• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Family killer: మెంటల్ మొగుడు, జల్సాల జయమాల, రెండు నెలలకు మరో వికెట్, త్రిబుల్ మర్డర్ మిస్టరీ !

|

చెన్నై/ముంబాయి/ జైపూర్: కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా మెంటల్ మొగుడితో కాపురం చెయ్యలేక, బయట ఎంజాయ్ చెయ్యలేక భార్య విసిగిపోయింది. పనిలోపనిగా తన మొగుడు పనికిరాడని డిసైడ్ అయ్యి లగ్జరీ లైఫ్ గడపడానికి తన భర్త, అత్తమామలను తాను చంపేయాలని డిసైడ్ అయ్యానని కోడలు అంగీకరించింది. తన సొంత సోదరుడు లాయర్ కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందని ముగ్గురి హత్యకు స్కెచ్ వేశామని కోడలు అంగీకరించింది. భర్త, అత్తమామలను హత్య చెయ్యడానికి ఉపయోగించిన రివాల్వర్ ఓ రిటైడ్ ఆర్మీ అధికారిది కావడంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. బిగ్ షాట్ ఫ్యామిలీలో రెండు నిమిషాల్లో ముగ్గురిని చంపించిన జల్సాల జయమాల, ఆమె సోదరుడైన లాయర్ కు రివాల్వర్ విక్రయించిన మరో వ్యక్తి రెండు నెలల తరువాత ఇప్పుడు పోలీసులకు చిక్కిపోవడంతో అరెస్టు సంఖ్య మళ్లీ పెరిగిపోయింది.

Criminal Wife:ఐశ్వర్యకు టెక్కు ఎక్కవే, మామ, మొగుడి దెబ్బకు మైండ్ బ్లాక్, కోట్ల ఆస్తి కోసం పాడుపని !

ఒకేసారి మూడు వికెట్లు

ఒకేసారి మూడు వికెట్లు

రాజస్థాన్ కు చెందిన దలీల్ చంద్ (74), ఆయన భార్య పుష్పాబాయ్ (70) దంపతులు 40 ఏళ్ల క్రితం చెన్నై సిటీ చేరుకున్నారు. చెన్నైలోని ఎలిఫెంట్ గేట్ సమీపంలోని వినాయక మిస్రీ స్ట్రీట్ లోని ఆపార్ట్ మెంట్ లో దలీల్ చంద్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. దలీల్ చంద్ కు కుమారుడు సీతల్ కుమార్ (40), పింక్ (36) అనే కుమార్తె ఉన్నారు. దలీల్ చంద్, అతని కొడుకు సీతల్ కలిసి చెన్నైలోని షావుకారు పేటలో ఫైనాన్స్ కంపనీ నిర్వహిస్తున్నారు. గత నవంబర్ నెల 11వ తేదీన రాత్రి చెన్నైలో వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే దలీల్ చంద్, పుష్పాబాయ్, సీతల్ కుమార్ దారుణ హత్యకు గురైనారు.

 క్రిమినల్ కోడలు స్కెచ్

క్రిమినల్ కోడలు స్కెచ్

ఫైనాన్సియర్ దలీల్ చంద్ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. కోడలు జయమాల, ఆమె సోదరుడు కైలాష్, అతని బాబాయ్, మామ, మరో ముగ్గురు యువకులు కలిసి ఇంటికి వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆస్తి కోసం చాలా సేపు గొడవ పడిన జయమాల తరువాత తన వెంట వచ్చిన వారి సహాయంతో భర్త సీతల్, మామ దలీల్ చంద్, అత్త పుష్పాబాయ్ ను కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తీసుకుని వారి నుదిటి మీద కాల్చి చంపేసిన విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

లగ్జరీ హోటల్ లో జల్సా

లగ్జరీ హోటల్ లో జల్సా

చెన్నై పోలీసులు పూణే వెళ్లి కోడలు జయమాలతో పాటు మూడు హత్యలు చెయ్యడానికి ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే జయమాల, ఆమె సోదరులు విలాస్, రాజీవ్ షిండే పారిపోయారని గుర్తించారు. ఇదే హత్యకేసులో మొదట జయమాల మరో సోదరుడు కైలాష్ ను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత జయమాల మొబైల్ ఫోన్ కు కైలాష్ తో ఫోన్ చేయించారు. ఆగ్రాలోని ఓ హోటల్ లో తలదాచుకున్న జయమాల, ఆమె సోదరుడు విలాస్, రాజీవ్ షిండేలను పోలీసులు నవంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు.

