• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Family issue:భర్త గజని, భార్యకు కోరికలు ఎక్కువ, హాలీవుడ్ స్కెచ్:అత్తామామ, భర్తను కాల్చి చంపిన భార్య!

|

చెన్నై/ ముంబాయి/ పూణే: మొగుడు గజని టైపు, పైగా కొంచెం మెంటల్. ఎర్రగా, బుర్రగా, లావుగా, పొడవుగా ఉన్న భార్యకు కోరికలు ఎక్కువ. 14 ఏళ్లు భర్తతో కాపురం చేసిన భార్య అతని ప్రవర్తనతో విసిగిపోయింది. తన సంతోషాలకు భర్త పనికిరాడని డిసైడ్ అయిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తాను, తన పిల్లలు బతకడానికి రూ. 5 కోట్లతో పాటు చెన్నై, రాజస్థాన్ లోని ఆస్తులు భాగం పెట్టాలని భార్య కోర్టుకు వెళ్లింది.

కోట్ల రూపాయల ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న భర్త, అతని తల్లిదండ్రులు కోడలికి ఆస్తులు ఇవ్వడానికి నిరాకరించారు. అంతే కొందరిని వెంట వేసుకుని భర్త ఇంట్లో కోడలు అడుగు పెట్టింది. మాటామాటా పెరిగిపోవడంతో భర్త, అత్తమామలను కుర్చీలో కట్టేసిన కోడలు రివాల్వర్ తీసుకుని ముగ్గురి నుదుటి మీద హాలీవుడ్ సినిమా టైపులో కాల్చి చంపేసింది.

illegal affair: వయ్యారాల వదిన భర్త విదేశాల్లో, బెడ్ రూమ్ లో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు!illegal affair: వయ్యారాల వదిన భర్త విదేశాల్లో, బెడ్ రూమ్ లో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు!

కోటీశ్వరులు

కోటీశ్వరులు

రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ (74), ఆయన భార్య పుష్పాబాయ్ (70) దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై చేరుకుని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ (40), పింక్ (36) అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపనీ నిర్వహిస్తున్నారు. దలీల్ చంద్ కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నారు. రాజస్థాన్ లో, చెన్నైలో దలీల్ చంద్, ఆయన కొడుకు సీతల్ కు కోట్ట రూపాయల ఆస్తులు ఉన్నాయి.

సీతల్ గజని

సీతల్ గజని

దలీల్ చంద్ కు కొడుకు సీతల్ తో పాటు పింక్ (36) అనే కుమార్తె ఉంది. వివాహం చేసుకున్న పింక్ చెన్నైలోనే వేరే ప్రాంతంలో భర్తతో కలిసి నివాసం ఉంటున్నది. పింక్ భర్త కూడా పేరు పొందిన వ్యాపారవేత్త. సీతల్ కు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారి బంధువులు పిల్లను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి అందరూ వెనకడుగు వేశారు. చెప్పాలంటే సీతల్ గజని టైపు. చాలా విషయాలు మరిచిపోవడంతో, కొంచెం మెంటల్ గా ప్రవర్తించడం చేస్తున్నాడని సమాచారం.

పూణే జయమాల అదుర్స్

పూణే జయమాల అదుర్స్

రాజస్థాన్ లోని బంధువులు ఎవ్వరూ తన కొడుకు సీతల్ కు పిల్లను ఇచ్చి పెళ్లి చెయ్యకపోవడంతో దలీల్ చంద్ మహారాష్ట్రలోని పూణేకి చెందిన జయమాల (36) అనే మహిళను చూసి పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. చూడటానికి ఎర్రగా, బుర్రగా, బలంగా ఉన్న జయమాలను పెళ్లి చేసుకుంటానని సీతల్ కూడా ఎగిరి గంతేయ్యడంతో వారి పెళ్లి 14 సంవత్సరాల క్రితం జరిగింది. సీతల్ ఆస్తులు, అంతస్తులు చూసి జయమాల కుటుంబ సభ్యులు అప్పుడు ఏం మాట్లాడకుండా పెళ్లి జరిపించేశారు. సీతల్, జయమాల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

భర్త ఏం చెయ్యలేడు, భార్యకు కోరికలు ఎక్కువ

భర్త ఏం చెయ్యలేడు, భార్యకు కోరికలు ఎక్కువ

రెండు సంవత్సరాల నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త సీతల్ గజని కావడం, జయమాలకు కోరికలు ఎక్కువ ఉండటంతో దలీల్ చంద్, పుష్పాబాయ్ వారికి సర్దిచెప్పడం సాధ్యంకాక చేతులు ఎత్తేశారని తెలిసింది. భర్త సీతల్ తన కోరికలు తీర్చడానికి సరిపోడని డిసైడ్ అయిన జయమాల తన భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని పూణే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. తన భర్త సీతల్ తో విడాకులు తీసుకోవాలని జయమాల కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పూణేలోని పుట్టింటిలో ఉండిపోయింది. తాను తన పిల్లలు బతకడానికి రూ. 5 కోట్లు భరణం ఇవ్వాలని జయమాల కోర్టునుఆశ్రయించింది.

