చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

First night: పీహెచ్ డీ చదివాడు, శోభనం రోజు భార్య, అత్త శీలంపై రీసెర్చ్ చేశాడు, వారానికే, శాడిస్టు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ వేలూరు/ కాట్పాడి: యువతి ఉన్నత విద్యాభ్యాసం చేసింది. యువకుడు పీహెచ్ డీ చేశాడు. వారం రోజుల క్రితం పెళ్లి జరిగింది. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని, ఇద్దరూ మంచి చదవులు చదువుకున్నారని అందరూ సంబరపడిపోయారు. పెళ్లి కొడుకు ప్రముఖ కాలేజ్ లో లెక్సరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బాత్ రూమ్ లో స్నానం చెయ్యడానికి వెళ్లిన నవవధువు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి జరిగిన వారానికే దారుణం జరిగిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆత్మహత్య చేసుకున్న పెళ్లి కూతురి బెడ్ రూమ్ లో ఓ డెత్ నోట్ చిక్కింది. పెళ్లి రోజు బెడ్ రూమ్ లో ఫస్ట్ నైట్ శోభనంకు బదులుగా ఏం జరిగిందో ? అనే విషయం నవవధువు పూసగచ్చినట్లు డెత్ నోట్ లో రాసిపెట్టింది. పీహెచ్ డీ చేసిన శాడిస్టు భర్త భార్య అందం, ఆమె తల్లి అందం, వారి శీలం గురించి రీచెర్చ్ చేశాడని వెలుగు చూసింది.

Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!

చంద్రలేఖ ఫ్యామిలీ

చంద్రలేఖ ఫ్యామిలీ

తమిళనాడులోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ బార్డర్)లోని ఊజూర్ సమీపంలోని గోవిందరెడ్డి ఎస్టేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న చంద్రలేఖ అనే యువతి కుటుంబ సభ్యులకు మంచి పేరు ఉంది. చంద్రలేఖ తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేశారు. చంద్రలేఖను బాగా చదివించిన ఆమె కుటుంబ సభ్యులు బాగా చదువుకున్న వ్యక్తితో వివాహం చెయ్యాలని చాల రోజుల నుంచి ప్రయత్నాలు చేశారు.

పీహెచ్ డీ చేసిన పెళ్లి కొడుకు

పీహెచ్ డీ చేసిన పెళ్లి కొడుకు


తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన బాలాజీ పీహెచ్ డీ చేశాడు. తమిళనాడులోని సేలంలోని ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో బాలాజీ లెక్సరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బాలాజీ, చంద్రలేఖ కుటుంబ సభ్యులు ఇద్దరికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. అనుకున్నట్లు బాలాజీ, చంద్రలేఖ నిశ్చితార్థం జరిగిపోయింది. మంచి సంబంధం కుదిరిందని, బాలాజీ బాగా చదువుకున్నాడని, చంద్రలేఖను బాగా చూసుకుంటాడని ఆమె కుటుంబ సభ్యులు మురిసిపోయారు.

పెళ్లైన వారం రోజులకే ఆత్మహత్య

పెళ్లైన వారం రోజులకే ఆత్మహత్య

ఆగస్టు 23వ తేదీన చంద్రలేఖ, బాలాజీల వివాహం జరిగిపోయింది. బాలాజీ, చంద్రలేఖ దంపతులు చూడముచ్చటగా ఉన్నారని, ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ పుట్టే పిల్లతో జీవితాంతం చాలసంతోషంగా ఉంటారని చంద్రలేఖ కుటుంబ సభ్యులు సంబరపడిపోయారు. ఆగస్టు 30వ తేదీన బాత్ రూమ్ లో స్నానం చెయ్యడానికి వెళ్లిన చంద్రలేఖ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు మంటలు అదుపుచేసి చంద్రలేఖను రక్షించడానికి విఫలయత్నం చేశారు. అయితే తీవ్రగాయాలైన చంద్రలేఖ మంటల్లో కాలిబూడిద అయ్యింది.

 బెడ్ రూమ్ లో చంద్రలేఖ డెత్ నోట్

బెడ్ రూమ్ లో చంద్రలేఖ డెత్ నోట్


పెళ్లి జరిగిన వారం రోజులకే కన్నకూతురు చంద్రలేఖ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. తమ అల్లుడు బాలాజీ కారణంగా చంద్రలేఖ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో చంద్రలేఖ బెడ్ రూమ్ లో ఆమె రాసిన లేఖ బయటపడింది. డెత్ నోట్ చదివిన పోలీసులు, చంద్రలేఖ కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

 ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో ఏం జరిగిందంటే ?

ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో ఏం జరిగిందంటే ?


పెళ్లి జరిగిన రోజే చంద్రలేఖ, బాలాజీ ఫస్ట్ నైట్ కు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో శోభనం జరగలేదని, పెళ్లి కూతురు చంద్రలేఖ, ఆమె తల్లిపై పెళ్లి కొడుకు బాలాజీ రీసెర్చ్ చేశాడని వెలుగు చూసింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, మీ అమ్మ (అత్త) ఇంకా చాలా అందంగా ఉందని, మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు ? అంటూ బాలాజీ ప్రశ్నించాడని చంద్రలేఖ డెత్ నోట్ లో వివరించింది.

భార్య శీలంపై రీసెర్చ్ చేసిన భర్త

భార్య శీలంపై రీసెర్చ్ చేసిన భర్త


నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, కాలేజ్ లో చదివే సమయంలో ఎవరినైనా ప్రేమించావా ? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ?, వారితో నువ్వు ఎప్పుడైనా ఎంజాయ్ చేశావా ? అసలు నువ్వు పవిత్రంగా ఉన్నావా ?, నువ్వు కన్యవేనా ? నీ లవర్ ఇప్పుడు వస్తే నన్ను వదిలేసి నువ్వు అతనితో నువ్వు పారిపోతావా ?, మీ అమ్మకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ? అంటూ భర్త బాలాజీ తనకు అనేక ప్రశ్నలు వేసి చిత్రహింసలు పెట్టాడని చంద్రలేఖ డెత్ నోట్ లో పూసగుచ్చినట్లు మొత్తం వివరించింది. ఫస్ట్ నైట్ తనకు శోభనం జరగలేదని, రాత్రంతా ఇలాంటి ప్రశ్నలు వేసి తన మీద, తన తల్లి శీలం మీద అనుమానంతో సూటిపోటి మాటలతో బాలాజీ తనకు నరకం చూపించాడని చంద్రలేఖ డెత్ నోట్ లో వివరించింది.

జీవితాంతం కాపురం చెయ్యలేను

జీవితాంతం కాపురం చెయ్యలేను

ఫస్ట్ నైట్ తనకు నరకం చూపించిన తన భర్త బాలాజీతో తాను జీవితాంతం సంతోషంగా కాపురం చెయ్యలేనని, తన తల్లిమీద, చెల్లెళ్ల మీద అతని కన్ను పడిందని, నా జీవితం ఇలా నాశనం అయ్యిందని, కనీసం తన చెల్లెళ్లకు అయినా మంచిచోట అన్ని వివరాలు తెలుసుకుని పెళ్లి చెయ్యాలని, తన భర్త బాలాజీకి అనుమానపు పిచ్చి ముదిరిపోయిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చంద్రలేఖ డెత్ నోట్ లో వివరించింది, చంద్రలేఖ డెత్ నోట్ లో రాసిన సమాచారం మేరకు శాడిస్టు భర్త బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

రెండు రోజులకే పంచాయితి

రెండు రోజులకే పంచాయితి

చంద్రలేఖ, బాలాజీల పెళ్లి జరిగిన రెండురోజులకే వాళ్ల ఇంటిలో పంచాయితీ జరిగిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చంద్రలేఖతో పాటు చదువుకున్న ఓ యువకుడు వారి ఇంటికి వెళ్లాడు. తాను పెళ్లికి రాలేకపోయానని, మీరిద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని, పెళ్లి జరిగిన తరువాత చిన్నచిన్న గొడవలు వస్తాయని, ఇద్దరు సర్దుకుపోవాలని చంద్రలేఖ స్నేహితుడు నవదంపతులు (బాలాజీ, చంద్రలేఖ)కు చెప్పివెళ్లాడని వెలుగు చూసింది. వాడు ఎందుకు వచ్చాడు ? నాకే బుద్దిమాటలు చెబుతాడా ? వాడు నీ బాయ్ ఫ్రెండ్ కదా ?, వాడితో తిరిగావా ? ఎంజాయ్ చేశావా ? అంటూ బాలాజీ పెద్ద పంచాయితీ పెట్టాడని చంద్రలేఖ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తం మీద శాడిస్టు భర్త బాలాజీకి పోలీసులు బెండ్ తీస్తున్నారు.

English summary
First night: Young girl committed suicide near Vellore in Tamil Nadu after husbands suspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X