• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: నా ప్రియురాలు శాడిస్టు, భర్తనే వదల్లేదు, నన్ను టార్చర్ పెట్టి కోరికలు తీర్చుకుంది!

|

తిరుపతి/ చెన్నై/ చిత్తూరు: బతుకుదెరువు కోసం ఊరికాని ఊరు వెళ్లిన దంపతులు కొంతకాలం సంతోషంగా జీవించారు. భర్త బయటకు వెళ్లిన తరువాత ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి పరిచయం కాస్తా స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ వీడియోకాల్స్ చేసుకునే వరకు వెళ్లింది. భర్తను బ్రెడ్, గులబ్ జామ్ తినిపించిన భార్య ప్రియుడికి మాత్రం రుచిగా ఉండే రసగుల్లా, జామున్ తినిపించింది. రానురాను భార్య అక్రమ సంబంధం భర్తకు తెలిసిపోయింది.

భర్తను చితకబాది పుట్టింటికి పంపించేశాడు. పుట్టింటిలో ఉంటున్న భార్య ఆమె ప్రియుడిని పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. తన చిన్న కొడుకును చూస్తే అచ్చం తన భర్త గుర్తుకు వస్తున్నాడని రగిలిపోయిన భార్య కన్న బిడ్డకు నరం చూపించింది. కొడుకును చిత్రహింసలకు గురి చేసే వీడియోలు తీసి ఆమె భర్త, ప్రియుడికి పంపించింది. కొడుకును చిత్రహింసలకు గురి చేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

తన అక్రమ సంబంధం కారణంగా కొడుకును చిత్రహింసలకు గురి చేశానని భార్య అంగీకరించింది. ప్రియుడికి వెంటాడని పట్టుకున్న పోలీసులు అతన్ని బెండ్ తీశారు. పోలీసుల విచారణలో కన్న కొడుకుకు నరకం చూపించిన ప్రియురాలి గురించి ఆమె ప్రియుడు చెప్పిన షాకింగ్ సమాచారం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నా ప్రియురాలు శాడిస్టు, ఆమె అతని భర్తనే వదల్లేదు, నన్ను టార్చర్ పెట్టి పిలిపించుకుని ఆమె కోరికలు తీర్చుకుందని ప్రియుడు చెప్పడంతో పోలీసుల మతిపోయింది.

Wife: భర్తకు క్వాటర్ మందు, బలిసిన నాటుకోడి ఫిగర్ తో ఎంజాయ్, భార్యకు పస్తులు, చంపేసి ఎస్కేప్!Wife: భర్తకు క్వాటర్ మందు, బలిసిన నాటుకోడి ఫిగర్ తో ఎంజాయ్, భార్యకు పస్తులు, చంపేసి ఎస్కేప్!

పేరుకు పెళ్లి చేసుకుంది అంతే

పేరుకు పెళ్లి చేసుకుంది అంతే

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మనలప్పడి సమీపంలోని మెట్టూరు ప్రాంతంలో వడివేల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 2016లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జల్లా రాంపల్లిలో నివాసం ఉంటున్న తులసి (23) అనే యువతితో వడివేల్ వివాహం అయ్యింది. యవ్వనంలోకి వచ్చిన తులసికి వివాహం చేసిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మెట్టూరులోని అత్తారింటికి పంపించేశారు.

చెన్నైలో కాపురం

చెన్నైలో కాపురం

వడివేల్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. వడివేల్ తో కాపురం చేసిన అతని భార్య తులసి గోకుల్ (4), ప్రదీప్ (2) అనే ఇద్దరు కుమారులకు తల్లి అయ్యింది. చెన్నై చేరుకున్న వడివేల్, తులసి దంపతులు రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా పనులు తగ్గిపోవడంతో వడివలకన్ భార్య తులసి, ఇద్దరు కొడుకులతో కలిసి సొంత ఊరుకు వెళ్లిపోయాడు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

భర్త బయటకు వెళ్లిన తరువాత ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య తులసికి చెన్నైలో నివాసం ఉంటున్న మణికందన్ అలియాస్ ప్రేమ్ కుమార్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. మణికందన్, తులసిల పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుకోవడమే కాకుండా స్మార్ట్ ఫోన్ పుణ్యమా అంటూ వీడియోకాల్స్ చేసుకునే వరకు వెళ్లింది.

ప్రియుడితో మస్త్ మాజా చేసిన భార్య

ప్రియుడితో మస్త్ మాజా చేసిన భార్య

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా ముచ్చవాడి ప్రాంతానికి చెందిన మణికందన్ చెన్నైలోనే ఉండిపోవడంతో అతను నిత్యం ప్రియురాలు తులసిని కలవడం మొదలు పెట్టాడు. భర్త వడివేల్ బయటకు వెళ్లిన వెంటనే ప్రియుడు మణికందన్ కు ఫోన్ చేసి ఇంటికే పిలిపించుకుంటున్న తులసి ఇద్దరు పిల్లలను బయటకు పంపించి అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది.