ఆస్తులు ఇవ్వడంలో తేడా

ఆస్తులు ఇవ్వడంలో తేడా

జయమాలకు విడాకులు ఇచ్చినా తాము రూ. 5 కోట్లు ఇవ్వలమని దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ జయమాల కుటుంబ సభ్యులకు తేల్చిచెప్పారు. రెండు నెలల క్రితం జయమాల, ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ఓ యువకుడు, అతని గ్యాంగ్ చెన్నై వెళ్లి మర్యాదగా మాకు ఆస్తిలో భాగం పెట్టాలని, లేదంటే మిమ్మల్ని లేపేస్తామని బెదిరించారు. అప్పట్లో దలీల్ చంద్, అతని కుమారుడు సీతల్ చెన్నైలోని ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చెయ్యడంతో కోడలు జయమాలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైయ్యింది. అప్పటి నుంచి సీతల్, జయమాల దంపతుల మద్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఒకే సారి మూడు హత్యలు

ఒకే సారి మూడు హత్యలు

గురువారం దలీల్ చంద్ భార్య పుష్పాబాయ్ చెన్నైలోని నివాసం ఉంటున్న కుమార్తె పింక్ ఇంటికి వస్తానని ముందుగానే సమాచారం ఇచ్చింది. రాత్రి 7. 30 గంటలు అయినా తల్లి పుష్పాబాయ్ ఇంటికి రాకపోవడంతో కుమార్తె పింక్ వారికి ఇంటికి ఫోన్ చేసింది. ఫోన్ ఎవ్వరూ రిసీవ్ చేసుకోకపోవడం, తండ్రి దలీల్ చంద్, సోదరుడు సీతల్ ఫైనాన్స్ ఆఫీసులో లేకపోవడంతో పింక్ కు అనుమానం వచ్చి నేరుగా ఎలిఫెంట్ రోడ్డు సమీపంలోని వారి అపార్ట్ మెంట్ లోకి వెళ్లింది. అపార్ట్ మెంట్ లోని హాల్ లో తండ్రి దలీల్ చంద్, తల్లి పుష్పాబాయ్, సోదరుడు సీతల్ రక్తపు మడుగులో శవాలై కనిపించడంతో షాక్ కు గురైన పింక్ వెంటనే ఎలిఫెంట్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి జరిగిన దారుణం సంఘటన చెప్పింది.

  Jagan assures AP Jawan Praveen Kumar Reddy family Rs 50L aid | Oneindia Telugu
  హాలీవుడ్ సినిమా లెవల్లో చంపేసిన కోడలు

  హాలీవుడ్ సినిమా లెవల్లో చంపేసిన కోడలు

  పోలీసులు దలీల్ చంద్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. దలీల్ చంద్ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కోడలు జయమాల, అతని బాబాయ్, మామ, మరో ముగ్గురు యువకులు కలిసి ఇంటికి వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆస్తి కోసం చాలా సేపు గొడవ పడిన జయమాల తరువాత తన వెంట వచ్చిన వారి సహాయంతో భర్త సీతల్, మామ దలీల్ చంద్, అత్త పుష్పాబాయ్ ను కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తీసుకుని వారి నుదిటి మీద కాల్చి చంపేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసులు గుర్తించారు.

  జయమాలతో పాటు ఆమె వెంట వచ్చి ఒకే కుటుంబంలో మూడు హత్యలు చేసిన విషయం స్పష్టంగా గుర్తించిన పోలీసులు వారు చెన్నై దాటి పారిపోకుండా నాకాబంధీ ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నారు. ఆస్తి కోసం ఒకే కుటుంబంలో భర్త, అత్తమామలను కోడలు చంపేసిన సంఘటన చెన్నై సిటీలో కలకలం రేపింది.

  English summary
  Family issue: Chennai 3 persons shot dead due to family issue, Iinvestigation is going on it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X