• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair:నా భార్యకు వన్ + వన్ ఫ్రీ, ప్రియుడికి మా అత్త బ్రోకర్, అందుకే నరికేశా,నా స్కెచ్ వేరే

|

చెన్నై/ తిరుచ్చి/ మదురై: సివిల్స్ పరీక్షలు రాస్తానని భర్తకు చెబుతున్న భార్య రోజు సింగారించుకుని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగింది. ఇంట్లో ఉంటున్న కుమార్తెను చూసుకుంటున్న భర్త భార్య తీరుతో విసిగిపోయాడు. నువ్వు నీ పద్దతి మార్చుకోవాలని భర్త భార్యకు చెప్పాడు. అంతలోనే అడ్డం దూరుతున్న అత్త అల్లుడిని లెక్కచెయ్యకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడింది. రోజు ఇదే పంచాయితీనా, నువ్వు నీ కూతురికి నాతో పాటు మరో వ్యక్తిని రంకు మొగుడిగా తెస్తావా ? అంటూ అల్లుడు నిలదీశాడు. చివరికి సహనం కోల్పోయిన భర్త అర్దరాత్రి భార్య, అత్త తలలను అడ్డంగా నరికేశాడు. ఈ కేసులో భర్త పోలీసులకు చిక్కడంతో కలకలం రేపే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. నా భార్యకు ఆమె బంధువుతో అక్రమ సంబంధం ఉందని తెలిసినా ఆమె తల్లి వత్తాసు పలికిందని, కూతురిని ఎంజాయ్ చెయ్యమని మా అత్త అతని దగ్గరకు పంపించిందని, అందుకే ఇంత కథ జరిగిందని భర్త పోలీసులకు చెప్పాడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

కోర్టులో లొంగిపోయిన భర్త

కోర్టులో లొంగిపోయిన భర్త

భార్య, అత్త తలలు నరికి పోలీసులకు చిక్కకుండా స్నేహితుల సహాయంతో పారిపోయిన ఉలగనాథన్ తమిళనాడులోని తిరుచ్చి కోర్టు ముందు లొంగిపోయాడు. కోర్టులో లొంగిపోయిన ఉలగనాథన్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయమూర్తికి మనవిచేశారు. న్యాయమూర్తి రాజమాణిక్యం అనుమతితో పోలీసులు ఉలగనాథన్ ను నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఉలగనాథన్ దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు చెప్పాడు.

ఉద్యోగం లేదని భార్యకు చులకనైన భర్త

ఉద్యోగం లేదని భార్యకు చులకనైన భర్త

తమిళనాడులోని తిరుచ్చిలోని నాయక్ స్ట్రీట్ లో ఉలగనాధన్ (35), పవిత్ర (30) దంపతులు నివాసం ఉంటున్నారు. ఉలగనాథన్, పవిత్ర దంపతులకు 3 ఏళ్ల కనిష్కా అనే కుమార్తె ఉంది. తిరుచ్చిలోని ఓ టైర్ కంపెనీలో ఉలగనాథన్ ఇంతకాలం ఉద్యోగం చూసేవాడు. ప్రస్తుతం ఉద్యోగం మానేసిన ఉలగనాథన్ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం మానేసిన ఉలగనాథన్ ను అతని భార్య పవిత్రకు, ఆమె కుటుంబ సభ్యులకు చులకన అయ్యాడు.

భార్య పవిత్ర రూటే సపరేటు

భార్య పవిత్ర రూటే సపరేటు

టీఎన్ పీఎస్ సీ (గ్రూప్ పరీక్షలు) రాయడానికి పవిత్ర తిరుచ్చిలోని ఓ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో స్నానం చేసి మేకప్ వేసుకుని నీట్ గా రెఢీ అయ్యి కోచింగ్ సెంటర్ కు వెలుతున్న భార్య పవిత్ర సాయంత్రం ఇంటికి తిరిగి వస్తోంది. పవిత్ర తీరుపై భర్త ఉలగనాథన్ అసహనం పెంచుకున్నాడు. ఏదో జరుగుతోంది అంటూ భర్త భార్య పవిత్ర మీద అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయం పవిత్ర కుటుంబ సభ్యులకు చెప్పినా వారు ఏ మాత్రం పట్టించుకోలేదని, కనీసం పవిత్రను మందలించలేదని ఉలగనాథన్ ఆరోపిస్తున్నాడు.

