• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ఆంటీ 45, లవర్ 29, ప్రియుడు చచ్చాడని సమాధి తొవ్వింది, ఫ్యామిలీ చివాట్లు పెడితే!

|

చెన్నై/ కోయంబత్తూరు: పెళ్లి జరిగి 20 ఏళ్లు అయ్యింది. భర్తతో కలిసి ఆమె 17 ఏళ్లు సంసారం చేసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తను వదిలేసిన ఆంటీకి 45 ఏళ్లు. ఎదురింటి యువడికి 29 ఏళ్లు. ఆంటీ ఆ యువకుడి వ్యామోహంలో పడిపోయింది. భర్తను వదిలేసి అతనికి దూరంగా పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటూ ప్రియుడితో కలిసి ఆంటీ ఎంజాయ్ చేస్తోంది. రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మరణించాడు. ఇంతకాలం ప్రియుడి వ్యామోహంలో బతికేసిన ఆంటీ చివరికి ప్రియుడిని పాతి పెట్టిన సమాధి దగ్గరకు వెళ్లింది. ప్రియుడి సమాధి తొవ్వి అతన్ని సమాధి లో నుంచి బయటకు తియ్యడానికి ప్రయత్నించింది. యువకుడి కుటుంబ సభ్యులు చివాట్లు పెట్టడంతో ఆంటీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

20 ఏళ్ల క్రితం పెళ్లి

20 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై) జిల్లాలోని సులూరు సమీపంలోని కన్నంపాల్యంలో నివాసం ఉంటున్న జ్ఞానజ్యోతి (45), మురుగన్ (50) అనే వ్యక్తితో 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. మురుగన్, జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మురుగన్, జ్యోతి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. బంధువులు సర్దిచెప్పడంతో కొంతకాలం మురుగన్, జ్యోతి సర్దుకుని కాపురం చేశారు.

 ఆంటీ కంట్లో పడిన ఎదురింటి కుర్రాడు

ఆంటీ కంట్లో పడిన ఎదురింటి కుర్రాడు

మూడు సంవత్సరాల క్రితం జ్యోతి, మురుగన్ దంపతులు విడిపోయారు. జ్యోతి ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. జ్యోతి ఇంటి ఎదురుగా దురైకన్ను (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మగదిక్కులేదని అప్పుడప్పుడు జ్యోతికి అవసరమైన సరుకులు తెచ్చిస్తూ ఆమె పనులు చేయిస్తూ దురైకన్ను అమెతో స్నేహం పెంచుకున్నాడు.

కుర్రాడితో ఆంటీ ఎంజాయ్

కుర్రాడితో ఆంటీ ఎంజాయ్

దురైకన్ను, జ్యోతి స్నేహం అక్రమ సంబంధానికి దారితీసింది. పెళ్లిపెటాకులు లేని దురైకన్ను ఆంటీ జ్యోతికి పూర్తిగా దాసోహం అయ్యాడు. ఇంట్లో అడిగేవాళ్లు లేకపోవడంతో జ్యోతి ఆమె ప్రియుడు దురైకన్నును ఇంటికే పిలిపించుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. జోత్యితో దురైకన్ను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషయంపై దురైకన్ను కుటుంబ సభ్యులు జ్యోతిని ఇప్పటికే రెండుమూడు సార్లు మందలించారు. నీకంటే దురైకన్ను వయసులో 17 ఏళ్లు చిన్నవాడని, అతనితో కులకడానికి నీకు సిగ్గులేదా అంటూ చివాట్లు పెట్టారు.

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి

ఇటీవల దురైకన్ను బైక్ లో వెలుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చాలా రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన దురైకన్ను చికిత్స విఫలమై మృతి చెందాడు. దురైకన్ను శవాన్ని చూడటానికి జ్యోతి వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు దురైకన్ను శవానికి కన్నంపాల్యంలోని స్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రియుడి సమాధి తొవ్విన ఆంటీ

ప్రియుడి సమాధి తొవ్విన ఆంటీ

దురైకన్ను అంత్యక్రియలు పూర్తి అయిన మరుసటి రోజు జ్యోతి స్మశానవాటికకు వెళ్లింది. తన ప్రియుడి ముఖాన్ని చూడాలని జ్యోతి సమాధిది దగ్గర కుర్చుని కేకలువేసింది. విషయం గుర్తించిన కాటికాపరి జ్యోతిని మందలించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే జ్యోతి రాత్రి వరకు అక్కడే ఉండి తరువాత సమాధి అర్దం తొవ్వేసి దురైకన్ను ముఖాన్ని చూడటానికి ప్రయత్నించింది. విషయం గుర్తించిన కాటికాపరి దురైకన్ను కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

పురుగుల మందు తాగి ఉరి వేసుకుంది

పురుగుల మందు తాగి ఉరి వేసుకుంది

దురైకన్ను కుటుంబ సభ్యులు స్మశానం దగ్గరకు చేరుకుని జ్యోతికి నాలుగు తగిలించి అక్కడి నుంచి తరిమేశారు. ప్రియుడు మరణించడం తట్టుకోలేని జ్యోతి ఇంట్లో పురుగుల మందుతాగింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన జ్యోతి తరువాత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు లేని విషయం జీర్ణించుకోలేక జ్యోతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: 45 yeas old woman committed suicide for yer lover near Coimbatore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X