Illegal affair: వదిన వగలాడి, మరిది మన్మధుడు, నేను రాంబాబు కాదు రాంబో, సెల్ఫీ తంటా !
చెన్నై/ మైలాపూర్: వదినతో అక్రమ సంబంధం పెట్టుకుని అందరిని మోసం చెయ్యడమే కాకుండా ఏదో ఘనకార్యం చేశామని ఇద్దరు కలిసి సెల్ఫీ ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో కుటుంబం పరువుపోయింది. వదిన వగలాడి మరిది మన్మధుడు అంటూ బంధువులు పేర్లు పెట్టారు. అంతే నేను రాంబాబు కాదు రాంబో అంటూ భర్త రెచ్చిపోయాడు. ఓ పక్క భార్యకు, మరో పక్క తమ్ముడికి చెప్పిచెప్పి విసిగిపోయిన అన్న ఇద్దరిని చంపేయాలని స్కెచ్ వేశాడు. పీకలదాక మద్యం మత్తులో అది వీలుకాకపోవడంతో మొదట తమ్ముడిని చంపేశాడని, ప్రాణభయంతో భార్య పరుగు తీసిందని పోలీసులు అంటున్నారు. తండ్రి జైలుకు, తల్లి పారిపోడంతో వారి ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారని వారి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు
చెన్నైలోని మైలాపూర్ లోని లాలా ఎస్టేట్ లో నివాసం ఉంటున్న పళని రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రెండో భార్య మరియాల్ (32)తో కలిసి నివాసం ఉంటున్నాడు. పళని, మరియాల్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పళని సోదరుడు సెంథిల్ కుమార్ చెన్నైలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

కలిసి వచ్చిన కాలం
పళని మద్యంకు బానిస అయ్యాడు. ఆటో డ్రైవర్ అయిన పళనికి రోజు చేతిలో డబ్బులు ఆడుతుండటంతో పీకలదాక మద్యం తాగుతున్నాడు. రాత్రి ఎప్పుడో ఇంటికి వెళ్లి ఓ మూలనపడుకుంటున్నాడు. ఓ సారి పళని అగ్నిప్రమాదంలో గాయడపటంతో అన్నను చూసుకోవడానికి సెంథిల్ కుమార్ వారి ఇంటికి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. అంతే మద్యం మత్తులో పీకలదాక నిద్రపోతున్న అన్న పళనిని చూసి అయ్యో అనకుండా అతని భార్య మరియాల్ మీద సెంథిల్ కుమార్ కన్నుపడింది.

వన్ బై టూ అంటే వద్దంటానా !
అన్న అవసరాలు తీర్చడానికి వచ్చిన మరిది సెంథిల్ కుమార్ కండలు చూసి మురిసిపోయిన మరియాల్ మంచిరోజు చూసి సరసాలకు ముహూర్తం పెట్టింది. అంతే ఆరోజు నుంచి వదిన మరియాల్, మరిది సెంథిల్ కుమార్ ఆడింది ఆట... పాడిందే పాట. ఇంట్లో ఉన్న పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపిస్తున్న మరియాల్ మరిది సెంథిల్ కుమార్ తో కలిసి బెడ్ రూమ్ లో అసలు ఆట ఆడటం మొదలుపెట్టింది.

కొంప ముంచిన సెల్ఫీ ఫోటోలు
ఏడాదిపాటు గుట్టుచప్పుడు కాకుండా వదిన మరియాల్ మరిది సెంథిల్ కుమార్ తో కలిసి ఎంజాయ్ చేసింది. అయితే సెంథిల్ కుమార్ తో కలిసి సెల్ఫీలు తీసుకున్న మరియాల్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వరసకు వదిన మరిది అయిన వీళ్ల ఫోటోలు రోజురోజుకు సోషల్ మీడియాలో ఎక్కువ అయ్యాయి. వీళ్లు వదినా మరిదా ? లేకు మొగుడు పెళ్లామా ? అంటూ అందరికి డౌట్ వచ్చింది. ఇదే సమయంలో సెంథిల్ కుమార్ భార్యకు ఎక్కడో మండిపోయి అతని అన్న పళని దగ్గరకు వెళ్లి నీ భార్య మరియాల్ ను కంట్రోల్ పెట్టుకో, ఇప్పటకే నీ మొదటి భార్య పైకి పోయింది, రెండో భార్య కూడా లేచిపోతే నీ పరువు పోతుంది అంటూ ముఖాన ఉమ్మేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

వార్నింగ్ తో జరిగే పని కాదని ఫినిష్
భార్య మరియాల్, తమ్ముడు సెంథిల్ కుమార్ వ్యవహారం తెలుసుకున్న పళని ఇద్దరికి మంచిమాటలు చెప్పిచెప్పి విసిగిపోయాడు. ఈ సమస్య వార్నింగ్ ఇస్తే తీరిపోదని ఇద్దరినీ లేపేస్తే అందరూ హ్యాపీగా ఉండచ్చు అని బావించిన పళని ఇనుప రాడ్ తో తమ్ముడు సెంథిల్ కుమార్ ను చంపేశాడని పోలీసులు అన్నారు. పోలీసుల విచారణలో హత్యకు గురైన సెంథిల్ కుమార్, అతని వదిన మరియాల్ వ్యవహారం రోజుకు ఒకటి బయటపడుతోందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద తల్లి చేసిన పాడుపనికి తండ్రి హంతకుడు కావడంతో వారి ముగ్గురు పిల్లు అనాథలు అయ్యారని వారి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.