రెచ్చిపోయిన భార్య

రెచ్చిపోయిన భార్య

తన భార్య తులసికి అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న ఆమె భర్త వడివేల్ ఆమెను పట్టుకుని చితకబాదేశాడు. భర్త వడివేల్ ఎంత కొట్టినా అతని భార్య తులసి మాత్రం మొండిగా పద్దతి మార్చుకోకుండా ప్రియుడు మణికందన్ తో కలిసి ఎక్కడపడితే అక్కడ తిరిగింది. భార్య తులసిని కొట్టికొట్టి ఆమె భర్త వడివేల్ విసిగిపోయాడని తెలిసింది.

పుట్టింటిలో దుకాణం పెట్టిన భార్య

పుట్టింటిలో దుకాణం పెట్టిన భార్య

గొడవలు ఎక్కువ కావడంతో వడివేల్ అతని భార్య తులసిని తన్ని ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని రాంపురలోని ఆమె పుట్టింటికి తరిమేశాడు. చిత్తూరు జిల్లాలోని రాంపురలోని పుట్టింటిలో ఉంటున్న తులసి ఆమె ప్రియుడు మణికందన్ అక్కడికే పిలిపించుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ప్రియుడు మణికందన్ మోజులో పడిపోయిన తులసికి ఆమె రెండో కొడుకు పదేపదే అడ్డుపడుతూ వచ్చాడు.

కొడుకుకి నరకం చూపించి వీడియోలు తీసింది

కొడుకుకి నరకం చూపించి వీడియోలు తీసింది

అప్పటికే భర్త వడివేల్ మీద పగ తీర్చుకోవడానికి వేచి చూస్తున్న తులసి ఆమె రెండు సంవత్సరాల వయసు ఉన్న కొడుకు ప్రదీప్ ను చూస్తే తన భర్తకు గుర్తుకు వస్తున్నాడని రగిలిపోయి చిన్నారికి చిత్రహింసలకు గురి చేసింది. ఆ చిన్నారికి నరకం చూపిస్తూ ఆ వీడియో తీసి ప్రియుడు మణింకదన్ తో పాటు భర్త వడివేల్ కు పంపించింది.

భార్యకు బెండ్ తీసిన పోలీసులు

భార్యకు బెండ్ తీసిన పోలీసులు

ప్రియుడు మణికందన్ మోజులో పడిన తన భార్య తులసి నా కొడుకును చిత్రహింసలకు గురి చేస్తోందని ఆ వీడియో పోలీసులకు చూపించి వడివేలు ఆమె మీద తమిళనాడులోని సొంత ఊరు సత్యమంగలం పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు. సత్యమంగలం పోలీసులు చిత్తూరులోని రాంపురకు వెళ్లి తులసిని విచారణ చెయ్యగా ఆమె మానసిక అస్వస్థతకు గురైనట్లు నటించి పోలీసు కేసు నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి తులసిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రియురాలి అరెస్టుతో అత్త ఇంట్లో దాక్కొన్న ప్రియుడు

ప్రియురాలి అరెస్టుతో అత్త ఇంట్లో దాక్కొన్న ప్రియుడు

తులసి అరెస్టు కావడం, తమిళనాడులో ఆమె చేసిన అరాచకాలు హాట్ టాపిక్ కావడంతో ప్రియుడు మణికందన్ చెన్నై నుంచి పారిపోయి అరంతంగి ప్రాంతంలోని అతని మేనత్త ఇంటిలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మణికందన్ ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలోమణికందన్ అతని ప్రియురాలు తులసి గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.

బిడ్డలు పుట్టి అందం తగ్గిపోయిందని కోపం

బిడ్డలు పుట్టి అందం తగ్గిపోయిందని కోపం

తన ప్రియురాలు తులసితో తనకు అక్రమ సంబంధం ఉందని మణికందన్ అంగీకరించాడు. ఇద్దరు కొడుకులు పుట్టిన తరువాత నీ అందం తగ్గిపోయిందని తాను చెప్పానని, అప్పటి నుంచి ఇద్దరి కొడుకుల మీద తులసి పగ పెంచుకుందని మణికందన్ అన్నాడు. కొడుకులు ఇద్దరిని దూరం చేసుకుంటే తనతో జీవితాంతం కలిసి ఉండాలని తులసి ఆశపడిందని మణికందన్ పోలీసులకు చెప్పాడు.

నా ప్రియురాలు శాడిస్టు.... భర్తనే వదల్లేదు

నా ప్రియురాలు శాడిస్టు.... భర్తనే వదల్లేదు

తులసి అతని భర్త వడివేల్ కు నరకం చూపించిందని, తాను ఆమెకు లెక్కలో లేనని ,తనను టార్చర్ పెట్టి చిత్తూరుకు పిలిపించుకుని కోరికలు తీర్చుకునేదని ఆమె ప్రియుడు మణికందన్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇప్పటికే తులసిని జైలుకు పంపించిన పోలీసులు అమె ప్రియుడు మణికందన్ ను కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చెయ్యడంతో మణికందన్ ను జైలుకు పంపించామని సత్యమంగలం పోలీసులు తెలిపారు.

English summary
Illegal affair: Sadist woman's paramour statement about Thulasi why she tortured her child in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X