చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీఎంకెలో ఆళగిరి మంటలు.. స్టాలిన్‌పై యుద్దం ప్రకటించిన సోదరుడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కానివ్వనని...

|
Google Oneindia TeluguNews

డీఎంకెలో కరుణానిధి వారసుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. డీఎంకె చీఫ్ స్టాలిన్‌ ఎన్నటికీ సీఎం కాలేడని... తాను కానివ్వనని ఆయన సోదరుడు,డీఎంకే బహిష్కృత నేత అళగిరి శపథం చేశారు. డీఎంకె కోసం నిస్వార్థంగా పనిచేసిన తనను పార్టీ నుంచి బహిష్కరించి స్టాలిన్ ద్రోహం చేశాడన్నారు. కుట్ర పూరితంగా తనను బయటకు పంపించిన స్టాలిన్‌కు గుణపాఠం చెప్పి తీరుతానని అన్నారు. ఆదివారం(జనవరి 4) తమిళనాడులోని మధురైలో తన మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆళగిరి ఈ వ్యాఖ్యలు చేశారు.

స్టాలిన్ నాకు ద్రోహం చేశాడు : ఆళగిరి

స్టాలిన్ నాకు ద్రోహం చేశాడు : ఆళగిరి

'స్టాలిన్ నాకెందుకు ద్రోహం చేశాడో తెలియదు. ఎప్పుడూ పార్టీ కోసం పనిచేయడమే తప్ప ఏనాడు నేను పదవులు ఆశించలేదు. స్టాలిన్‌కి పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా నేను కాదనలేదు. ఒకప్పుడు మధురై ఎంజీఆర్ కంచుకోటగా ఉండేది... దాన్ని డీఎంకె కంచుకోటగా మార్చేందుకు కృషి చేశాను. దక్షిణ తమిళనాడులో డీఎంకెని బలోపేతం చేసేందుకు ఎంతో పనిచేశాను. ఇవన్నీ మరిచి స్టాలిన్ నన్ను కుట్రపూరితంగా బయటకు పంపించాడు. నాకు బలమెంత అని ప్రశ్నించేవారికే ఈ వేదికే ఒక సమాధానం..' అని ఆళగిరి వ్యాఖ్యానించారు.

స్టాలిన్‌ను సీఎం కానివ్వను : ఆళగిరి

స్టాలిన్‌ను సీఎం కానివ్వను : ఆళగిరి

'ఎప్పుడు చూసినా స్టాలిన్ భవిష్యత్ సీఎం అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. కానీ అది జరగబోదు. నా మద్దతుదారులు నిన్ను సీఎం అవకుండా అడ్డుకుని తీరుతారు. డీఎంకెకి చెందిన ఓ జిల్లా కార్యదర్శి.. కరుణానిధి కంటే స్టాలిన్ గొప్పగా పనిచేస్తున్నాడని పేర్కొన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు విని నేను సిగ్గుపడుతున్నా. కలైంజర్‌తో స్టాలిన్‌ని ఎలా పోలుస్తారు..? ఎన్నో సందర్భాల్లో నేను పార్టీని ఆదుకున్నాను. స్టాలిన్‌కు పార్టీ పరంగా ఏ సాయం కావాల్సి వచ్చినా చేశాను.' అని ఆళగిరి పేర్కొన్నారు.

త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా...

త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా...

'ఏడేళ్లుగా నేను మౌనంగా ఉన్నా. ఇప్పుడు నా మద్దతుదారులు నన్ను కొత్త పార్టీ పెట్టమంటున్నారు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటా. ఏ నిర్ణయం తీసుకున్నా నా మద్దతుదారులంతా దాన్ని ఆమోదించడానికి సిద్దంగా ఉండాలి.' అని ఆళగిరి ప్రకటించారు. ఆళగిరి కొత్త పార్టీ పెడుతారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ పెట్టి రజనీకాంత్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జరిగింది. కానీ రజనీ పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడటంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఆళగిరి బీజేపీతోనూ కలవొచ్చునన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆళగిరి బీజేపీ నేతలను తన దరిదాపుల్లోకి కూడా రానివ్వట్లేదని తెలుస్తోంది. తండ్రి కరుణానిధి సిద్దాంతాలకు విరుద్దంగా బీజేపీతో చేతులు కలపవద్దని ఆయన భావిస్తున్నారు. ఆయన కొత్త పార్టీ పెడుతారా లేక మరో పార్టీకి మద్దతు ప్రకటిస్తారా అన్నది ఇప్పటికైతే క్లారిటీ లేదు.

స్టాలిన్‌కు గండి కొడుతాడా?

స్టాలిన్‌కు గండి కొడుతాడా?

త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళ ఉద్దండ రాజకీయ నేతలు జయలలిత,కరుణానిధి మరణం తర్వాత తొలిసారి రాష్ట్రంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకె విజయం సాధించగా.. ఆ తర్వాత కొద్ది నెలలకే అనారోగ్యంతో ఆమె మరణించారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అన్నాడీఎంకె ప్రభుత్వం ఎలాగోలా ఐదేళ్ల కాలాన్ని నెట్టుకొస్తోంది. జయలలిత,కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులో నెలకొన్న నాయకత్వ శూన్యతను ఎవరు భర్తీ చేయబోతున్నారన్న చర్చ చాలాకాలంగా జరుగుతోంది. ఈ క్రమంలో కమల్ హాసన్ కొత్త పార్టీతో ముందుకొచ్చాడు.రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే గుడ్ బై చెప్పేశారు. వీళ్లందరితో పోలిస్తే డీఎంకె చీఫ్ స్టాలిన్ బలమైన నేతగా కనిపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. అయితే సోదరుడు ఆళగిరి ఎదురు తిరుగుతుండటం,కలైంజర్ డీఎంకె పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండటంతో స్టాలిన్‌కు ఆ ఎఫెక్ట్ తప్పేలా లేదు.

English summary
ack in the forefront of Tamil Nadu politics just months ahead of the next Assembly elections, MK Alagiri, the elder son of late former chief minister M Karunanidhi, lashed out at MK Stalin, his younger sibling and the CM-face of principal opposition DMK, at a meeting of his supporters on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X