లాయర్ చెల్లెలి క్రిమినల్ మైండ్

లాయర్ చెల్లెలి క్రిమినల్ మైండ్

జయమాల సోదరుడు విలాస్ న్యాయవాది (లాయర్ ) కావడంతో భర్త, అత్తమామలను హత్య చేసినా కేసు నుంచి సులభంగా తప్పించుకోవడానికి అవకాశం ఉందని వీళ్లు పక్కా స్కెచ్ వేశారని పోలీసులు అంటున్నారు. తన సోదరుడు విలాస్ సహకారంతోనే తన భర్త సీతల్ కుమార్, తన అత్తమామలను హత్య చెయ్యాలని తాను డిసైడ్ అయ్యానని జయమాల అంగీకరించింది.

మెంటల్ మొగుడు..... మసాలా పెళ్లాం

మెంటల్ మొగుడు..... మసాలా పెళ్లాం

తాను లగ్జరీ లైఫ్ గడపాలని ముందు నుంచి అనుకున్నాను. అందుకు తన అత్తమామలు అడ్డుపడ్డారు, అందుకే సహనం కోల్పోయి ఆ ముగ్గురిని చంపేశామని జయమాల పోలీసుల విచారణలో అంగీకరించింది. నా మొగుడు మెంటలోడు, నాకు కోరికలు ఎక్కువ, ఎంతకాలం అయినా నాకు ఇంట్లో ఫ్రీడమ్ చిక్కలేదు, నా భర్త చెప్పినమాట వినలేదు, అత్తమామలు నా జల్సాలకు అడ్డుపడుతున్నారు. అందుకే పక్కాప్లాన్ ప్రకారం చంపేశానని జల్సాల జయమాల ఇప్పటికే పోలీసుల విచారణలో అంగీకరించింది.

 రిటైడ్ మిలటరీ ఆఫీసర్ కు మస్కా

రిటైడ్ మిలటరీ ఆఫీసర్ కు మస్కా

భర్త, అత్తమామలను హత్య చెయ్యడానికి జయమాల అండ్ కో రెండు రివాల్వర్లు ఉపయోగించారని పోలీసులు గుర్తించారు. ఓ రివాల్వర్ జైపూర్ కు చెందిన రిటైడ్ మిలటరి అధికారి రాజీవ్ దూబేది అని గుర్తించారు. జయమాలకు రివాల్వర్ ఇచ్చిన మాజీ రిటైడ్ అధికారి రాజీవ్ దూబేని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ దూబే రివాల్వర్ తోనే దలీల్ చంద్ కుటుంబ సభ్యులను కాల్చిచంపారని, మరో రివాల్వర్ మూడు హత్యలకు ఉపయోగించారని చెన్నై పోలీసులు గుర్తించారు.

రెండు నెలలకు కిలాడి చిక్కాడు

రెండు నెలలకు కిలాడి చిక్కాడు

జల్సాల జయమాల సోదరుడు కైలాష్ లాయర్. తాను న్యాయవాది కావడంతో తనను చంపేస్తామని చాలా మంది బెదిరిస్తున్నారని, ఆత్మరక్షణ కోసం తనకు రివాల్వర్ కావాలని కైలాష్ రాజస్థాన్ కు చెందిన చంద్రదీప్ శర్మా అనే వ్యక్తికి చెప్పాడు. చంద్రదీప్ శర్మా రూ. 25 వేలకు రివాల్వర్ కొనుగోలు చేసి దానిని లాయర్ కైలాష్ కు రూ. 50 వేలకు అమ్మేశాడు. చంద్రదీప్ శర్మా దగ్గర తీసుకున్న రివాల్వర్ తో దలీల్ చంద్ కుటుంబ సభ్యులను చంపేశారు. రెండు నెలల పాటు రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో తలదాచుకున్న చంద్రదీప్ శర్మా 2021 జనవరి 11వ తేదీన పోలీసులకు చిక్కిపోయాడు. చెన్నై త్రిబుల్ మర్డర్ కేసులో జల్సాల జయమాల, ఆమె సోదరులు కైలాష్, విలాస్, వారి స్నేహితులు రవీంద్రనాథ్ కర్, విజయ్ ఉత్తమ్, రాజు షిండే, రిటైడ్ ఆర్మీ ఆఫీసర్ రాజీవ్ దూబే తో పాటు ఇప్పుడు చంద్రదీప్ శర్మాలు అరెస్టు అయ్యి చెన్నై సెంట్రల్ జైల్లో ఉన్నారు.

English summary
Family killer: Chennai Sowkarpet murder case issue, another one arrested by Chennai Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X