చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

55 అడుగుల బావిలో పడిన ఆడఏనుగు .. 14 గంటల పాటు రెస్క్యూ చేసి కాపాడిన అధికారులు

|
Google Oneindia TeluguNews

తమిళ నాడులోని ధర్మపురి జిల్లా లోని పంచ పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న యెల్లికుందనూర్ వద్ద గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సుమారు మూడున్నర టన్నుల బరువున్న, సుమారు 25 సంవత్సరాల వయసున్న ఆడ ఏనుగు 55 అడుగుల లోతు బావిలో పడిపోయింది. ఏనుగును రక్షించటానికి అటవీ అధికారులు రంగంలోకి దిగి 14 గంటల పాటు సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఏనుగును రక్షించారు .

Recommended Video

హమ్మయ్యా..! బావిలో పడిన ఏనుగును ఎట్టకేలకు ప్రాణాలతో రక్షించారు
బావిలో పడిన ఏనుగును కాపాడేందుకు అధికారుల యత్నం

బావిలో పడిన ఏనుగును కాపాడేందుకు అధికారుల యత్నం

ఓ ఆడ ఏనుగు 55 అడుగుల బావిలో పడిపోయి బయటకు రాలేక అరుస్తుంది . గమనించిన పొలం యజమాని అధికారులకు సమాచారం ఇవ్వటంతో ఏనుగును రక్షించటానికి రంగంలోకి దిగారు. బావిలో నీరు లేకపోవడంతో,ఆడ ఏనుగు ను రక్షించడానికి అధికారులు ప్రయత్నం చేశారు. సుమారు 14 గంటలపాటు ఏనుగు ని కాపాడడానికి ప్రయత్నించిన అధికారులు నిన్న అర్ధరాత్రి సమయానికి ఏనుగును బావి నుండి బయటకు తీసి రక్షించగలిగారు.

ఏనుగుకు ఆహారం ఇచ్చి , గాయాలేమీ కాలేదని నిర్ధారించుకున్నాకే రెస్క్యూ ఆపరేషన్

ఏనుగుకు ఆహారం ఇచ్చి , గాయాలేమీ కాలేదని నిర్ధారించుకున్నాకే రెస్క్యూ ఆపరేషన్


ధర్మపురి లోని పాలకోడ్ సమీపంలో వెంకటాచలం అనే యజమానికి సంబంధించిన వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో పడిపోయిన ఏనుగు ను బయటకు తీసుకురావడానికి నానా కష్టాలు పడ్డారు అధికారులు.

ఈ సంఘటనకు సంబంధించి జిల్లా అటవీ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ మొదట ఏనుగుని కాపాడటానికి ఒక రెస్క్యూ టీం దాని ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి బావిలోకి దిగిందని, దానికి ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఏనుగు ఆరోగ్యంగా ఉండటంతో , దానికి కావలసిన నీటిని ఆహారాన్ని అందించి, ఆ తరువాత దానికి మత్తిచ్చి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు.

క్రిష్ణగిరి, ధర్మపురి అటవీ అధికారుల పర్యవేక్షణలో ఏనుగును కాపాడే ప్రయత్నం

క్రిష్ణగిరి, ధర్మపురి అటవీ అధికారుల పర్యవేక్షణలో ఏనుగును కాపాడే ప్రయత్నం

ఆడ ఏనుగు బావిలో పడిపోయిన ఘటన నేపథ్యంలో సమీప ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి చేరుకుని అధికారుల రెస్క్యూ ఆపరేషన్ కు తమ వంతు సహకారం అందించారు .గత కొన్ని రోజులుగా ఈ ఏనుగు మరో రెండు ఏనుగుల తో కలిసి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. క్రిష్ణగిరి కి చెందిన జిల్లా అధిక అటవీ అధికారులతో పాటుగా, ధర్మపురికి చెందిన అటవీ అధికారులు కూడా ఏనుగును బయటకు తీయడానికి నిర్వహించిన సహాయక చర్యలను పర్యవేక్షించారు.

జేసీబీలు , క్రేన్ల సాయంతో ఏనుగును రక్షించడం కోసం పనిచేసిన యాభై మంది

జేసీబీలు , క్రేన్ల సాయంతో ఏనుగును రక్షించడం కోసం పనిచేసిన యాభై మంది

మొత్తం ఏనుగును రక్షించడం కోసం యాభై మంది అధికారులు రెస్క్యూ లో పాల్గొన్నారు.

బావి 55 అడుగుల లోతులో ఉండటం తో బావి నుండి ఏనుగులు బయటకు తీయడానికి బాగా కష్టపడాల్సి వచ్చింది. మూడున్నర టన్నుల బరువు ఉండటంతో రెండు జెసిబి యంత్రాలను, రెండు ట్రక్కులను, రెండు క్రేన్ లను ఏనుగును బయటకు తియ్యటానికి వినియోగించినట్లుగా తెలుస్తుంది. ఏనుగుకు మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన తరువాత, అది మత్తు లోకి జారుకున్నాక అటవీ అధికారులు క్రేన్ల సహాయంతో బయటకు తీశారు.అధికారులు రక్షించిన ఆడ ఏనుగును హోసూర్ అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లుగా పేర్కొన్నారు.

English summary
A female elephant that fell into a well near Palacode in Dharmapuri on Thursday was rescued late in the night, after a nearly 14-hour struggle.According to officials from the Forest Department, the elephant, aged about 25 years, fell into a farm well owned by Venkatachalam in Ellikundanoor around 4.30 a.m. District Forest Officers S. Prabhu from Krishnagiri and Rajkumar from Dharmapuri oversaw the rescue operations and over 50 officials from the Forest Department, the Fire and Rescue Services and the police were involved in the process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X