• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: క్లోజ్ ఫ్రెండ్ భార్యకు బిస్కెట్, బెడ్ రూమ్ లో సరసాలు, ఇంటినే కాల్చేసిన భర్త !

|

చెన్నై/ వేలూరు/ అంబూరు: ఇంటికి వచ్చి వెలుతున్న ప్రాణ స్నేహితుడు తన భార్యకు బిస్కెట్ వేసి వలలో వేసుకున్నాడని తెలుసుకున్న యువకుడు ఆవేదన చెందాడు. నువ్వు చేస్తున్న పని ఏం బాగాలేదు, పద్దతి మార్చుకో అంటూ భర్త అతని భార్యకు నచ్చచెప్పాడు. కామానికి కళ్లు లేవు అంటూ భార్య బరితెగించింది. పోని తన స్నేహితుడు అయినా మాట వింటాడు అనుకుంటే అతను నీ దిక్కునచోట చెప్పుకో, నీ భార్యను వదిలిపెట్టే ప్రసక్తేలేదు అంటూ ఎదురుతిరిగాడు. అంతే బెడ్ రూమ్ లో భార్య, అతని స్నేహితుడు రొమాన్స్ సీన్స్ చూసి తట్టుకోలేని భర్త ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రాణ స్నేహితుడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!

 ఆల్ ఇన్ వన్ అభిరామి

ఆల్ ఇన్ వన్ అభిరామి

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు సమీపంలోని దేవలాపురం గ్రామపంచాయితీ పరిధిలోని రామాపురంలోని ఎట్టియమ్మాన్ వీధిలో మణికందన్, అభిరామి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికందన్ ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టు పనులు చేస్తూ భార్య అభిరామిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. తనకు తన భార్య అభిరామి ఆల్ ఇన్ వన్ అంటూ ఆమె భర్త మణికందన్ మురిసిపోయాడు.

ప్రాణ స్నేహితుడు

ప్రాణ స్నేహితుడు

రామాపురం ప్రాంతంలోనే మణికందన్ చిన్ననాటి స్నేహితుడు రాజేష్ నివాసం ఉంటున్నాడు. రాజేష్ కు భార్య శ్వేత, 9 నెలల పాప ఉంది. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న మణికందన్, రాజేష్ ప్రాణస్నేహితులు. మణికందన్, రాజేష్ కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా కొన్ని నెలల క్రితం అసలు కథ మొదలైయ్యింది.

ఫ్రెండ్ భార్యకు బిస్కేట్ వేసిన రాజేష్

ఫ్రెండ్ భార్యకు బిస్కేట్ వేసిన రాజేష్

మణికందన్ భార్య అభిరామి, రాజేష్ అంబూరులోని ప్రముఖ ప్రైవేట్ షూ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్, అభిరామి ఒకే బైక్ లో ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నారు. తన భార్య అభిరామిని ప్రతిరోజు ఉద్యోగానికి బైక్ లో పిలుచుకుని వెళ్లి వస్తున్నది తన ప్రాణస్నేహితుడు కావడంతో మణికందన్ కు చాలా కాలం ఏమాత్రం అనుమానం రాలేదు. ఇదే సమయంలో రాజేష్ ఫ్రెండ్ భార్యకు బిస్కేట్ వేశాడు. అయితే బైక్ లో రాజేష్ తో కలిసి ఉద్యోగానికి వెళ్లి వస్తున్న అభిరామి భర్త ప్రాణ స్నేహితుడు అని కూడా చూడకుండా అతకి లొంగిపోయి రోజూ రసగుల్లాలు ఇవ్వడం మొదలుపెట్టింది.

 ఏమండి..... కామానికి కళ్లులేవు తెలుసా ?

ఏమండి..... కామానికి కళ్లులేవు తెలుసా ?

ఇంటి నుంచి ఉద్యోగానికి బైక్ లో వెలుతున్న రాజేష్, అభిరామి నేరుగా కంపెనీ దగ్గరకు వెళ్లకుండా అక్కడక్కడ నిలిపి ఎంజాయ్ చెయ్యడం, రాత్రి లేటుగా ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఈ విషయం అక్కడా ఇక్కడ తెలిసి భర్త మణికందన్ చెవిలో పడింది. భార్య అభిరామి ప్రవర్తన మీద అనుమానం రావడం ఆమెను మణికందన్ నిలదీశాడు. అయితే భర్త మణికందన్ మాటలు లెక్కచెయ్యని అభిరామి కామానికి కళ్లులేవు అనే టైప్ లో ప్రవర్తించింది. భార్య అభిరామికి ఎన్నిసార్లు మందలించినా ఫలితం లేకపోవడంతో మణికందన్ రగిలిపోయాడు.

 ఇంట్లో ప్రియుడిపై పెట్రోల్ పోసి కాల్చేసిన భర్త

ఇంట్లో ప్రియుడిపై పెట్రోల్ పోసి కాల్చేసిన భర్త

మూడు రోజుల క్రితం బెడ్ రూమ్ లో అభిరామి, రాజేష్ రొమాన్స్ చేస్తూ మణికందన్ కు అడ్డంగా చిక్కిపోయారు. ఇద్దరిని చితకబాదేసిన మణికందన్ ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు. అయితే శనివారం రాత్రి భార్య అభిరామి వీడియో కాల్ లో రాజేష్ తో మాట్లాడుతున్న విషయం గుర్తించిన భర్త మణికందన్ మరింత రగిలిపోయాడు. అంతే క్యాన్ లో ఐదు లీటర్ల పెట్రోల్ తీసుకున్న మణికందన్ నేరుగా రాజేష్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో అభిరామితో ఫోన్ లో మాట్లాడుతున్న రాజేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మణికందన్ ఇంటి బయట గడియ పెట్టాడు.

ప్రియురాలి మొగుడే యుముడు

ప్రియురాలి మొగుడే యుముడు

నువ్వు నా భార్యతో వీడియో కాల్ లోనే మాట్లాడుతూ యుముడి దగ్గరకు వెళ్లిపోరా అంటూ మణికందన్ గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు రాజేష్ ను అంబూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం కాలిపోయిన రాజేష్ ను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అయితే రాజేష్ ప్రాణాలు పోయాయని పోలీసులు అన్నారు. భార్య అభిరామి ప్రియుడు రాజేష్ ను చంపేశానని, త్వరలో జైలు నుంచి బయటకు వచ్చి తన భార్య అభిరామిని పైలోకాలకు పంపిస్తానని మణికందన్ ఆవేశంతో రగిలిపోతున్నాడని పోలీసులు అన్నారు.

English summary
Illegal affair: Husband sets fire on a youth who allegedly has illegal relationship with his wife in Ambur. police arrested and investigation going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X