదిలో గాలించి గోకుల్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంత వరకు సువేత ఆచూకి తెలియకపోవడంతో అమ్మాయి మరణించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తన మీద గొడవపడి అన్యాయంగా తన ఇద్దరు పిల్లలను చంపేసిందని సురేష్ కుమార్ భార్య సెల్వీ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే సెల్వీ మీద కోపంగా ఉన్న పోలీసులు ఆమె మీద హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నదిలో కొట్టుకుపోయిన సువేత కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు.

  English summary
  Coronavirus: Mother killed his children near Tanjore in Tamil Nadu due to family issue
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X