చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Engineer: తండ్రి పొలిటికల్ లీడర్, కొడుకు ఇంజనీర్, వాటర్ ట్యాంక్ లో శవం, అవే నీళ్లు తాగిన ప్రజలు!

కనపడకుండా పోయిన రాజకీయ నాయకుడి కొడుకు ఊరిలోని తాగునీటి ఓవర్ వాటర్ ట్యాంక్ లో శవమై కనిపించాడు. 9 రోజుల నుంచి వాటర్ ట్యాంక్ లో శవం ఉండటం, ఊరి ప్రజలు అందరూ కళ్లిపోయిన శవం ఉన్న నీటిని తాగడంతో ఇన్ఫెక్షన్ భయంతో ఆసుపత్రులకు

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కడలూరు: రాజకీయ నాయకుడికి ఆ ప్రాంతంలో మంచిపలుకుబడి ఉంది. రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి కుమారుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువకుడు ఉద్యోగం చెయ్యకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇటీవల రాజకీయ పరిణామాల కారణంగా ఆ రాజకీయ నాయకుడు గత ఎన్నికల్లో ఓడిపోయి మాజీ అయ్యాడు.

కొన్ని రోజుల నుంచి కనపడకుండా పోయిన రాజకీయ నాయకుడి కొడుకు ఊరిలోని తాగునీటి ఓవర్ వాటర్ ట్యాంక్ లో శవమై కనిపించడం కలకలం రేపింది. 9 రోజుల నుంచి వాటర్ ట్యాంక్ లో శవం ఉండటం. ఊరి ప్రజలు అందరూ కళ్లిపోయిన శవం ఉన్న నీటిని తాగడంతో ఇన్ఫెక్షన్ భయంతో ఆసుపత్రులకు పరుగు తీశారు.

Bengaluru: పార్క్ లో లవర్స్, ఏందిరా ఇలా చేస్తున్నారు లఫూట్, పేటీఎంలో లంచం తీసుకున్న పోలీస్!Bengaluru: పార్క్ లో లవర్స్, ఏందిరా ఇలా చేస్తున్నారు లఫూట్, పేటీఎంలో లంచం తీసుకున్న పోలీస్!

రాజకీయ నాయకుడి కొడుకు

రాజకీయ నాయకుడి కొడుకు

తమిళనాడులోని కడలూరు జిల్లా విరుధాచలం సమీపంలోని రాజేంద్రపట్నం గ్రామంలో శివశంకర్ అనే రాజకీయ నాయకుడు ఉన్నాడు. శివవంకర్ కుమారుడు శరవణకుమార్ (34) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చెయ్యకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు.

గత గ్రామ పంచాయితీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓడిపోయిన శివశంకర్ ప్రస్తుతం మాజీ పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. శివశంకరన్ కుమారుడు శరవణ కుమార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అతను తన తల్లి మరియు సోదరుడితో కలిసి ఊరిలోనే ఉంటున్నాడు.

9 రోజుల క్రితం మాయం

9 రోజుల క్రితం మాయం

9 రోజుల క్రితం శరవణ కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత శరవణ కుమార్ కనిపించలేదు. శరవణ కుమార్ కోసం చాలా చోట్ల వెతికినా అతని ఆచూకీ లభించలేదు. శరవణ కుమార్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. శరవణ కుమార్ తో పాటు ఇంజనీరింగ్ చదువుకున్న వారిని, చుట్టుపక్కల గ్రామాల వారిని విచారణ చేసినా అతని గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. చివరికి మిస్సింగ్ కేసు పెట్టిన శరవణ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు.

ఊరి వాటర్ ట్యాంక్ లో శవమైన శరవణ కుమార్

ఊరి వాటర్ ట్యాంక్ లో శవమైన శరవణ కుమార్

రాజేంద్రపట్నం గ్రామంలోని ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజీ ట్యాంక్ ఉంది. ఇదే వాటర్ ట్యాంక్ నీళ్లను ఊరి ప్రజలు తాగుతున్నారు. రెండు మూడు రోజుల నుంచి తాగునీరు దుర్వాసన వెదజల్లుతున్నట్లు గ్రామస్తులు ఊరి పెద్దలకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా ప్రజలు ఆ వాటర్ ట్యాంక్ లోని నీటిని తాగుతున్నారు. మూడవ రోజు దుర్వాసన ఎక్కువ కావడంతో ప్రజలకు అనుమానం వచ్చిన వాటర్ ట్యాంక్ తెరిచి చూశారు. అదే వాటర్ ట్యాంక్ లో ఇన్ని రోజులు కనిపించకుండా పోయిన శరవణ కుమార్ లోపల కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించడంతో ఊరి ప్రజలు షాక్ తిన్నారు.

అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగింది?

ఊరి ప్రజలు వాటర్ ట్యాంక్ నీళ్లు మొత్తం ఖాళీ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంక్ లో నుంచి శరవణ కుమార్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శరవణ కుమార్ వాటర్ ట్యాంక్ లో పడి ఆత్మహత్య చేసుకున్నాడా ?, ఎవరైనా హత్య చేశారా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో 9 రోజులుగా వాటర్ ట్యాంక్‌లోనే మృతదేహం ఉండడంతో నీళ్లు తాగిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా వైద్య బృందం ప్రజలకు పరీక్షలు చేస్తోంది. చాలా మంది ప్రజలు భయంతో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగు తీస్తున్నారు.

English summary
Engineer: Political leader's son found dead in over water tank, people drinking water from that tank since 9 days in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X