• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: కాలేజ్ అమ్మాయి, అంకుల్ లవ్ స్టోరీ, భార్య VS యువతి: ముగ్గురి ప్రాణాలు బలి !

|

చెన్నై/ పుదుకోటై: కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తి కాలేజ్ అమ్మాయితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలను గాలికి వేదిసి అక్రమ సంబంధం పెట్టుకుని జల్సాలు చేస్తున్న భర్తను భార్య నిలదీసింది. భార్య మాటలు పట్టించుకోని భర్త నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ ఎదురుతిరిగాడు. కనీసం తన బాధను కాలేజ్ అమ్మాయి అయినా అర్థం చేసుకుంటుందని భార్య పొరపాటు పడింది. అయితే అంకుల్ ను వదిలి తాను ఉండలేనని, కావాలంటే నువ్వే విడాకులు ఇచ్చేయ్ అంటూ కాలేజ్ అమ్మాయి తేల్చిచెప్పింది. కాలేజ్ అమ్మాయితో కలిసి భర్త పారిపోవడంతో అవమానంతో భార్య ఇద్దరు పిల్లలకు నిప్పంటించి హత్య చేసి ఆమె నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది,

Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!

 13 ఏళ్లు హ్యాపీలైఫ్

13 ఏళ్లు హ్యాపీలైఫ్

తమిళనాడులోని పుదుకోటై జిల్లా అరంతాగి సమీపంలోని వల్లంబాక్కం కాడు ప్రాంతంలో ముత్తు అలియాస్ ముత్తురామన్ (46), రాధ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. ముత్తు, రాధ దంపతులకు అభిషేక్ (13), అభిరుద్ (9) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రాధ, ఇద్దరు పిల్లలతో కలిసి 13 ఏళ్లుగా ముత్తు చాలా సంతోషంగా జీవించాడు. రెండు సంవత్సరాల క్రితం ముత్తు మనసు మారిపోయి చెడుతిరుగుళ్లు తిరగడం మొదలుపెట్టాడు.

రత్నకోట అమ్మాయి

రత్నకోట అమ్మాయి

ముత్తుకు సొంత పోలం ఉంది. వ్యవసాయం చేస్తూ ముత్తు లక్షల రూపాయలు సంపాధిస్తున్నాడు. డబ్బు బాగా సంపాదిస్తున్న ముత్తు ఇటీవల కాలంలో మహిళలతో తిరగడం మొదలుపెట్టాడు. రత్నకోట గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి అరంతాంగిలోని ఓ ప్రేవేట్ కాలేజ్ లో చదువుతున్నది. ప్రతిరోజు ఆమె కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో ముత్తుకు పరిచయం అయ్యింది.

 బండి భలే తోలుతున్న అంకుల్ తో లింక్

బండి భలే తోలుతున్న అంకుల్ తో లింక్

కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతికి దగ్గర అయిన ముత్తు ఆమెను అతని బైక్ లో తిప్పడం మొదలుపెట్టాడు. ఇలా ముత్తు, కాలేజ్ అమ్మాయి చాలా దగ్గర అయ్యారు. ముత్తు, కాలేజ్ అమ్మాయి ఎప్పుడుపడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి రహస్య ప్రాంతాల్లో ఏకాంతంగా గడపడం మొదలుపెట్టారు. ముత్తు, కాలేజ్ అమ్మాయి విచ్చలవిడిగా తిరగడంతో ఆ విషయం ముత్తు భార్య రాధతో పాటు చాల మందికి తెలిసిపోయింది.

 కూతురు వయసు అమ్మాయితో ఏంటీపాడుపని

కూతురు వయసు అమ్మాయితో ఏంటీపాడుపని

ఇద్దరు పిల్లలను బాగా చదివించుకుని అందరిలో మంచిపేరు తెచ్చుకోకుకుండా కూతురు వయసు ఉన్న అమ్మాయిత తిరగడం ఏమిటని భార్య రాధ భర్త ముత్తును మందిలించింది. అయితే భార్య రాధ మాటలను లెక్కచెయ్యని ముత్తు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఎదురుతిరిగాడు. ఇదే సమయంలో సాటి యువతి తనను అర్థం చేసుకుంటుందని రాధ వెళ్లి తన భర్తతో తిరుగుతున్న కాలేజ్ అమ్మాయి కాళ్లు పట్టుకుని నా భర్తను వదిలేయాలని వేడుకుంది.

 అంకుల్ తో అమ్మాయి లేచిపోయింది

అంకుల్ తో అమ్మాయి లేచిపోయింది

భార్య రాధ తన జల్సాలకు ప్రతిరోజు అడ్డుపడుతున్నదని రగిలిపోయిన ముత్తు కాలేజ్ అమ్మాయితో కలిసి ఊరు వదిలిపారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. కుమార్తె ఇల్లు వదిలివెళ్లిపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ముత్తు మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పోలీసులు వెళ్లి రాధను నీ భర్త ఎక్కడ అంటూ విచారణ చేశారు.

అక్రమ సంబంధానికి ముగ్గురి ప్రాణాలు బలి

అక్రమ సంబంధానికి ముగ్గురి ప్రాణాలు బలి

తన భర్త ముత్తు మీద కిడ్నాప్ కేసు నమోదు అయ్యిందని రాధ అవమానంతో కుంగిపోయింది. ఇదే సమయంలో నీ భర్తను గాలికి వదిలేశావా ? అంటూ అందరూ రాధను సూటిపోటిమాటతో తిట్టారు. తన ఇద్దరు కుమారులను తన భర్త చూసుకోడని, నేను ఆత్మహత్య చేసుకుంటే ఇద్దరు కుమారులు అనాథలు అవుతారని రాధ ఆందోళన చెందింది. రాత్రి అన్నంలో నిద్రమాత్రలు కలిపి అభిరుద్, అభిషేక్ కు పెట్టింది. ఇద్దరు పిల్లలు నిద్రపోయిన తరువాత వారిమీద పెట్రోల్ పోసి నిప్పంటించిన రాధ ఆమె నిప్పంటించుకుంది. రాధ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే రాధ, అభిషేక్ సజీవదహనం అయ్యారు. అభిరుద్ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడని పోలీసులు చెప్పారు. కామంతో కాలేజ్ అమ్మాయితో కలిసి పారిపోయిన ముత్తు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Illegal affair: Mother killed her kids and committed suicide near Pudukottai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X