Doubt: భార్య మీద అంకుల్ కు అనుమానం, అసలే మేడమ్ ది బ్యూటీ పార్లర్, కథ క్లైమాక్స్..!
చెన్నై/ హైదరాబాద్: భార్య మీద అనుమానంతో ఓ భర్త అన్నంతపని చేశాడు. టిప్పుటాప్ గా రెడీ అయ్యి రోజూ బ్యూటీ పార్లర్ కు వెలుతున్న భార్య మీద భర్తకు రోజురోజుకు అనుమానం పెరిగిపోయింది. ప్రతిరోజూ భార్యకు తెలీకుండా ఆమెను వెంబడించడం, తరువాత ఇంటికి వచ్చిన సతీమణిని వేధించడం భర్తకు అలావాలు అయిపోయింది. మంచి ముహూర్తం చూసిన భర్త అనుకున్నంత పని చేశాడు. చూడటానికి దంపతులు అంకుల్, అమ్మాయి లాగా ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Khiladi: రేయ్ ఎంతపని చేశావురా ?, రసగుల్లా లాంటి అమ్మాయితో జీవితం, సీన్ రివర్స్ తో?
భార్య భర్త లవ్ స్టోరీ
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని థచూర్ ప్రాంతంలో ఎడ్వర్డ్ లారెన్స్ (48), సోరోవమార్త్ (32) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఎడ్వర్డ్, సరోమార్త దంపతుల వయసులో చాలా తేడా ఉంది. ఏది ఏమైనా ఎడ్వర్డ్ లారెన్స్, సరోమార్త దంపతుల మద్య కొంతకాలం కాపురం అలా ఇలా జరిగిపోతూ వచ్చింది.
బ్యూటీ పార్లర్ ఎఫెక్ట్
సరోమార్త బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం టిప్ టాప్ గా రెడీ అయ్యి ఇంటి నుంచి బయటకు వెలుతున్న సరోమార్త బ్యూటీ పార్లర్ లో పని ముగించుకుని రాత్రి ఎప్పుడో ఇంటికి వెలుతోంది. తన భార్య సరోమార్త ప్రతిరోజూ టిప్ టాప్ గా రెడీ అయ్యి ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి రావడం భర్త ఎడ్వర్డ్ లారెన్స్ జీర్ణించుకోలేకపోయాడు.
రెండు నెలల క్రితం?
రెండు నెలల క్రితమే చెన్నైలోని చెంగల్పట్టూ సమీపంలోని చెంగన్నూర్ ప్రాంతానికి ఎడ్వర్డ్ లారెన్స్, సరోమార్త దంపతులు కాపురం మార్చారు. ఇళ్లు మార్చినా సరోమార్త దంపతులు మద్య గొడవలు ఏమాత్రం తగ్గలేదు. ఇళ్లు మార్చిన తరువాత కూడా సరోమార్త ప్రతిరోజూ ఆమె బ్యూటీపార్లర్ కు వెళ్లి వస్తున్న విషయం ఎడ్వర్డ్ లారెన్స్ జీర్ణించుకోలేకపోయాడు.
రాత్రి స్కెచ్ అదిరింది
రాత్రి ఇంటికి వచ్చిన భార్య సరోమార్తతో భర్త ఎడ్వర్డ్ లారెన్స్ గొడవ పెట్టుకున్నాడు. నువ్వు బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తున్నావా ?. ఎవడితో అయినా కులికి వస్తున్నావా ? అంటూ గొడవ పడేవాడు. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం ఎడ్వర్డ్ లారెన్స్ వంట గదిలో ఉన్న కూరగాయలు తరిగే కత్తి తీసుకుని వచ్చి భార్య సరోమార్త మీద కసితీరా పొడిచేశాడు.
అంకుల్ సీన్ రివర్స్
కత్తిపోట్లకు గురైన సరోమార్త కేకలు వేసింది. విషయం గుర్తించిన స్థానికులు సరోమార్త ఇంటికి పరుగులు తీశారు. అదే సమయంలో ఎడ్వర్డ్ లారెన్స్ పరారైనాడు. తీవ్రగాయాలైన సరోమార్తను మాధవరం ఆసుపత్రికి తరలించినా ఎలాంటి ఫలితం లేదని, ఆమె మరణించిందని పోలీసులు అన్నారు. భార్య మీద ఉన్న పిచ్చపాటి అనుమానంతోనే భర్త లారెన్స్ హత్య చేశాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.