 గ్రూప్ పరీక్షలు కాదు, గూడుపుటాని

గ్రూప్ పరీక్షలు కాదు, గూడుపుటాని

గ్రూప్ పరీక్షలు రాయడం కోసం శిక్షణ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్ కు వెలుతున్న తన భార్య పవిత్ర మీద తనకు అనుమానం వచ్చిందని, తాను కొన్ని రోజులు ఆమెను రహస్యంగా ఫాలో అయ్యాయని ఉలగనాథన్ పోలీసులకు చెప్పాడు. కోచింగ్ సెంటర్ నుంచి మద్యలోనే బయటకు వస్తున్న పవిత్ర అతని సమీప బంధువుతో కలిసి అతని రూమ్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తోందని, తన భార్య పవిత్ర గూడుపుటాని గురించి ఆమె తల్లిదండ్రులకు తెలిసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం మందలించలేదని ఉలగనాథన్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కొన్ని రోజులు పవిత్రతో తనకు గొడవలు జరిగాయని ఉలగనాథన్ పోలీసులకు చెప్పాడు.

నా కూతురికి వాడు రెండో మొగుడు

నా కూతురికి వాడు రెండో మొగుడు

కొన్ని రోజుల క్రితం కుమార్తె పవిత్ర, మనుమరాలు కినిష్కాని చూడటానికి ఉలగనాథన్ అత్త కలైసెల్వి తిరుచ్చిలోని కూతురు పవిత్ర ఇంటికి వెళ్లింది. రోజు కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న భార్య పవిత్రతో నువ్వు ఎవడితో తిరుగుతున్నావ్ ? వాడు ఎవడు అంటూ భర్త ఉలగనాథన్ గొడవ పెట్టుకున్నాడు. అల్లుడిపై అతని అత్త కలైసెల్వి మండిపడింది. ఏం నాకూతురి మీద నీకు నమ్మకం లేదా ?, ఎందుకు పదేపదే గొడవ పడుతున్నావ్, అవునురా వాడు నా కూతురికి రెండో మొగుడు, నువ్వు ఏం చేస్తావ్ ? అంటూ ఉలగనాథన్ పై అత్త కలైసెల్వి రెచ్చిపోయింది.

భార్య, అత్తను అడ్డంగా నరికిన అల్లుడు

భార్య, అత్తను అడ్డంగా నరికిన అల్లుడు

రాత్రి పొద్దుపోయే వరకు ఉలగనాథన్, అతని భార్య పవిత్ర, అత్త కలైసెల్విల మద్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. తరువాత పవిత్ర, ఆమె తల్లి కలైసెల్వి ఒక గదిలో నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత పదునైన కొడవలి తీసుకున్న ఉలగనాథన్ నిద్రపోతున్న భార్య పవిత్ర, అత్త కలైసెల్విల తలలు కసితీరా నరికేయడంతో వారి ప్రాణాలు అక్కడే పోయాయి. భార్య, అత్తను హత్య చేసిన ఉలగనాథన్ కుమార్తె కనిష్కాను ఎత్తుకుని ఇంటి బయట కారులో సిద్దంగా ఉన్న స్నేహితులు కారులో అక్కడి నుంచి పరారైనాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఉలగనాథన్ కుమార్తె కనిష్కా కోసం చివరికి కోర్టు ముందు లొంగిపోయాడు.

నా భార్యకు రంకు మొగుడు అంటూ వంతపాడిన అత్త

నా భార్యకు రంకు మొగుడు అంటూ వంతపాడిన అత్త

పవిత్ర తీరుపై అసహనంతో ఆమెను తాను నిలదీశానని, తన కాపురంలో చిచ్చు రేపుతున్న అత్త కలైసెల్విలను చంపేశానని ఉలగనాథన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. అందుకే పక్కింటి వాళ్లకు కూడా సౌండ్ రాకుండా భార్య పవిత్ర, అత్త కలైసెల్విలను హత్య చేశానని ఉలగనాథన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

 కొడవలి కొనిందే వాడికోసమే

కొడవలి కొనిందే వాడికోసమే

అసలు తాను కొడవలి తీసుకుంది తన భార్య పవిత్ర ప్రియుడిని చంపడానికి అని, రెండుమూడు సార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించి విఫలం అయ్యానని ఉలగనాథన్ పోలీసులకు చెప్పాడు. భార్య పవిత్ర, అత్త కలైసెల్విని హత్య చేసిన తరువాత ఉలగనాథన్ ను అక్కడి నుంచి తప్పించడానికి కారులో వెళ్లిన అతని స్నేహితులు సత్యరాజ్, శర్మాలను పోలీసులు అరెస్టు చేశారు. భార్య, అత్తలను హత్య చెయ్యడానికి ఉలగనాథన్ ఉపయోగించిన కొడవలి, పారిపోవడానికి ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Illegal affair: Trichy youth ulaganathan Confession in police. i was killed wife and mother-in-law over my wife's extra love with her relation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X