friends: మీ అమ్మ సూపర్ ఫిగర్ రా, కత్తిలా ఉంటుంది, భలే ఎంజాయ్ చేశా, క్వాటర్ బాటిల్ తో రెండు !
చెన్నై/మెరినాబీచ్: యువకులు ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉండటంతో స్నేహితులు అయ్యారు. ప్రతిరోజూ పనిపూర్తి అయిన తరువాత బీచ్ లోకి వెళ్లి మద్యం సేవిస్తున్నారు. అమ్మాయిలు, ఆంటీల విషయాలు మాట్లాడుతూ మద్యం సేవిస్తూ ఇంతకాలం ఎంజాయ్ చేశారు. అయితే మద్యం మత్తులో ఓ యువకుడు మీ అమ్మ భలే ఉంటుందిరా, సూపర్ ఫిగర్ రా, నాకు చాలా క్లోజ్ అని, భలే ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేస్తే అలాంటి ఫిగర్ తోనే ఎంజాయ్ చెయ్యాలని, నువ్వు నాకు కొడుకు లాంటి వాడు అని స్నేహితుడితో అన్నాడు. రెండు రోజులు ఇదే విషయంలో చర్చలు, గొడవలు జరిగాయి. ఎంజాయ్ చెయ్యడానికి తీసుకెళ్లిన క్వాటర్ బాటిల్ పగలగొట్టిన యువకుడు మా అమ్మనే ఇలా అంటావారా అంటూ స్నేహితుడి రెండు కళ్లు పీకేసి ఏం చెయ్యాలో అదే చెయ్యడంతో అతని పరిస్థితి విషమంగా మారిపోయింది.
Lover friend: కిలాడీ లేడీకి వన్+ వన్ స్కీమ్, ఢబుల్ ఢమాకా, సంక్రాంతి ఆఫర్ తో మొత్తం చెక్కేసి మర్డర్ !

బెస్ట్ ఫ్రెండ్స్
తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలోని నీలితనల్లూరు సమీపంలోని బాలాపతిపురంకు చెందిన అశోక్ చక్రవర్తి (29), పెరియపాండియన్ (26) స్నేహితులు. అశోక్ చక్రవర్తి, పెరియపాండియన్ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో చిన్నప్పటి నుంచి కలిసిమెలసి తిరిగారు. అశోక్ చక్రవర్తి, పెరియపాండియన్ ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లి వస్తుంటారు.

చెన్నైలో ఉద్యోగం... జల్సాలు
అశోక్ చక్రవర్తి, పెరియపాండియన్ ఇద్దరు చెన్నై చేరుకుని ఇద్దరూ మెరీనా బీచ్ లోని వేర్వేరు ఫేమస్ టీస్టాల్ లో టీ మాస్టర్లుగా పని చేస్తున్నారు. అశోక్ చక్రవర్తి, పెరియపాండియన్ ఇద్దరూ రోజూ వెయ్యిరూపాయలకు పైగా డబ్బులు సంపాధిస్తున్నారు. రోజూ సాయంత్రం పని పూర్తి అయిన తరువాత మెరీనా బీచ్ చేరుకుని అక్కడే కుర్చుని మాట్లాడుకుంటూ మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆంటీలు, అమ్మాయిల విషయాలు
రోజూ అశోక్ చక్రవర్తి, పెరియపాండియన్ సాయంత్రం మెరీనా బీచ్ లోని రాణి కాలేజ్ ఎదురుగా బీచ్ లో ఇసుకలో కుర్చుకుని గంటలు గంటలు మద్యం సేవిస్తూ అమ్మాయిలు, ఆంటీల గురించి మాట్లాడుకుంటూ జల్సా చేస్తున్నారు. అశోక్ చక్రవర్తికి కొంచెం కామం ఎక్కువ అని తెలిసింది. మూడు రోజుల క్రితం అశోక్ చక్రవర్తికి మందు నషాలానికి ఎక్కడంతో స్నేహితుడు పెరియపాండియన్ తల్లి గురించి చెడుగా మాట్లాడాడు.

మీ అమ్మ సూపర్ ఫిగర్ రా, కత్తిలా ఉంటుందిరా.... అంతే !
మద్యం మత్తులో ఉన్న అశోక్ చక్రవర్తి నోటికి వచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను మీ అమ్మ చాలా క్లోజ్ రా, ఫిగర్ అంటే మీ అమ్మలాగా ఉండాలి, కత్తిలాగా ఉందిరా, నేను చాలా సార్లు ఎంజాయ్ చేశాను, నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, కొడుకుతో సమానం అంటూ అశోక్ చక్రవర్తి పెరియపాండియన్ తల్లి గురించి ఇష్టం వచ్చినట్లు చెడ్డచెడ్డగా మాట్లాడాడు. ఆ సమయంలో పెరియపాండియన్, అశోక్ చక్రవర్తి మద్య మాటామాటా పెరిగిపోయింది.

చంపేయాలని అనుకున్నాడు
మద్యం మత్తులో ఏదో వాగాడని పెరియపాండియన్ స్నేహితుడు అశోక్ చక్రవర్తికి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. మరుసటి రోజు అదే విధంగా పెరియపాండియన్ తల్లి గురించి అశోక్ చక్రవర్తి చెడుగా మాట్లాడాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన పెరియపాండియన్ మెరీనా బీచ్ లో తాగడానికి తీసుకెళ్లిన క్వాటర్ బాటిల్ పగలగొట్టి దానితో అశోక్ చక్రవర్తి గొంతులో పొడిచాడు.

క్వాటర్ బాటిల్ తో రెండు కళ్లు పీకేశాడు
గొంతు తెగిపోవడంతో కిందపడిన అశోక్ చక్రవర్తి కళ్లల్లో క్వాటర్ బాటిల్ తో పొడిచి రెండు కళ్లు పీకేశాడు. మా అమ్మనే ఇలా అంటావా, నిన్ను చంపేస్తా నాకొడకా అంటూ పెరియపాండియన్ రెచ్చిపోయాడు. రెండు కళ్లు బయటకు వచ్చేయడంతో అశోక్ చక్రవర్తి గట్టిగా కేకలు వెయ్యడంతో మెరీనా బీచ్ లో మద్యం సేవించడానికి వెళ్లిన కొందరు అక్కడికి పరుగు తీశారు. అశోక్ చక్రవర్తి శరీరంలో పగిలిపోయిన క్వాటర్ బాటిల్ తో ఇష్టం వచ్చినట్లు పొడిచిన పెరియపాండియన్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

కళ్లు పూర్తిగా పోయి ప్రాణాలతో ?
మెరీనా బీచ్ లోని కొందరు పెరియపాండియన్ పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అశోక్ చక్రవర్తి రెండు కళ్లు బయటకు వచ్చేయడంతో అతనికి రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అశోక్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని చెన్నైలోని మరో ఆసుపత్రికి తరలించామని, పెరియపాండియన్ ను అరెస్టు చేశామని మెరీనా బీచ్ పోలీసులు తెలిపారు. రెండు కళ్లు పూర్తిగా పోవడంతో అశోక్ చక్రవర్తి పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు అన్నారు.