Ex lover: భర్త బయటకు, మాజీ ప్రియుడు ఇంట్లోకి ఎంట్రీ, తండ్రికి తెలిసి స్పాట్ లో పొడిచాడు, చివరికి ?
చెన్నై/ కోయంబత్తూర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మద్యలో ఇద్దరి మద్య వ్యవహారం బెడిసికొట్టింది. నాలుగేళ్ల క్రితం అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు. కుమార్తెకు వివాహం జరిగిపోయిందని ఊపిరిపీల్చుకున్న తండ్రికి అతని కుమార్తె మాజీ ప్రియుడు యమకింకరుడిలా తయారైనాడు. తన మాజీ ప్రియురాలు ఎక్కడ కాపురం ఉంటుందో తెలుసుకున్న ఆ యువకుడు అక్కడికి వెళ్లి తన కోరిక తీర్చాలని ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆమె తండ్రికి విషయం చెప్పింది. బస్ స్టాండ్ లో అందరూ చూస్తుండగానే తండ్రి తన కుమార్తె మాజీ ప్రియుడిని కత్తితో స్పాట్ లో కసకసా పొడిచేశాడు.
Illegal affair: రాత్రి కారులో ప్రియుడితో భార్య రొమాన్స్, భర్త వీడియో కాల్ చేశాడు, కట్ చేస్తే !

ప్రేమపాపురాలు
తమిళనాడులోని కోయంబత్తూరులోని పోథానూర్ ఆర్టిస్ట్ నగర్ లో సెల్వకుమార్ (49) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సెల్వకుమార్ కుమార్తె రాణి (పేరు మార్చడం జరిగింది) అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వీరాస్వామి (25) అనే యువకుడు ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని మొదట భావించారు.

ఆడ పావురం ఎగిరిపోయింది
ప్రేమికులు వీరాస్వామి, రాణిల మద్య ఐదు సంవత్సరాల క్రితం చిన్నచిన్న గొడవలు అయ్యాయి. తరువాత ఓ సంవత్సరం కలిసి తిరిగినా ఇద్దరి మద్య ఏకాభ్రిపాయం కుదరలేదు. నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి సెల్వకుమార్ వేరే యువకుడితో కుమార్తె రాణి పెళ్లి నిశ్చయం చేశాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఆ వ్యక్తితో కుమార్తె రాణి వివాహం చేసిన సెల్వకుమార్ హమ్మయ్యా నా కుమార్తె పెళ్లి జరిగిపోయింది అంటూ ఊపిరిపీల్చుకున్నాడు.

మాజీ ప్రియుడు వేటగాడు
తనను మోసం చేసిన రాణి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని ఇప్పుడు చక్కగా కాపురం చేసుకుంటుందని, నేను అన్యాయం అయిపోయానని వీరాస్వామి రగిలిపోయాడు. మాజీ ప్రియురాలు రాణి కాపురం ఉంటున్న ప్రాంతాన్ని వీరాస్వామి గుర్తించాడు. రాణి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ఆమె ఇంటిలోకి ఎంట్రీ ఇస్తున్న వీరాస్వామి తన కోరిక తీర్చాలని మాజీ ప్రియురాలు రాణిని టార్చర్ పెట్టాడు.

లైంగిక దాడి... రాత్రి ఫోన్లతో టార్చర్
భర్త లేని సమయంలో రాణి ఇంటికి వెలుతున్న వీరస్వామి ఆమెపై లైంగికదాడి చెయ్యడం మొదలుపెట్టాడు. రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు రాణికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మాజీ ప్రియుడు వీరాస్వామి వేధింపులు ఎక్కువ కావడంతో రాణి ఆమె తండ్రి సెల్వకుమార్ కు విషయం చెప్పింది. వీరాస్వామి వేధింపుల నుంచి నన్ను కాపాడాలని రాణి తండ్రి సెల్వకుమార్ ను వేడుకుంది.

రేయ్ మామా... నువ్వునన్ను ఏమీ చెయ్యలేవురా
తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్న వీరస్వామికి ఎలాగైనా బుధ్దిచెప్పాలని సెల్వకుమార్ నిర్ణయించాడు. చెట్టిపాళ్యం బస్ స్టాండ్ దగ్గర వీరాస్వామి నిలబడి ఉన్న విషయం గుర్తించిన సెల్వకుమార్ అక్కడికి వెళ్లాడు. మర్యాదగా తన కుమార్తెను వదిలేయాలని, లేదంటే నీకు తగిన బుద్దిచెబుతానని సెల్వకుమార్ వీరాస్వామిని హెచ్చరించాడు. నీకు దిక్కునచోట చెప్పుకో అంటూ వీరాస్వామి రెచ్చిపోయాడు.

స్పాట్ లో పొడిచేసిన తండ్రి
సహనం కోల్పోయిన సెల్వకుమార్ జోబులో ఉన్న కత్తి తీసుకుని వీరాస్వామి మర్మాంగం, గొంతు, మెడ, ఛాతీ ఎక్కడపడితే అక్కడ పొడిచేశాడు. తీవ్రగాయాలైన వీరాస్వామిని ఆసుపత్రికి తరలించామని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. సెల్వకుమార్ ను అరెస్టు చేసి అతన్ని కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించామని పోలీసులు తెలిపారు.