facebook: కాలేజ్ అమ్మాయిలు, మహిళల అసభ్య ఫోటోలు, గంటకు 20 ఫోన్లు, నీ రేటు ఎంత ?, వస్తావా !
చెన్నై/ చెంగల్పట్టు: అర్దరాత్రి గంటకు 20 సార్లు ఫోన్లు చెయ్యడం, అసభ్యంగా మాట్లాడటంతో పాటు నేను వస్తా... నువ్వు ఇస్తావా అంటూ నీచంగా మాట్లాడుతూ మహిళలు, కాలేజ్ అమ్మాయిలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. అంతే కాకుండా అమ్మాయిలు, వివాహిత మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ ప్రారంభించి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. లాక్ డౌన్ సందర్బంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మద్య ఉంటున్న మహిళలు, కాలేజ్ అమ్మాయిలకు టార్చర్ ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేశారు.
Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !
కాలేజ్ అమ్మాయికి నరకం
చెన్నై సిటీలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తాండవం చేస్తున్న సందర్బంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా చెన్నై సిటీలోని అంబత్తూరులోని ఒరగడమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కాలేజ్ అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నది. అర్దరాత్రి గుర్తు తెలియన వ్యక్తులు ఫోన్లు చేసి నీ రేటు ఎంత ? రాత్రికి ఎంత ? గంటకు ఎంత అంటూ చాలా నీచంగా మాట్లాడుతూ ఆమెకు నరకం చూపించారు.
వ్యభిచారులు అంటూ ఫేస్ బుక్ లో ఫోన్ నెంబర్లు
ఒరగడమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అమ్మాయిల ఫోటోలతో పాటు ఫోన్ నెంబర్ పెట్టిన నిందితులు ఆమె వ్యభిచారం చేస్తోందని తప్పుడు సమాచారం నమోదు చేశారు. ఇలా ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలో పోస్టు ఆమె ఫోటోలు, ఫోన్ నెంబర్లు పెట్టడంతో ఎవ్వరు పడితే వాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు రోజుకు 100కు పైగా ఫోన్లు చెయ్యడంతో మానసికంగా ఆమె చాలా కుంగిపోయింది.
మహిళలకు అదే టార్చర్
లాక్ డౌన్ కారణంగా ప్రైవేట్ కంపెనీలు మూసివేయడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కొందరు మహిళలకు ఇలాంటి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వారికి ఫోన్లు చెయ్యడం, ఇవే మా ఫోటోలు, మీకు ఓకే అంటే ఎప్పుడు, ఎక్కడికి రావాలో ? మీరు చెప్పండి అంటూ ఫోన్లు చేస్తున్న కామాంధులు చాలా నీచంగా మాట్లాడుతున్నారని వెలుగు చూసింది.
ఫేస్ బుక్ లో ఫోటోలు పెట్టింది ఎవరు ?
కొందరు మహిళలు ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలతో కలిసి ఉంటున్న సమయంలో ఇలాంటి ఫోన్ కాల్స్ ఎక్కువ అయ్యాయి. కాలేజ్ అమ్మాయిలు, పలువురు వివాహిత మహిళలకు ఇలాంటి ఇబ్బందికరమైన ఫోన్లు రావడంతో చెన్నై సిటీ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫేస్ బుక్ లో కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లు ఎవరు పెట్టారు ? అంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
Recommended Video
మేడమ్ జయలక్ష్మి చేతికి చిక్కితే ?
కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళలు నేరుగా చెన్నై వెస్ట్ రీజనల్ జాయింట్ కమిషనర్ కు ఫిర్యాదులు చెయ్యడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. చెన్నై సిటీ నేరవిభాగం డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి సోషల్ మీడియా నేరగాళ్ల కోసం గాలిస్తున్నారు. కామాంధులు, సోషల్ మీడియా నేరగాళ్లు మేడమ్ జయలక్ష్మి చేతికి చిక్కితే కొడుకుల నరాలు తెగిపోవడం గ్యారెంటీ అని ఓ పోలీసు అధికారి అంటున్నారు. ఫేస్ బుక్ లో కాలేజ్ అమ్మాయిలు, వివాహిత మహిళల అసభ్య ఫోటోలు, ఫోన్ నెంబర్లు పెట్టి అసభ్యంగా కామెంట్లు చేసిన వారికోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు.